twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీకు మాత్రమే చెప్తా ఫస్ట్‌ టాక్: టెక్నాలజీ తెచ్చిన తంటా.. ఆ సెల్ ఫోన్ కారణంగా..

    |

    రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి రూపొందించిన మొదటి సినిమా 'మీకు మాత్రమే చెప్తా'. ఇటీవలే సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించిన విజయ్ దేవరకొండ.. తరుణ్ భాస్కర్ హీరోగా ఈ సినిమా తెరకెక్కించారు. ఈ రోజే (నవంబర్ 1న) ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఒకరోజు ముందుగానే యూఎస్ ప్రీమియర్స్, ప్రివ్యూ ప్రదర్శితమయ్యాయి. ఆ షోస్ ద్వారా వచ్చిన ఫస్ట్‌టాక్ ఎలా ఉందో చూద్దామా..

     ఆ రెండు గంటలు నవ్వులే నవ్వులు

    ఆ రెండు గంటలు నవ్వులే నవ్వులు

    120 నిమిషాల నిడివితో కూడిన 'మీకు మాత్రమే చెప్తా' సినిమా కడుపుబ్బా నవ్వించిందనే టాక్ విపిస్తోంది. నటీనటులు కామెడీ బాగా పండించారని అంటున్నారు. దాదాపు రెండు గంటలు నవ్వులే నవ్వులు అని చెబుతున్నారు. టెక్నాలజీ కారణంగా హీరో పడిన తంటాలు, మోడ్రెన్ జీవితాలు కళ్లకు కట్టినట్లుగా చూపించారని తెలుస్తోంది.

    ప్రారంభం నుంచే కామెడీ సీన్స్.. కథలో కీలకం అదే

    ప్రారంభం నుంచే కామెడీ సీన్స్.. కథలో కీలకం అదే

    సినిమా ప్రారంభం నుంచే కామెడీ సీన్స్ ఆకట్టుకుంటాయని అంటున్నారు. ప్రతీ ఒక్కరి చేతిలో ఉన్న సెల్ ఫోన్ కథలో కీలకం అని చెబుతున్నారు. తరుణ్ భాస్కర్ ఎంట్రీ, ఆ తర్వాత వచ్చిన కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయని టాక్. కామెడీ సీన్స్ లోకి అభినవ్ అండ్ అతని ఫ్రెండ్స్ ఎంట్రీ ఇవ్వడం, ప్లాష్ బ్యాక్‌లో హీరో హీరోయిన్స్ కాంబినేషన్‌లో వచ్చే కామెడీ సీన్స్ హైలైట్ గా ఉన్నాయని అంటున్నారు.

    తరుణ్ భాస్కర్ కష్టాలు.. సోషల్ మీడియా ఎఫెక్ట్

    తరుణ్ భాస్కర్ కష్టాలు.. సోషల్ మీడియా ఎఫెక్ట్

    అనుకోకుండా ఓ వీడియో తీసుకున్న తరుణ్ భాస్కర్.. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం మూలంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనేది ఈ సినిమాలో చూపించారని చెప్తున్నారు. హీరో తరుణ్ భాస్కర్ పడిన కష్టాలకు హాస్యభరితంగా తెరకెక్కించి వినోదాల విందు ఇచ్చారని టాక్.

    బయట పడ్డ వీడియో.. అనసూయ ఎంట్రీ.. ఇంట్రస్టింగ్ స్క్రీన్ ప్లే

    బయట పడ్డ వీడియో.. అనసూయ ఎంట్రీ.. ఇంట్రస్టింగ్ స్క్రీన్ ప్లే

    సోషల్ మీడియాలో ఆ వీడియోను ఎవరు అప్‌లోడ్ చేశారో తెలుసుకోవడానికి తరుణ్ అండ్ అభినవ్ ప్రయత్నాలు, హీరో అండ్ అభినవ్ కలిసి హీరోయిన్ కజిన్‌ ను కిడ్నాప్ చేయడం సినిమాలో కీలక సన్నివేశాలు అని చెప్తున్నారు. అనసూయ ఎంట్రీ, ఆమె రోల్ బాగుందని అంటున్నారు. తరుణ్ భాస్కర్ కి సంబంధించిన వీడియో బయట పడ్డ దగ్గరనుంచీ స్క్రీన్ ప్లే ఇంట్రస్టింగ్ గా సాగిందని టాక్ వినిపిస్తోంది.

    20 లక్షలు ఇవ్వాలని తరుణ్‌కి కాల్.. కథలో కీ పాయింట్

    20 లక్షలు ఇవ్వాలని తరుణ్‌కి కాల్.. కథలో కీ పాయింట్

    హీరో ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడం కోసం హీరోయిన్ లొకేషన్ అడుగుతూ వీడియో కాల్ చేయమనడం నేటి పరిస్థితులకు కళ్ళకు కట్టినట్లు చూపించిందని చెప్తున్నారు యూఎస్ జనం. హీరో, హీరోయిన్ ఇద్దరి మధ్య వచ్చిన ఆ సీన్ ఇంట్రస్టింగ్ గా ఉందని టాక్. ఇక తరుణ్ ని ఇబ్బంది పెడుతున్న వీడియో డిలీట్ చేయాలంటే 20 లక్షలు ఇవ్వాలని తరుణ్‌కి కాల్ రావడం కథలో కీ పాయింట్ అని చెప్పుకుంటున్నారు.

    మోడ్రెన్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా

    మోడ్రెన్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా

    ఎలాగోలా హ్యాకర్ అడిగిన డబ్బును తరుణ్ ఇచ్చేయడం, దాంతో వీడియో లింక్‌ను తొలగించడం.. ఆ తర్వాత తరుణ్ ఫోన్‌ లో.. హీరోయిన్ తరుణ్ కి సంబంధించిన ఆ వీడియోని చూడటం మరో ట్విస్ట్ అంటున్నారు. చివరగా కథలో అనసూయ పాత్రకు సంబంధించి షాకింగ్ విషయం తెలియడం ఆసక్తికరం అంటున్నారు. మొత్తానికి ఇది మోడ్రెన్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అని చెప్పుకుంటున్నారు.

    నటీనటులు వారి పనితీరు ఎలా ఉందంటే..

    నటీనటులు వారి పనితీరు ఎలా ఉందంటే..

    తరుణ్ మంచి నటన కనబర్చారని, అభినవ్ గోమఠం కూడా తరుణ్ కి మంచి సపోర్ట్ ఇచ్చి కామెడీ పండించారని అంటున్నారు. అనసూయ పాత్ర చాలా బాగుందని అంటున్నారు. వాణి భోజనం, అవంతిక మిశ్ర కూడా తమ పాత్రలకు న్యాయం చేశారని అంటున్నారు. విజయ్ దేవరకొండ నిర్మాణ విలువలు బాగున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎంతటి విజయం సాధిస్తుందో!.

    English summary
    Vijay Devarakonda's debut production venture Meeku Matrame Chepta which is releasing on his King Of The Hill production banner is released on November 1st.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X