»   » బ్లడీ బోల్డ్ మూవీ: అర్జున్ రెడ్డిపై రామ్ చరణ్ స్పందన ఇలా ఉంది

బ్లడీ బోల్డ్ మూవీ: అర్జున్ రెడ్డిపై రామ్ చరణ్ స్పందన ఇలా ఉంది

Posted By:
Subscribe to Filmibeat Telugu
"Bloody Bold Movie" Ram charan Says About "Arjun Reddy"

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమాపై విమర్శలతో పాటు ప్రశంసలు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికీ భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమాపై మరో స్టార్ హీరో స్పందించాడు. తాజాగా ఈ చిత్రంపై మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కూడా ప్రశంసలు కురిపించాడు. 'రంగస్థలం' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న చరణ్.. ఆదివారం అర్జున్ రెడ్డి సినిమా చూశాడు.

ఇప్పటికే మహేష్ బాబు, అనుష్క వంటి స్టార్లంతా సినిమాను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేయగా తాజాగా స్టార్ హీరో రామ్ చరణ్ కూడా ఈ బోల్డ్ సినిమాను చూసి ఈ బోల్డ్ కామెంట్ చేశారు. "అర్జున్ రెడ్డి సినిమా చూశాను. రా, రియలిస్టిక్ అండ్ బ్లడీ బోల్డ్.

Mega Hero Ram charan says Hatsoff to Arjun Reddy Team

సందీప్ వంగ, విజయ్ దేవరకొండ, శాలినీ పాండే, రాహుల్ రామకృష్ణతో పాటు మొత్తం చిత్ర యూనిట్‌కు హ్యాట్సాఫ్" అని అభినందించాడు చరణ్. ఇలా స్టార్లంతా ఎలాంటి ఈగో లేకుండా సినిమా బాగుందనడంతో ప్రేక్షకుల్లో ఉత్సాహం మరింత ఎక్కువై కలెక్షన్లు ఇప్పటికీ మెరుగ్గానే సాగుతున్నాయి.

'A' సర్టిఫికెట్ పొందినప్పటికీ యూఎస్ లో సైతం సినిమా బ్రహ్మాండంగా ఆడుతూ ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్ మార్కును దాటేసింది. రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రంగస్థలం 1985' చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

English summary
After watching movie Ram Charan Hats off to Sandeep Vanga ,vijay devarakonda & Arjun Reddy whole team
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu