‘మెగా ప్రిన్స్’ లుక్ అదిరింది గురూ..!
హైదరాబాద్: ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నది ఎవరో మెగా అభిమానులకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘మెగా ప్రిన్స్' వరుణ్ తేజ్ రిట్జ్ మేజగైన్ కోసం ఇచ్చిన ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటో ఇది. సోషల్ మీడియాలో ఈ ఫోటో ఇపుడు చక్కర్లు కొడుతోంది. వరుణ్ తేజ్ లుక్ అదిరింది కదా!
పూరి జగన్నాథ్, వరుణ్ తేజ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి "లోఫర్" అనే టైటిల్ ని పూరి ఫిక్స్ చేసారు. తొలి సినిమాతోనే మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. దీనికి తోడే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అండ ఉండనే ఉంది. అందుకే రెండో సినిమాకే రెమ్యూనరేషన్ రూ. 3 కోట్లు తీసుకుంటున్నాడట.

డైరక్టర్ క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రానికి కంచె అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసి లాంచ్ చేసారు. ఇది పీరియడ్ డ్రామా. స్వాతంత్ర్యానికి ముందు జరిగిన కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా ఎంపికయ్యింది. మిస్ ఇండియా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రజ్ఞ జైస్వాల్, తెలుగులో అభిజిత్ సరసన ‘మిర్చి లాంటి కుర్రాడు' సినిమాలో నటిస్తుంది.


Click it and Unblock the Notifications











