»   » సొమ్మసిల్లి పడిపోయిన నటి మీనా...

సొమ్మసిల్లి పడిపోయిన నటి మీనా...

Posted By:
Subscribe to Filmibeat Telugu
చెన్నై: నటి మీనా షూటింగ్ స్పాట్లో ఉన్నట్టుండి సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మళయాలం మూవీ 'ద్రిశ్యం' షూటింగులో ఆమె నటిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో మోహన్ లాల్ హీరోగా నటిస్తున్నారు.

ఈ చిత్రంలో మోహన్ లాల్, మీనా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఉన్నట్టుండి మీనా స్పృహ తప్పి పడిపోవడంతో యూనిట్ సభ్యులంతా కంగారు పడ్డారు. షూటింగుకు వచ్చినప్పటి ఆమె అనారోగ్యంగా కనిపించారని, అనారోగ్యాన్ని లెక్క చేయకుండా షూటింగులో పాల్గొనడం వల్లనే ఇలా జరిగిందని భావిస్తున్నారు.

ఆమెను పరీక్షించిన వైద్యులు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ఈ సంఘటనతో 'ద్రిశ్యం' మూవీ షూటింగ్ నిలిపివేసారు. అనారోగ్యం నుంచి మీనా కోలుకున్న తర్వాత షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో మీనా, మోహన్ లాల్ భార్య పాత్రలో నటిస్తున్నారు.

'ద్రిశ్యం' సినిమా షూటింగ్ ఆగిపోవడంతో నటుడు మోహన్ లాల్....తను నటిస్తున్న మరొక మళయాలం మూవీ 'గీతాంజలి' పోస్టు ప్రొడక్షన్ పనుల్లో పాలు పంచుకుంటున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం మోహన్ లాల్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటున్నారు.

English summary
Mohanlal and Meena play the lead roles in Drishyam movie. Unfortunately, the actress fainted on the sets of the movie while the shoot was on and the movie has come to a halt. According to sources, both Mohanlal and Meena were shooting for the film. But suddenly Meena felt giddiness and fainted on the sets. She was immediately taken to a near by hospital and was examined. Doctors have advised her to take rest.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu