»   » మెగాస్టార్ మనవరాళ్ళు.., ఆ సినిమా చూసి ఇలా కొట్టుకుంటున్నారట...

మెగాస్టార్ మనవరాళ్ళు.., ఆ సినిమా చూసి ఇలా కొట్టుకుంటున్నారట...

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకడైన అమీర్ ఖాన్‌ నటించిన దంగల్‌ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమా రికార్డు వసూళ్లు సాధిస్తోంది. తొలివారం 197.53 కోట్ల రూపాయలను వసూలు చేయడం ద్వారా దంగల్ సినిమా ఈ ఏడాది తొలి వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ ఏడాది విడుదలైన సల్మాన్‌ ఖాన్‌ సినిమా సుల్తాన్‌ తొలివారంలో 180.36 కోట్ల రూపాయలు వసూలు చేయగా, దంగల్‌ ఈ రికార్డును బ్రేక్‌ చేసింది.

Mega daoughter Susmitha Tweet About Dangal

దేశమంతా 'దంగల్‌' ఫీవర్‌తో ఊగిపోతోంది. అమీర్‌ఖాన్‌ అందించిన ఈ క్లాసిక్‌ మూవీ ఎంతో మంది ప్రముఖులను కూడా ఆకట్టుకుంటోంది. పెద్దలే కాదు.. పిల్లలు కూడా 'దంగల్‌'కు ఫిదా అయిపోతున్నారు. అందుకు ఉదాహరణే ఈ ఫోటోలోని చిట్టి మల్లయోధులు. వీరెవరో కాదు.. మెగాస్టార్‌ చిరంజీవి మనవరాళ్లు. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కూతుళ్ల వీళ్లు. 'దంగల్‌' సినిమా చూసినప్పటి నుంచి ఇలా కుస్తీ పడుతున్నారట. ఈ ఫోటోను ట్వీట్‌ చేసిన సుస్మిత.. 'అమీర్‌ఖాన్‌, 'దంగల్‌' చిత్ర యూనిట్‌ కేవలం ఒక సినిమా మాత్రమే తీయలేదు.. అందరిలో ఓ స్ఫూర్తిని రగిలించారు. ఇప్పటికే ఈ సినిమాను రెండుసార్లు అంటూ పోస్ట్ చేసింది.

Mega daoughter Susmitha Tweet About Dangal

ఇకపోతే.. అమీర్ ఖాన్ దంగల్ సినిమాపై సెలెబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా బృందంపై సినీ నటుడు పవన్‌కల్యాణ్‌ ప్రశంసల జల్లు కురిపించారు. అద్భుతమైన జీవిత కథతో మంచి విజయం అందుకున్న అమీర్‌ ఖాన్‌కు, ఆయన బృందానికి పవన్‌ ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మనసుల్ని కదిలించేలా చిత్రాన్ని తీశారంటూ దర్శకుడు నితీశ్‌ తివారీని, మిగిలిన చిత్ర బృందాన్ని అభినందించారు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన ఫాతిమా సనా షేక్‌, సన్యా మల్హోత్రాని ప్రత్యేకించి అభినందించారు. 'దంగల్‌'ని చూశానని, చిత్రంపై తన అభిప్రాయాన్ని పంచుకోకపోతే మనస్సాక్షి ఒప్పుకోదనిపించిందని చెప్పటం విశేషం...

English summary
"#Dangal fever home. My lil wrestlers. Aamir khan and team Dangal dint make a film, they created an inspiration! Watched it twice already"... Tweets Mega daoughter Susmitha
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu