»   »  డాడీ డిసైడ్ అయ్యారు: 150 మూవీ దర్శకుడిపై రామ్ చరణ్

డాడీ డిసైడ్ అయ్యారు: 150 మూవీ దర్శకుడిపై రామ్ చరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకుడిగా ఖరారైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని రామ్ చరణ్ కూడా ధృవీకరిచారు. ‘అవును నిజమే. మొత్తానికి డాడీ డిసైడ్ అయ్యారు. మెగాస్టార్ 150వ సినిమాకు దర్శకత్వం వహించబోయేది పూరి జగన్నాథ్. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది' అంటూ రామ్ చరణ్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

YES It's true!!! finally dad has decided .Mega star's 150th movie director is Puri Jaganath.Excited!!!#chiru150

Posted by Ram Charan on Sunday, May 10, 2015

ఈ సినిమా 1940-50 కాలం నాటి బ్యాక్ డ్రాపుతో ఉంటుందిన సమాచారం. ప్రస్తుతానికి దర్శకుడు పూరి జగన్నాథ్ అనే విషయం మాత్రమే ఖరారైంది. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. పూరి దర్శకత్వంలో చిరంజీవి 150వ సినిమా వస్తుందనగానే అభిమానులు కాన్ఫిడెంటుగా ఉన్నారు.

నిన్న మొన్నటి వరకు చిరంజీవి 150వ సినిమాపై చాలా రకాల ప్రచారం జరిగింది. ఆయన సినిమా వినోదాత్మకంగా ఉంటుందని....ఇందుకోసం పూరి జగన్నాథ్ ‘ఆటో జానీ' అనే టైటిల్ రిజిస్టర్ చేయించినట్లు కూడా టాక్. అయితే ఇపుడు సినిమా బ్యాక్ డ్రాపు 1940-50 కాలం నాటిది అనే విషయం బయకు రాగానే ఇది ఎలాంటి కాన్సెప్టు అయి ఉంటుంది? స్వాతంత్రోద్యమ కాలం నాటి సంఘటనలకు సంబంధించిన అంశాలు ఇందులో ఉంటాయా? సినిమా పూర్తి సందేశాత్మకంగా, దేశభక్తిని రేకెత్తించే విధంగా ఉంటుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతోంది.

 Mega star's 150th movie director is Puri Jaganath

ఆ మధ్య చిరంజీవి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఊయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రలో నటిస్తాడనే ప్రచారం జరిగింది. మరి అప్పటి ప్రచారమే నిజం కాబోతోందా?...... ఇవన్నీ తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. చిరంజీవి పుట్టినరోజు నాటికి 150వ సినిమాకు సంబంధించి విషయాలపై పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించబోతున్నారు. బండ్ల గణేష్ సహనిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉంది.

English summary
"YES It's true!!! finally dad has decided .Mega star's 150th movie director is Puri Jaganath.Excited!!!" Ram Charan said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu