»   » ఈసారి నా ఓటు తమ్ముడికే... నాగబాబు ప్రకటన (వీడియో)

ఈసారి నా ఓటు తమ్ముడికే... నాగబాబు ప్రకటన (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ నెల 26వ తేదీన విశాఖలోని ఆర్కే బీచ్‌లో ప్రత్యేక హోదా కోసం నిరసన చేపట్టనున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీనికి వైసిపి అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు. అవకాశవాద, క్రిమినల్ రాజకీయాలకు వ్యతిరేఖంగా పవన్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా పలువురు హీరోలు కూడా ముందుకు వచ్చారు. తమిళనాడులో జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలంటూ తమిళ యువత నిరసన చేపట్టినట్టే...

హోదాపై పోరును ముమ్మరం చేద్దామంటూ సోషల్‌ మీడియాలో ఆంధ్ర ప్రాంత యువత పోస్టులు చేస్తున్నారు.జల్లికట్టు ఉద్యమానికి చెన్నైలోని మెరీనా బీచ్‌ వేదికైతే... ప్రత్యేకహోదా పోరాటానికి విశాఖ ఆర్కే బీచ్‌ను వేదికగా ఎంచుకున్నారు.ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు 27వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దీనికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 26వ తేదీనే విశాఖ వస్తున్నారు. ఆ రోజు విశాఖలోనే బస చేస్తారు. దీంతో ఈ 26 ఉధ్యమం పై ఉత్కంట నెలకొంది.

జల్లికట్టు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఏపీకి ప్రత్యేకహోదా ఉద్యమానికి మద్దతు ఇచ్చేందుకు టాలీవుడ్ ముందుకు వచ్చింది. ప్రత్యేకహోదా కోసం జరుగుతున్న ఉద్యమానికి తెలుగు సినీ పరిశ్రమ మద్దతు పెరుగుతోంది. జల్లికట్టు ఉద్యమం తరహాలో ఉద్యమించేందుకు సినీ తారాగనం సిద్ధమవుతున్నారు. ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 26న విశాఖ బీచ్ లో యువత నిరసన తెలిపితే మద్దతు ఇస్తానని జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు.

 Nagababu

పవన్ ట్వీట్స్ కు హీరోలు సాయిధరమ్ తేజ్, నవదీప్, మంచు మనోజ్, సంపూర్ణేష్ బాబు, శివబాలాజీలు స్పందించారు. యువత ఉద్యమానికి అండగా ఉంటామని ప్రకటించారు. అయితే అగ్ర హీరోలు మాత్రం స్పందింకపోవడం గమనార్హం. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమానికి తమిళ సినీ పరిశ్రమ పూర్తిగా మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఎప్పుడూ అన్నయ్య పక్షం వహిస్తూ పవన్ ని చిన్న పిల్ల వాడిగా కొట్టి పడేసే నాగబాబు తాజాగా పవన్ కి మద్దతుగా ఉంటున్నట్టు తెలిపాడు. ప్రత్యేక హోదా సాధన ఆందోళన కోసం జనసేన తరపున పవన్ చేస్తున్న పోరాటానికి తన సంపూర్ణ సహకారం మద్దతు ఉంటుందని ఓ వీడియో ద్వారా తెలియజేశాడు. కొన్నాళ్లుగా పవన్ కి, నాగబాబుకి మధ్య దూరం పెరిగిందని వస్తోన్న పుకార్లకి నాగబాబు వీడియో బ్రేక్ వేసిందని అంటున్నారు. మరి నాగబాబు ఇంక ఏయే విషయాలు చెప్పాడో ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది.

English summary
Mega Brother Nagababu posted A Viedeo that He supports Pawan kalyan Who is raised his Voice for special Status to AP
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu