»   »  మంత్రిని కాపాడిన మీనా!!

మంత్రిని కాపాడిన మీనా!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమాలలో చిక్కుల్లో పడి సాయం కోసం ఎదురుచూసే యువతిగా మీనా ఎన్నో సినిమాలలో నటించింది. నిజజీవితంలో మాత్రం మీనా ఇందుకు విరుద్ధంగా కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసి సూపర్ ఉమన్ గా నిలిచింది. చెన్నయ్ లో ఇటీవల జరిగిన ఒక పబ్లిక్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ కు మీనా ప్రత్యేక ఆహ్వానితురాలిగా హాజరయింది. ఈ మీటింగ్ లో తమిళనాడుకు చెందిన కేంద్రమంత్రి కూడా పాల్గొన్నారు. అయితే మంత్రి స్టేజీమీదకు వచ్చే ప్రయత్నంలో ఉండగా అనుకోకుండా జనాలు పెద్దయెత్తున ఆయన చుట్టూ మూగారు. గుంపుగా మూగిన జనాన్ని తప్పించుకొని వేదిక మీదకు రావడానికి ఆయన ప్రయత్నిస్తుంటే ఆయన చుట్టూ ఉన్న జనం మరింత ఎక్కువయ్యారు. ఆయనకు ఏం చేయాలో పాలుపోని దుస్థితి. ఈ లోపు మీనా సభా ప్రాంగణంలోకి ప్రవేశించింది. అంతే..అంతదాకా మంత్రి చుట్టూ మూగిన జనం ఆయనను వదిలేసి మీనా చుట్టూ మూగారు. ఇదే సరైన అదను అనుకొని సదరు మంత్రి వేదికనెక్కి ఊపిరి పీల్చుకున్నాడు. మీనా జనాన్ని సులువుగా తప్పించుకొని వేదికనెక్కింది. మీనా వేదిక మీదకు రాగానే పరోక్షంగా తనను కాపాడిన మీనాకు మంత్రి ధన్యవాదాలు చెప్పాడట.

Read more about: meena minister
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X