For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'హలో' కోసం ఎవరిని దించుతున్నారో తెలుసా?, ఈసారి బాక్స్ బద్దలైపోవాల్సిందే?..

  |

  స్టార్లతో సినిమాలంటే కోట్లతో వ్యవహారం. ఆ స్టార్ వాల్యూనే భారీ ఓపెనింగ్స్ రాబట్టుకొస్తుందనేది నిర్మాతల భరోసా. కానీ ఒక్కోసారి వ్యవహారం బెడిసికొట్టి అసలుకే ఎసరొచ్చే సందర్భాలు లేకపోలేదు.

  అఖిల్ పై పోలండ్ బాలుడి ట్వీట్.. నాగార్జున రిప్లై..! | Filmibeat Telugu

  అందుకే ఓ స్టార్ హీరో సినిమా ప్రమోషన్స్‌లో మరో స్టార్ హీరో కూడా మెరవడం పరిపాటి. తద్వారా ఆ హీరో అభిమానులకు కూడా సినిమాపై ఎటెన్షన్ క్రియేట్ అవుతుందనేది వారి ఉద్దేశం.

  అక్కినేని నట వారసుడు 'అఖిల్' సినిమా తీవ్ర పరాభవాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. తాజా చిత్రం 'హలో' ద్వారా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ప్రయత్నిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ద్వారా ఇప్పుడీ సినిమాకు ఎటెన్షన్ క్రియేట్ చేయాలనుకుంటుండటం విశేషం.

   ఈసారి ఎలాగైనా!:

  ఈసారి ఎలాగైనా!:

  నాగార్జున వారసుడిగా ఎంట్రీ ఇస్తూ అఖిల్ చేసిన తొలి సినిమా ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. దీంతో అఖిల్‌ను హీరోగా నిలబెట్టేందుకు ఈసారి చాలా జాగ్రత్తగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఫీల్ గుడ్ సినిమాలకు పెట్టింది పేరైన విక్రమ్ కె కుమార్ గౌడ్‌ను దర్శకుడిగా ఎంచుకోవడానికి ఇదే కారణమని చెప్పవచ్చు.

  సెన్సార్ 'యు' సర్టిఫికెట్:

  సెన్సార్ 'యు' సర్టిఫికెట్:

  ఫ్యామిలీ, రొమాంటిక్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సెన్సార్ 'యు' సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో హలో చిత్రం కుటుంబ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

   కథ ఏంటి?

  కథ ఏంటి?

  ఇక కథ విషయానికొస్తే.. చిన్న‌తనంలోనే ఇద్దరూ విడిపోవాల్సిన సందర్భం వస్తుంది. అలా విడిపోయేట‌ప్పుడు.. హీరోకి హీరోయిన్ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అలా 15 ఏళ్ల పాటు.. హీరో ఆమె కోసం ఎన్ని సార్లు ఫోన్ చేసినా మళ్లీ ఆమె కాంటాక్ట్ లోకి రాదు. ఎప్పుడు తను 'హ‌లో' అంటుందా అని హీరో వేచిచూస్తూ ఉంటాడు. సింపుల్‌గా ఇదీ కథ.

  మ్యాజిక్ రిపీట్ అవుతుందా?:

  మ్యాజిక్ రిపీట్ అవుతుందా?:

  ఇష్క్, మనం వంటి సినిమాలతో తెలుగు తెరపై బ్యూటిఫుల్ కథల్ని ప్రజెంట్ చేసిన విక్రమ్ కె కుమార్ ఈసారి కూడా మ్యాజిక్ చేస్తారనే అంతా భావిస్తున్నారు. తనదైన స్క్రీన్ ప్లే తో అఖిల్ కు విక్రమ్ పక్కా హిట్ ఇస్తారని నాగార్జున నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

   'చిరు'ని దించుతున్నారు..:

  'చిరు'ని దించుతున్నారు..:

  'అఖిల్' సినిమా విడుదల సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈసారి హలో స్పెషల్ ప్రమోషనల్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతుండటంతో ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయ్యే అవకాశాలున్నాయి. చిరంజీవి డైలాగ్‌లో చెప్పాలంటే.. బాక్స్ బద్దలవుతుందో లేదో చూడాలి మరి.

  English summary
  Now, it is learnt that Megastar Chiranjeevi has been invited as the chief guest for the pre release event which will be held tomorrow in Hyderabad.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X