»   »  సెన్సార్ వాళ్లు షాక్ ...'ఎ' సర్టిఫికెట్ కి నో

సెన్సార్ వాళ్లు షాక్ ...'ఎ' సర్టిఫికెట్ కి నో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :ఎన్నో సినిమాలు చూసి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చే సెన్సార్ వారు షాకయ్యే సంఘటనలు అప్పుడప్పుడూ జరుగుతూంటాయి. అలాంటిదే తాజాగా సన్నిలియోన్ చిత్రం 'మస్తిజాదే' కి ఎదురైంది. ఆమె నటించిన చిత్రం ట్రైలర్ చూసి షాకైన సెన్సార్ సభ్యులు ఇక సినిమా కూడా చూసి చేతులెత్తేశారు.

ఇక చేసేది లేక చిత్ర నిర్మాతలు రివైజింగ్ కమిటీని ఆశ్రయించారు. వాళ్లు కూడా సినిమా చూసి నోరెళ్లబెట్టారు. ఇక ఏం చేయాలో తోచక ట్రిబ్యునల్‌ను ఆశ్ర యించారు. ఏదో అనుకుని చూసిన ట్రిబ్యునల్ సభ్యులు అందులో సన్నివేశాలు చూసి విస్తుపోయారట.

దీంట్లో చాలా అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని, ఒకవేళ 'ఎ' సర్టిఫికెట్ ఇద్దామన్నా, ఆ లెవెల్‌ను ఎప్పుడో ఈ సినిమా దాటిపోయిందని వ్యాఖ్యానించారు. దాదాపు 36 ఏళ్ల తర్వాత సెన్సారింగ్‌లో ఉన్న మూడు స్థాయిల్లోనూ తిరస్కరణకు గురైన సినిమా ఇదేనని బాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. మిలాప్ జవేరి దర్శకత్వంలో సన్నీలియోన్ నటించిన చిత్రం 'మస్తిజాదే'.

 Mastizaade refused certification by the Tribunal

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

పూర్తి వివరాల్లోకి వెళితే..

మే 1 న విడుదల కావల్సిన ఈ సినిమా సడెన్ గా ఆగిపోయింది. దాంతో సన్నీతో పాటు అభిమానులు కూడా నిరాశకు గురి అయ్యారు. దీనికి కారణం మస్తి జాదే లో హాట్ కంటెంట్ ఎక్కవగా ఉండడమేనట. సన్నీ ఇందులో రెచ్చిపోయి కొన్ని సీన్లలో వల్గర్ గా సెమీ పోర్న్ ఫిల్మ్ తరహాలో నటించిందట. దీంతో మస్తీ జాదేకు ఎన్ని కత్తెర్లు వేసినా సెన్సార్ నుండి బయటికి రాలేక పోయిందట.

మస్తి జాదే సినిమా ట్రైలర్ లోనే సన్నీ తన అందాల డోస్ గురించి హింట్ ఇచ్చింది. దాంతో ఈ సినిమాకు భారీ పబ్లిసిటీ వచ్చింది... అదే అదునుగా భావించి విడుదలకు సిద్దమైన నిర్మాతలకు మస్తిజాదే రిలీజ్ క్యాన్సిల్ కావడం ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది.

ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు కత్తెరకు బాగానే పని చెప్పారట. అయినా సినిమా మొత్తం అన్ని సీన్లలో సన్నీ చాలా బోల్డ్ గా కనిపించిందట. దీంతో తర్జన భర్జనలో పడ్డ సెన్సార్ సభ్యులు మస్తి జాదేను రివైజింగ్ కమిటికి పంపారట. అయితే అక్కడ కూడా అదే పరిస్థితి ఉన్నట్టు సమాచారం.

English summary
Sunny Leone received appreciation for her performance in Ek Paheli Leela and the film also got some good words from the critics. However, the diva's upcoming film Mastizaade, which happens to be a sex-comedy, seems to be in trouble, thanks to the Censor Board.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu