For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కొత్త అవతారం ఎత్తిన నిన్నటి హీరోయిన్ మీనా

  By Srikanya
  |

  చెన్నై : స్టార్‌ హీరోయిన్‌గా అలరించి ఆపై వైవాహిక జీవితంలో స్థిరపడి వెండితెరకు దూరమయ్యారు మీనా. ప్రస్తుతం డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కొత్త అవతారమెత్తి తన పయనాన్ని సాగిస్తున్నారు. బాలనటిగా కెరీర్‌ను ప్రారంభించిన మీనా అప్పట్లో తెలుగు, తమిళంలో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా కొనసాగారు. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, సత్యరాజ్‌, ప్రభు, అజిత్‌ వంటి అగ్రహీరోలతో ఆడిపాడి ప్రేక్షకులను విశేషంగా అలరించారు.

  వివాహానంతరం మీనా వెండితెరకు దూరమయ్యారు. ప్రస్తుతం బుల్లితెరపై హవా చాటుకుంటున్నారు. ఇదిలా ఉంటే కోలీవుడ్‌లో డబ్బింగ్‌ ఆర్టిస్టుగా తన కొత్త పయనాన్ని సాగిస్తున్నారు. సంచలనాత్మక విజయం సాధించిన 'మైనా' చిత్రంలో టైటిల్‌రోల్‌ పోషించిన అమలాపాల్‌కు గాత్రాన్ని అందించింది మీనానే! సంభాషణల పరంగా మైనా పాత్ర బాగా అలరించిన నేపథ్యంలో ఆమెకు ఈ తరహా అవకాశాలూ బాగానే వస్తున్నాయట. ప్రస్తుతం శివాజీ గణేశన్‌ కుటుంబం నుంచి ప్రభు నట వారసుడిగా విక్రమ్‌ప్రభు తెరంగేట్రం చేయనున్న గుమ్కీలో హీరోయిన్‌ లక్ష్మీమీనన్‌కూ మీనా డబ్బింగ్‌ చెప్పింది.

  ఇక ప్రభు కుమారుడు సైతం కుమారుడు విక్రం హీరోగా వస్తున్న చిత్రం 'గుమ్కీ' పై మంచి అంచనాలే ఉన్నాయి. 'నడిగర్‌ తిలగం' వారసత్వం పుణికిపుచ్చుకుని వస్తున్న మూడోతరం నటుడు, ప్రభు కుమారుడు విక్రం హీరోగా వస్తున్న చిత్రం 'గుమ్కీ'. తెలుగులో 'గజరాజు'గా విడుదల కానుంది. తిరుపతి బ్రదర్స్‌ పతాకంపై లింగుస్వామి నిర్మిస్తుండగా ప్రభు సాలమన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై శివాజి గణేశన్‌ కుటుంబం భారీ ఆశలను పెంచుకుంది. శివాజి తర్వాత ఆయన కుమారుడు ప్రభు తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన మనవడు మరింత పేరు ప్రఖ్యాతులు దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. కుటుంబీకుల పూర్తి సహకారంతో వస్తున్న విక్రం 'గుమ్కీ' విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.

  క్లిష్టమైన కథను ఎంచుకున్నాడని, పలు ఫీట్లు కూడా చేసినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో 'సుందర పాండియన్‌' ఫేం లక్ష్మీ మీనన్‌ కథానాయిక. ఇమాన్‌ సంగీతం సమకూర్చాడు.విక్రంప్రభు మాట్లాడుతూ.. 'గుమ్కీ' వంటి కథ చేయడం నిజంగానే అదృష్టం. శ్రమ అని చెప్పడం కన్నా.. ప్రతి ఒక్కరూ కఠోరంగా శ్రమించారని చెబితే అతిశయోక్తి కాదని, ఆశించిన స్టార్‌డం తప్పకుండా వస్తుందని నమ్ముతున్నట్లు చెప్పాడు. హీరోయిన్ లక్ష్మీ ముచ్చటిస్తూ.. నన్ను వెండితెరపైకి తీసుకొచ్చిన తొలి చిత్రం 'గుమ్కి'. అయితే 'సుందర పాండియన్‌' ముందుగా జనం చెంతకు వచ్చింది. సినిమా కోసం చాలా కష్టపడ్డాం. అందుకు తగ్గ ఫలితం దక్కుతుందని తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: సుకుమార్, సంగీతం: ఇమామ్, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేశ్‌బాబు. దర్శకత్వం : ప్రభు సాలమన్.

  English summary
  Actress Meena currently dubbing for Kumki tamil Film which will release in telugu as Gaja Raju.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X