»   » నాని కోసం చిరంజీవి వస్తున్నాడా....? ఎప్పుడూ లేనిది మెగాస్టార్ లో కొత్త మార్పు

నాని కోసం చిరంజీవి వస్తున్నాడా....? ఎప్పుడూ లేనిది మెగాస్టార్ లో కొత్త మార్పు

Posted By:
Subscribe to Filmibeat Telugu

వరుస హిట్స్ తో మంచి ఊపుమీదున్న హీరో నాని తాజా చిత్రం మజ్ను టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నాని, అన్ను ఇమ్మాన్యూల్, ప్రియా శ్రీ లు ప్రధాన పాత్రలుగా విరించి వర్మ తెరకెక్కించిన చిత్రం 'మజ్ను'. మజ్నులో రాజ్‌తరుణ్ గెస్ట్‌ రోల్ పోషిస్తున్నాడు. 3 నుంచి 5 నిమిషాల సీన్‌లో కనిపిస్తాడట. ఇది సినిమాకే హైలైట్‌ అని యూనిట్ వర్గాలు అంటున్నాయి. ప్రియురాలి కోసం ఇద్దరు పోటీపడిన సన్నివేశాల్ని కళ్లకు కట్టినట్టు తెరకెక్కించాడట డైరెక్టర్ విరించి వర్మ.

ఎందుకంటే ఈ సినిమా డైరెక్టర్ విరించి వర్మ గతంలో రాజ్ తరుణ్‌తో ఉయ్యాలా జంపాలా చేశాడు కాబట్టి. అయితే ముందుగా ఈ పాత్రను వేరే వారితో చేయించాలనుకున్నారట. కానీ ఫ్రెండ్ అడిగేసరికి రాజ్ తరుణ్ కాదనలేకే ఈ పాత్ర చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేస్తుండగా ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ న్యూస్ సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తోంది. క్లైమాక్స్లో వచ్చే రాజ్ తరుణ్ పాత్ర సినిమాకే హైలెట్ అంటోంది చిత్ర యూనిట్. మొత్తానికి ఈ ఇద్దరు హీరోలు నటిస్తున్న ఈ చిత్రం ఎంతటి విజయం సాధిస్తుందో చూడాలి. ఇక ఇంకో సర్ప్రైజ్ ఏమిటంటే... ఈ సినిమా ఆడియోని ఆవిష్కరించటానికి మెగాస్టార్ రానున్నాడట... మరిన్ని విశేషాలు....


షాకింగ్ వార్త

షాకింగ్ వార్త

ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్‌ పతాకాలపై రూపొందుతున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మజ్ను' చిత్ర ఆడియో వేడుక ఈ ఈరోజు జరపాలని యూనిట్ బావించగా, ఈ వేడుకకి ముఖ్య అతిధి ఎవరనే దానిపై షాకింగ్ వార్త బయటకు వచ్చింది.


చిరంజీవి రానున్నారట

చిరంజీవి రానున్నారట

ఇన్నాళ్ళు మెగా ఫంక్షన్ లకు మాత్రమే ముఖ్య అతిధిగా హాజరైన చిరు మజ్ను చిత్రానికి గెస్ట్ గా హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. చిత్ర నిర్మాత జెమిని కిరణ్ స్పెషల్ రిక్వెస్ట్ పై చిరు ఈ వేడుకకు హాజరవుతున్నారని సమాచారం.


సునీల్ కోసం కూడా

సునీల్ కోసం కూడా

ఎక్కువ గా వేరే ఫంక్షనల్లో కనిపించని చిరు. తనకెంతో ఇష్టమైన తనని అభిమానించే సునీల్ మూవీ జక్కన్న ఆడియో వేడుకకి కూడా గెస్ట్ గా హాజరయ్యారు.


ఇప్పటికే రిలీజ్ చేసేసారు

ఇప్పటికే రిలీజ్ చేసేసారు

మజ్ను చిత్రానికి సంబంధించి ఇప్పటికే ‘కళ్ళు మూసి తెరిచే లోపే.. గుండెలోకే చేరావే..' అంటూ సాగే మొదటి పాటను రేడియో మిర్చి ద్వారా, ‘ఓయ్‌.. మేఘమాల..' అంటూ సాగే రెండో పాటను రెడ్‌ ఎఫ్‌.ఎం. ద్వారా రిలీజ్‌ చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.


త్వరలోనే రిలీజ్

త్వరలోనే రిలీజ్

లహరి మ్యూజిక్‌ ద్వారా విడుదల కానున్న మిగతా పాటలపై అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోండగా త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్‌లోనే చిత్రాన్ని వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.


మొదటి విజయం

మొదటి విజయం

ఈ ఎడాది ప్రారంభంలోనే నాని 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'తో చక్కటి విజయం అందుకున్నాడు. ఫిబ్రవరిలో రిలీజైన ఈ చిత్రానికి తొలిరోజు సూపర్ హిట్టు టాక్ వచ్చింది. అయితే టాక్ బాగున్నప్పటికి 'కృష్ణగాడు' కలెక్షన్ల విషయంలో మాత్రం వెనుకపడ్డాడు. అయిన్నప్పటికి చివరికి ఈ మూవీ సక్సెస్ లిస్ట్ లోకి చేరింది.


జెంటిల్ మేన్

జెంటిల్ మేన్

ఇక ఇటీవలే నాని 'జెంటిల్ మేన్' అంటూ మరో మూవీతో వచ్చాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. 'జెంటిల్ మేన్' మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చిన్నప్పటికి ఫైనల్ ఈ మూవీ 20క్రోర్స్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెప్పుతున్నాయి.


ఎడాదిలో మూడు విజయాలు

ఎడాదిలో మూడు విజయాలు

ఇలా రెండు విజయాలు అందుకున్న నాని ఇప్పుడు 'మజ్ను' మూవీతో మరో విజయం దక్కించుకోవాలని ఉత్సాహపడుతున్నాడు. ఇలా ఒకే ఎడాదిలో మూడు విజయాలు అందించిన హీరోగా సరికొత్త రికార్డ్ ని లిఖించాలని నేచురల్ స్టార్ భావిస్తున్నాడు. మరి నాని ఆశలను 'మజ్ను' ఏం చేస్తాడో చూడాలి.


English summary
The audio of Nani's film "Majnu" will be launched today and mega star Chiranjeevi will grace the event as the chief guest.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu