»   » ఫ్లాఫ్ టాక్..రవితేజ మెచ్చుకుంటూ ట్వీట్

ఫ్లాఫ్ టాక్..రవితేజ మెచ్చుకుంటూ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సందీప్‌ కిషన్‌, సీరత్‌కపూర్‌ జంటగా నటించిన చిత్రం 'టైగర్‌'. రాహుల్‌ రవీంద్రన్‌ మరో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా మొన్న శుక్రవారం విడుదలైంది. 'టైగర్‌' చిత్రానికి వి.ఐ. ఆనంద్‌ దర్శకత్వం వహించగా ఠాగూర్‌ మధు నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి బయిట ఫ్లాఫ్ టాక్ రన్ అవుతోంది. మరో ప్రక్క ఈ చిత్రం గురించి రవితేజ, నిన్న అల్లు అర్జున్ మెచ్చుకున్నారు. ఈ విషయాన్ని సందీప్ కిషన్ ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


బన్ని కాల్ గురించి...


"వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తర్వాత బన్నీ అన్న దగ్గర నుండి టైగర్ సినిమాకు ఫోన్ వచ్చింది. కంగ్రాట్స్, సినిమా చాలా నచ్చింది అని చెప్పాడు బన్నీ. నాకైతే ఈ కాల్ మళ్ళీ కొత్త ఎనర్జీనిచ్చింది" అంటూ సందీప్ కిషన్ తన ఆనందాన్ని పంచుకున్నారు.


‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' తర్వాత ఆ స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేకపోయిన సందీప్ కిషన్, ‘టైగర్' ద్వారా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌'ను దాటేసాడని బన్ని అన్నారు. నిన్న నిర్వహించిన సక్సెస్ టూర్లో ప్రేక్షకుల నుండి వచ్చిన రెస్పాన్స్‌కు థ్రిల్ అయిన సందీప్, ఈ ఉదయం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫోన్‌తో మరింత థ్రిల్ అయ్యారు.


Mass Raja Ravi Teja delights Tiger team

చిత్రవిశేషాలను ఎన్వీ ప్రసాద్ చెబుతూ - "ప్రేమ, స్నేహం, యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలున్న మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది. సందీప్ కిషన్ ది ఫుల్ మాస్ మరియు ఎనర్జిటిక్ కారెక్టర్. తమన్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది" అని చెప్పారు.


‘ఠాగూర్' మధు మాట్లాడుతూ - "ఇది పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించాం. హీరోగా సందీప్ కిషన్ కెరీర్ ని మరో స్థాయికి తీసుకెళ్లే చిత్రం. అన్నివర్గాల వారూ చూడదగ్గ విధంగా చిత్రం " అన్నారు.


తనికెళ్ల భరణి, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, పృథ్వీరాజ్. సుప్రీత్, ప్రవీణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, కెమెరా: ఛోటా కె. నాయుడు, ఎడిటింగ్: ఛోటా కె. ప్రసాద్, ఫైట్స్: వెంకట్, ఆర్ట్: రాము, ఆఫీస్ ఇన్ చార్జ్: భగ్గా రామ్, కో-డైరెక్టర్: పుల్లారావు కొప్పినీడి, లైన్ ప్రొడ్యూసర్: జి. నాగేశ్వరరావు.


English summary
Sundeep Kishan tweeted "Malli Venkatadri Express tharavatha ippudu vachindi call cinema adhirindhi anni,ee sari Ravi Teja annaya degirinundi :) work satisfaction :D".
Please Wait while comments are loading...