శ్రీదేవి మరణానికి కారణం అదే: విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందన

By Bojja Kumar

ప్రముఖ నటి శ్రీదేవి మరణించిన దాదాపు రెండు వారాల అనంతరం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. శ్రీదేవి మరణం వెనక కుట్ర కోణం ఉందనే అనుమానాలు, ఆమె హత్య చేయబడిందనే ఆరోపణల నేపథ్యంలో ఈ విషయమై ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఏమన్నారంటే

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఏమన్నారంటే

‘‘శ్రీదేవి మరణంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం నుండి అందిన పత్రాల ప్రకారం అనుమానించడానికి ఎలాంటి ఆధారాలు కనిపించలేదు. ఏదైనా కుట్రకోణం ఉండి ఉంటే వారు జరిపిన విచారణలోనే బయటపడేది. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదు' అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రావేష్ కుమార్ వెల్లడించినట్లు ఓ ఆంగ్లపత్రికలో కథనం వచ్చింది.

Recommended Video

Sreedevi's Tragic Life ఇలాంటి చెల్లి ఎవరికైనా ఉంటుందా
 ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం

ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం

తన భర్త బోనీ కపూర్ మేనల్లుడు మోహిత్ మార్వా వివాహ వేడుకలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడి హోటల్ లో బస చేశారు. ఫిబ్రవరి 24న ఆమె హోటల్ బాత్ రూమ్ మరణించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఆమె యాక్సిడెంటల్‌గా బాత్ టబ్‌లో జారిపడి చనిపోయి మునిగి మరణించినట్లు నిర్దారణ అయింది.

అనుమానాలకు కారణం అదే

అనుమానాలకు కారణం అదే

అయితే శ్రీదేవి మరణించిన అనంతరం హార్ట్ ఎటాక్ వల్ల చనిపోయారంటూ బంధువులు చెప్పడం, ఆ తర్వాత ఫోరెన్సిక్ రిపోర్టులో అలాంటిదేమీ లేదని తేలడంతో ఆమె మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మీడియాలో ప్రచారం జరిగింది. దీనికి తోడు భారతీయ జనతా పార్టీ ముఖ్య నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా శ్రీదేవి హత్య చేయబడింది అంటూ సంచలన ఆరోపణలు చేయడం కూడా అభిమానులు సైతం అనుమాన పడేలా చేసింది.

 తల నుండి కాళ్ల వరకు మునిగి

తల నుండి కాళ్ల వరకు మునిగి

బాత్రూంలోకి వెళ్లిన శ్రీదేవి ఎంతకీ బయటకు రాక పోవడం, ఆమె నుండి ఎలాంటి స్పందన లేక పోవడంతో బాత్రూం డోర్ ఓపెన్ చేశామని, అపుడు శ్రీదేవి తల నుండి కాళ్ల వరకు నీటితో నిండి ఉన్న బాత్ టబ్‌లో మునిగి ఉందని బోనీ కపూర్ చెప్పినట్లు.... ట్రేడ్ అనలిస్ట్ కోమల్ నహతా వెల్లడించారు.

 దుబాయ్ పోలీసులు తేల్చేశారు

దుబాయ్ పోలీసులు తేల్చేశారు

శ్రీదేవి మృతదేహం బాత్ టబ్ లో మునిగి ఉండటంతో దుబాయ్ పోలీసులు కూడా తొలుత అనుమానా పడ్డారు. వివిధ కోణాల్లో విచారణ అనంతరం ప్రమాదవశాత్తూ మునిగిపోవడం వల్ల ఆమె మరణించినట్లే తేల్చారు. మూడు రోజుల విచారణ అనంతరం ఆమె భౌతిక కాయాన్ని ఇండియాకు పంపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X