»   » పనోడిలా ఉన్నావ్... నువ్వు మహేష్ బాబేంటి? (ట్రైలర్ కేక)

పనోడిలా ఉన్నావ్... నువ్వు మహేష్ బాబేంటి? (ట్రైలర్ కేక)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌, ఇ.సత్తిబాబు కాంబినేషన్‌లో నవీన్‌చంద్ర హీరోగా నిర్మిస్తున్న చిత్రం 'మీలో ఎవరు కోటీశ్వరుడు. శృతిసోధి, పృథ్వీ, స‌లోని కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. డి.జె.వ‌సంత్ సంగీతం అందించిన ఈసినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం బుధ‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది.

ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు. ట్రైలర్ చూసిన వారంతా సూపర్బ్ గా ఉందని అంటున్నారు. ముఖ్యంగా సినిమాలో కమెడియన్ పృథ్వి కామెడీ సూపర్బ్, ప్రిన్స్ మహేష్ బాబు పేరు పెట్టుకుని సినిమాలో బాగా నవ్విస్తాడని స్పష్టమవుతోంది.

 పృథ్వి కామెడీ గురించి అల్లరి నరేష్

పృథ్వి కామెడీ గురించి అల్లరి నరేష్

ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన అల్ల‌రి న‌రేష్ మాట్లాడుతూ `పృథ్వీ కామెడితో ఇర‌గ‌దీస్తున్నాడంటూ ప్రశంసించారు. న‌వీన్ చంద్ర మంచి హార్డ్‌వ‌ర్క‌ర్‌, త‌న‌కు మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. స‌త్తిబాబు వ‌ర్కింగ్ స్ట‌యిల్ చాలా బావుంటుంది. రెండు గంట‌ల పాటు ఆడియెన్స్‌ను న‌వ్వుల్లో ముంచెత్తే సినిమా అన్నారు.

ఆది మాట్లాడుతూ

ఆది మాట్లాడుతూ

ఆది మాట్లాడుతూ `పృథ్వీగారు స్క్రీన్‌పై క‌న‌ప‌డ‌గానే మంచి రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ బావుంది. సినిమా సూపర్ హిట్టే. రాధామోహ‌న్‌గారితో నేను ఇంతకు ముందు పని చేసాను. ఆయన క్వాలిటీ విష‌యంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కారు. సినిమాను అనుకున్న స‌మయంలో పూర్తి చేసి విడుద‌ల చేయ‌గ‌లిగే నిర్మాత`` అన్నారు.

 హీరో న‌వీన్ చంద్ర మాట్లాడుతూ

హీరో న‌వీన్ చంద్ర మాట్లాడుతూ

సినిమా ఎప్పుడు స్టార్ట‌య్యిందో, పూర్త‌య్యిందో తెలియ‌దు. శృతి, స‌లోని, పృథ్వీగారు అంతా బాగా చేసారు. ఎంతో హ్యాపీగా షూటింగ్ జరిగింది. నిర్మాత రాధమోహన్ గారు ఫుల్ సపోర్టు ఉండటంతో స‌త్తిబాబుగారు సినిమాను మరింత బాగా తీసారు.. అన్నారు.

 గోమ్ షో మూవీ కాదు

గోమ్ షో మూవీ కాదు

మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు అనే టైటిల్ గేమ్ షోకు సంబంధించిన‌ది కాదు, స‌బ్జెక్ట్‌కు త‌గ్గ టైటిల్‌. పృథ్వీగారి పాత్ర సినిమాకు పెద్ద ప్ల‌స్ అవుతుంది. ఈ సినిమాను ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేయ‌డానికే నిర్మంచాను. సినిమాలో ఎలాంటి సందేశం లేదు. అవుటండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్ అని నిర్మాత రాధామోహన్ తెలిపారు.

 సత్తి బాబు, పృథ్వి

సత్తి బాబు, పృథ్వి

దర్శ‌కుడు ఇ.స‌త్తిబాబు మాట్లాడుతూ..మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు అందరినీ నవ్విస్తుంది. న‌వీన్ చంద్ర బాగా సపోర్టు ఇచ్చాడు. పృథ్వీరోల్ హీరోకు స‌మానంగా ఉన్నా, సినిమా స‌క్సెస్ కావాల‌నే ఉద్దేశంతో చేసిన సినిమా అన్నారు. పృథ్వీ మాట్లాడుతూ - ``ఈ సినిమాలో వేరియేష‌న్ స్టార్ వీర‌బాబు పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాను. స‌త్తిబాబుగారు సినిమాను తెర‌కెక్కించిన తీరు చూసి ఇవివిగారు లేని లోటును తీర్చిన ద‌ర్శ‌కుడు స‌త్తిబాబు మాత్ర‌మే అనిపించింది. ఆడియెన్స్ కోరుకునే అన్నీ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి`` అన్నారు.

English summary
Meelo Evaru Koteeswarudu Latest Telugu Movie Theatrical Trailer, ft. Naveen Chandra and Shruti Sodhi. Directed by E Satti Babu and music by Sri Vasanth. Produced by KK Radha Mohan on Sri Sathya Sai Arts Banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu