Don't Miss!
- Sports
Australia Open 2023 విజేతగా నోవాక్ జకోవిచ్.. నాదల్ రికార్డు సమం!
- News
Roja: రోజా మేడమ్ కిడ్నాప్ కేసులో ట్విస్ట్, ఆంధ్రా కిరాయి హంతకులు, తుపాకితో బెదిరించి !
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
మెగా హీరోల కోసం అభిమాని సాహసం: సర్‌ప్రైజ్ చేసిన చిరంజీవి, పవన్.. ఏ హీరో చేయని విధంగా!
మిగిలిన దేశాలతో పోలిస్తే ఇండియాలోనే సినిమాలు అంటే విపరీతమైన పిచ్చి ఉంటుంది. తమకు నచ్చిన హీరో, హీరోయిన్ల కోసం గుడి కట్టిన సందర్భాలు కూడా మన దేశంలోనే కనిపిస్తుంది. అంతలా సినిమా అనేది ప్రతి ఒక్కరిపై ప్రభావాన్ని చూపిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ అభిమానం తారాస్థాయిలో ఉంటుంది. అభిమాన హీరోలను ఫాలో అవుతూ.. వాళ్లకు మంచి జరగాలని కోరుకుంటూ ఫ్యాన్స్ చేసే పనులు ఒక్కోసారి ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.
ఇలాంటి పరిస్థితుల్లోనే తాజాగా ఓ మెగా అభిమాని దైవ సమానులైన హీరోలు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం పెద్ద సాహసమే చేశాడు. అంత కష్ట పడ్డాడు కాబట్టే సదరు ఫ్యాన్ కోసం ఆ ఇద్దరు హీరోలు కలిది వచ్చారు. ఇంతకీ ఏం జరిగింది? పూర్తి వివరాలు మీ అందరి కోసం!

మెగా ఫ్యామిలీ ప్రత్యేకం.. ఎంతో మందితో
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ చాలా ప్రత్యేకమైనదని చెబుతుంటారు. దీనికి కారణం ఆ కుటుంబానికి సినీ ఆద్యుడైన మెగాస్టార్ చిరంజీవే అన్న విషయం తెలిసిందే. ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగాడాయన. ఇలా దాదాపు నలభై ఏళ్లుగా హవాను చూపిస్తున్నాడు.
ఇక, చిరంజీవి తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి పవన్ కల్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, కల్యాణ్ దేవ్, నిహారికలు హీరో, హీరోయిన్లుగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు.
సుడిగాలి సుధీర్ రెమ్యూనరేషన్ లీక్: ఏ షోకు ఎంత వస్తుందంటే.. వామ్మో నెలకే అంత ఆదాయమా!

సేవా కార్యక్రమాలు... ప్రజలకు చేరువగా
మెగా ఫ్యామిలీకి కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. దీనికి కేవలం వీళ్లంతా సినిమాల్లో నటించడమే కాదు.. మెగాస్టార్ చిరంజీవిని మొదలుకొని సాయి ధరమ్ తేజ్ వరకూ ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉంటున్నారు. చిరంజీవి గతంలో ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్‌ను స్థాపించారు.
ఈ మధ్యనే ఆక్సీజన్ బ్యాంక్‌ను కూడా ఏర్పాటు చేశారు. అలాగే, పవన్ కల్యాణ్, రామ్ చరణ్‌తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. మిగిలిన హీరోలు ఆపద కాలంలో ప్రజల కోసం తమ వంతు సహాయాలు చేస్తూ.. ఆదర్శంగా నిలుస్తూనే ఉన్నారు.

చిరంజీవి కోసం అభిమాని సైకిల్ యాత్ర
మెగాస్టార్ చిరంజీవిని అభిమానించి, ఆరాధించే వాళ్లు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కోట్ల మందే ఉన్నారు. అందులో ఒకరైనా మెగా అభిమాని ఈశ్వరయ్య ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. దీనికి కారణం.. ఈ మెగా ఫ్యాన్ తిరుపతి నుంచి హైదరాబాద్‌కు సైకిల్ యాత్ర చేసుకుంటూ రావడమే. అవును.. మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలన్న పట్టుదలతో ఆగస్టు 22న తిరుపతి నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించాడు.
ఇలా 12 రోజుల పాటు దాదాపు 600 కిలో మీటర్లు ప్రయాణించి ఔరా అనిపించాడు. ఫలితంగా ఈశ్వరయ్య చేసిన సాహసం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది.
అందాలు ఆరబోసి షాకిచ్చిన రష్మిక మందన్నా: ఆమెను ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరు!

ఇంటికి పిలిచి సర్‌ప్రైజ్ చేసిన చిరంజీవి
ఈశ్వరయ్య తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు కష్టపడిన విషయం మెగాస్టార్ చిరంజీవి దృష్టికి వచ్చింది. దీంతో కొందరు అభిమాన సంఘాల నేతలతో ఆయన మాట్లాడి.. సదరు ఫ్యాన్ వివరాలు తెలుసుకున్నారు. అంతేకాదు.. తనను కలిసేందుకు ఈశ్వరయ్యకు అపాయింట్‌మెంట్ కూడా ఇచ్చారు.
ఇంకేందుకు హైదరాబాద్‌లోని చిరంజీవి ఇంటికి నేరుగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిన అతడు.. చిరంజీవిని కలిశాడు. మొదట అభిమాని చేసిన పనికి ఆశ్చర్యపోయిన మెగాస్టార్.. అతడితో చాలా సేపు ముచ్చటించడంతో పాటు ఫొటోలు కూడా దిగి గౌరవించి పంపించారు.

పవన్‌కు కలిసేందుకు ఏర్పాటు చేశారు
మెగాస్టార్ చిరంజీవిని కలిసిన సమయంలో ఈశ్వరయ్య.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను కలవాలని ఉన్న విషయాన్ని వెల్లడించాడు. దీంతో వెంటనే స్పందించిన ఆయన.. స్వయంగా తగిన ఏర్పాట్లు చేశారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో 'భీమ్లా నాయక్' షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే ఈశ్వరయ్యను కలుసుకున్నాడు పవన్ కల్యాణ్. అన్న చిరంజీవి చేసినట్లుగానే అతడికి చాలా సమయం కేటాయించిన పవర్ స్టార్.. వీలైనంత ఎక్కువ సేపు ముచ్చటించాడు. చివర్లో అతడితో ఫొటోలు దిగి మరీ అక్కడి నుంచి పంపించాడు.
Sarkaru Vaari Paata Birthday Blaster: మహేశ్ బాబు అరుదైన రికార్డ్.. ఇందులో మూడు అందులో ఐదో స్థానం

ముగ్గురిపై ప్రశంసలు వర్షం.. హైలైట్‌గా
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తమ అభిమాని అయిన ఈశ్వరయ్యను కలుసుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమాన హీరోల కోసం సైకిల్ యాత్ర చేసిన ఈశ్వరయ్యను మెగా ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
అదే సమయంలో ఒక ఫ్యాన్ కోసం బిజీ షెడ్యూల్‌లో మార్పులు చేసుకుని మరీ కలుసుకోవడంతో చిరు, పవన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. బడా స్టార్లు అయినా ఇంత ఒదిగి ఉండడం వాళ్ల గొప్పదనానికి నిదర్శనం అంటూ వీళ్లిద్దిరినీ అభిమానులతో పాటు సినీ ప్రియులు కొనియాడుతున్నారు.
అభిమానిని ఆశ్చర్య పరిచిన చిరంజీవి, పవన్ కల్యాణ్: అంత చేసిన ఫ్యాన్ కోసం ఏం చేశారంటే!
Recommended Video

ఇద్దరూ వరుస సినిమాలతో బిజీ బిజీగా
అటు మెగాస్టార్ చిరంజీవి.. ఇటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. మరీ ముఖ్యంగా రీఎంట్రీ ఇద్దరూ జెట్ స్పీడుతో దూసుకుని పోతున్నారు. ఒకటి పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు. చిరంజీవి ఇప్పటికే 'ఆచార్య' అనే సినిమాలో నటిస్తూనే.. దీని తర్వాత 'గాడ్ ఫాదర్', 'భోళా శంకర్' సహా మరో మూవీ చేయనున్నారు. అలాగే, పవన్ ప్రస్తుతం 'భీమ్లా నాయక్', 'హరిహర వీరమల్లు' వంటి సినిమాలను చేస్తున్నాడు. వీటితో పాటే హరీశ్ శంకర్ తెరకెక్కించనున్న మరో మూవీని కూడా చేయనున్నాడు.