»   » ఇంకో హీరోయిన్ విడాకులు... ఈసారి మీరా జాస్మిన్

ఇంకో హీరోయిన్ విడాకులు... ఈసారి మీరా జాస్మిన్

Written By:
Subscribe to Filmibeat Telugu

సినిమా రంగం లో వివాహ బందాలు చాలా వరకూ విఫలమవుతూండతం కొత్తేం కాదు. ఇప్పుడు ఈ లిస్ట్ లో మీరా జాస్మిన్ కూడా చేరింది. ఒకప్పుడు తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో అగ్ర హీరోలందరితో కలిసి నటించిన ముద్దు గుమ్మ మీరా జాస్మిన్ కు ఇపుడు నిజజీవితంలో కష్టాలొచ్చాయి.హీరోయిన్ గా మంచి స్వింగులో ఉండగానే.. మాండలిన్ రాజేష్ అనే మ్యుజీషియన్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచిన మీరా..

meera

ఆ తర్వాత అతడితో బ్రేకప్ చేసుకుంది. రెండేళ్ల కిందట వివాదాస్పద రీతిలో అనిల్ జాన్ టైటస్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడింది మీరా. అనిల్ జాన్ కు అప్పటికే పెళ్లయిఉండటం.. విడాకులు తీసుకోవడం గమనార్హం. అతడి మాజీ భార్య తరఫు బంధువులు దాడి చేయబోతే.. పోలీసుల రక్షణ కోరి.. వారి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు అనిల్-మీరా.

meera 2

అనిల్ మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే మీరాను రెండో పెళ్లి చేసుకున్నాడు. మీరా పెళ్లి కేరళలోని త్రివేండ్రం చర్చిలో ఘనంగా జరిగింది. ఐతే పెళ్లి తర్వాత రిజిస్ట్రేషన్ కు సంబంధించిన పలు సమస్యలు ఏర్పడ్డాయని, అందుకే ఇప్పటికీ కూడా వీరిద్దరూ ఆ చర్చి చుట్టూనే సర్టిఫికేట్ కోసం తిరిగారు. చాలా కష్టాలనే ఎదుర్కొన్నారు.
ఇంత కష్టపడి పెళ్లి చేసుకున్న మీరా.. అనిల్.. రెండేళ్లు తిరిగేసరికి విడిపోతుండటం ఆశ్చర్యం. పెళ్లయిన ఏడాదికే వీళ్లిద్దరి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయట. ఏడాది నుంచి విభేదాలతోనే కలిసి సాగుతున్న ఈ జంట.. చివరికి విడిపోవాలనే నిర్ణయానికి వచ్చేసింది. మీరా ఇప్పటికే అనిల్ కు దూరంగా ఉంటోంది. అతడికి దూరమయ్యాకే మళ్లీ సినిమాల్లోకి పునరాగమనం చేయడానికి కూడా రంగం సిద్ధంచేసుకుంది. ఆల్రెడీ ఒక సినిమాలో కూడా నటించింది. చాలామంది హీరోయిన్ల లాగే మీరా కూడా వైవాహిక జీవితంలో విఫలం కావడం విచారించాల్సిన విషయం.

English summary
Malayalam actor Meera Jasmine is reportedly considering of applying for divorce from husband Anil John Titus. The actor who took a break after her marriage in 2014, returned to the big screen this year with 10 Kalpanakal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu