»   » ఇలియానా పేరుకు అర్ధం ఏమిటంటే...

ఇలియానా పేరుకు అర్ధం ఏమిటంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలగులో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న ఇలియానా అంటే కుర్రకారులో మంచి క్రేజ్. అలాగే ఇలియానా అనే పేరు తెలుగుదా అన్నంతగా ఇక్కడ పాపులర్ అయిపోయింది. ఇంతకీ ఇలియానా అంటే ఏమిటీ అంటే....ఇలియానా అనే పేరుకు అర్థమే 'అత్యంత సౌందర్యరాశి' అని అర్ధంట. ఈ విషయం ఆమే చెబుతోంది. అయితే తన పేరులో అందం ఉన్నా తాను మాత్రం వ్యక్తిగతంగా అందం కన్నా ఆత్మ ధైర్యానికి ప్రయారిటీ ఇస్తానంటూ చెప్తోంది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ-"ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ సంపాదించే వ్యక్తికి భార్యనైనా సరే...వ్యక్తిగతంగా నేనేంటని నన్నునేను ప్రశ్నించుకుంటాను. దేనికోసమూ ఒకరిపై ఆధారపడే మనస్తత్వం కాదు నాది. నా కాళ్లపై నిలబడటమంటేనే నాకిష్టం' అని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం ఇలియానా తమిళంలో విక్రమ్ సరసన చేస్తోంది. తెలుగులోనూ ఓ స్టార్ హీరో చిత్రానికి బుక్కయింది. ఆమె నటించిన సలీం,రెచ్చిపో చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ కావటం జరిగింది. అయితేనేం ఆమె తన గురువు వైవియస్ చౌదరి దర్శకత్వంలో మరో చిత్రం చేయటానికి కథ విందని తెలుస్తోంది. ఇవిలా ఉంటే రామ్ తో ఆమె టామ్ అండ్ జెర్రీ చిత్రం కమిట్ అయింది. ఆమెకు కిక్ వంటి సూపర్ హిట్ ఇచ్చిన సురేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu