»   » ర‌వితేజ, అనిల్ రావిపూడి, దిల్ రాజు చిత్రం రాజా ది గ్రేట్‌ ప్రారంభం (ఫోటోస్)

ర‌వితేజ, అనిల్ రావిపూడి, దిల్ రాజు చిత్రం రాజా ది గ్రేట్‌ ప్రారంభం (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ హీరోగా, ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప‌టాస్‌, సుప్రీమ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల తెరకెక్కించిన అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా రూపొందుతున్న చిత్రం రాజా ది గ్రేట్. వెల్‌క‌మ్ టు మై వ‌ర‌ల్డ్‌ క్యాప్ష‌న్‌.

ఈరోజు హైద‌రాబాద్‌లో ఈ సినిమా లాంచ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ర‌వితేజ‌, మెహ‌రీన్‌ల‌పై ముహుర్త‌పు స‌న్నివేశానికి హీరో, నిర్మాత నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ క్లాప్ కొట్ట‌గా, ప్ర‌ముఖ ఫైనాన్సియ‌ర్ ఎం.వి.ఆర్‌.ఎస్‌.ప్ర‌సాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు.

 ర‌వితేజతో భ‌ద్ర సినిమా త‌ర్వాత చేస్తున్న సినిమా

ర‌వితేజతో భ‌ద్ర సినిమా త‌ర్వాత చేస్తున్న సినిమా

ఈ సంద‌ర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ``ర‌వితేజతో భ‌ద్ర సినిమా త‌ర్వాత చేస్తున్న సినిమా రాజాది గ్రేట్‌. అలాగే డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో సుప్రీమ్ త‌ర్వాత చేస్తున్న సినిమా ఇది. ఈ రెండు సినిమాల‌ను దాటి ఈ సినిమా పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ అవుతుంది`` అన్నారు.

 ఇప్ప‌టి వ‌ర‌కు ర‌వితేజగారు చేయ‌ని విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో

ఇప్ప‌టి వ‌ర‌కు ర‌వితేజగారు చేయ‌ని విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో

ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ - ``ర‌వితేజ‌గారితో చేస్తున్న డిప‌రెంట్ కాన్సెప్ట్ మూవీ. ఇప్ప‌టి వ‌ర‌కు ర‌వితేజగారు చేయ‌ని విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో క‌న‌ప‌డ‌తారు అని దిల్ రాజు వెల్లడించారు.

 అవుటండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా

అవుటండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా

అలాగే దిల్‌రాజుగారి బ్యాన‌ర్‌లో రెండో సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది. ర‌వితేజ‌గారి అభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా సినిమాను అవుటండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిస్తాం. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన ఇత‌ర న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియజేస్తామని దర్శకుడు తెలిపారు.

 రాజా ది గ్రేట్

రాజా ది గ్రేట్

రవితేజ, మెహరీన్ కౌర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణః దిల్ రాజు, నిర్మాతః శిరీష్‌, క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః అనిల్ రావిపూడి.

 వరుస సినిమాలు

వరుస సినిమాలు

గత సంవత్సరం అసలు సినిమాలేవీ చేయకుండా గ్యాప్ తీసుకున్న రవితేజ ఇపుడు వరుస సినిమాలకు కమిట్ అవుతుండటం విశేషం. ఏది ఏమైనా రవితేజ వరుస సినిమాలకు కమిట్ అవ్వడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 రవితేజ మరో మూవీ టచ్ చేసి చూడు

రవితేజ మరో మూవీ టచ్ చేసి చూడు

ప్రస్తుతం రవితేజ బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ నిర్మిస్తున్న ‘టచ్ చేసి చూడు' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చత్రం ద్వారా విక్రమ్ సిరికొండ దర్శకునిగా పరిచయవుతున్నారు.

English summary
Mass Maharaja Ravi Teja and Supreme director Anil Ravipudi’s next, Raja The Great was launched at a ceremony in Hyderabad on Monday morning. The film which is being produced by Sri Venkateshwara Creations banner by Sirish and being presented by Dil Raju, is a complete entertainer in the offing. The film that has the tagline “Welcome To My World” had a puja muhurtam where Ravi Teja, the film’s lead actress Mehreen Kaur Pirzada were in presence and shot the first scene that was given a clap by producer and actor Nandamuri Kalyan Ram. Renowned financier MVRS Prasad switched on the camera.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu