»   » మెగాస్టార్ కుమ్ముడే కుమ్ముడు.. ఖైదీ నంబర్ 150 మరో రికార్డు

మెగాస్టార్ కుమ్ముడే కుమ్ముడు.. ఖైదీ నంబర్ 150 మరో రికార్డు

Posted By:
Subscribe to Filmibeat Telugu

లేటుగా రీఎంట్రీ ఇచ్చినా లేటెస్ట్‌గా రికార్డులతో మోత మోగిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. సంకాంత్రి కానుకగా విడుదలైన ఖైదీ నంబర్ 150 ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా వసూలు చేసి చిరంజీవి స్టామినాను రుజువు చేసింది. ఇంకా ఈ చిత్రం అదే దూకుడుతో 50 రోజులు పూర్తి చేసుకొని శత దినోత్సవానికి పరుగులు తీస్తున్నది.

53 సెంటర్లలో 50 రోజులు పూర్తి

53 సెంటర్లలో 50 రోజులు పూర్తి


సంక్రాంతి రేసులో విడుదలైన ఈ చిత్రం 53 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకొన్నది. కలెక్షన్లపైనే దృష్టిపెట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో ఓ భారీ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. కలెక్షన్లతోపాటు 50 రోజులు నడవడం సినీ పరిశ్రమలో ఇటీవల కాలంలో ఇదో రికార్డుగా చెప్పుకోవచ్చు.

50 డేస్ అనే మాట మరోసారి

50 డేస్ అనే మాట మరోసారి

50 రోజుల పండుగ అనే మాటే వినపడని ఈ రోజుల్లో బాస్ దెబ్బ‌కు అర్ధ‌శ‌త‌దినోత్స‌వం అనే మాట‌ను మ‌రోసారి గుర్తు చేసుకోవాల్సి వ‌చ్చింది. ‘ఖైదీ నంబ‌ర్ 150' చిత్రం 53 సెంట‌ర్ల‌ల‌లో 50 రోజుల‌ను పూర్తిచేసుకోవడం గమనార్హం.

100 రోజుల కోసం పరుగులు

100 రోజుల కోసం పరుగులు

జిల్లా వారీగా పరిశీలిస్తే వైజాగ్‌లో 17 థియేటర్లు, ఈస్ట్ గోదావరి 2, వెస్ట్ గోదావరి 2, గుంటూరు జిల్లాలో 4, కృష్ణా 3, నెల్లూరు 3, సీడెడ్-20, నైజాం, క‌ర్ణాట‌క‌లో ఒక సెంట‌ర్ల‌లో 50 రోజుల‌ను పూర్తిచేసుకుని శతదినోత్సవానికి పరుగులు పెడుతున్నది.

పదేండ్ల గ్యాప్ తర్వాత మళ్లీ..

పదేండ్ల గ్యాప్ తర్వాత మళ్లీ..

రాజకీయ ప్రవేశం తర్వాత పదేండ్ల గ్యాప్‌తో చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చాడు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీపై మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ నిర్మించిన ఈ చిత్రానికి వీవీ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

English summary
Mega Star Chiranjeevi Movie completed 50 days. this movie is running successfully in 53 centres.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu