Don't Miss!
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- News
ఉత్తరాంధ్రలో టీడీపీకి అగ్నిపరీక్ష: ఆ నియోజకవర్గం అభ్యర్థి మార్పు- బాలయ్య ప్రచారం చేసినా..
- Sports
భారత్ మా బౌలింగ్ వ్యూహాలను కాపీ కొట్టింది: రమీజ్ రాజా
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
కొరటాల వివాదంపై స్పందించిన మెగాస్టార్.. ఆచార్య ఫ్లాప్ గురించి చిరంజీవి ఏం చెప్పారంటే?
మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఊహించిన విధంగా ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే గత వారం రోజుల ముందు నుంచి కూడా మెగాస్టార్ సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీగా పాల్గొంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఆచార్య ఫ్లాప్ గురించి అలాగే కొరటాల శివ పై చేసిన కొన్ని కామెంట్స్ గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

సక్సెస్ అవుతుందని అనుకుంటే..
మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ఆచార్య సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో తెరపైకి వచ్చిన ఈ సినిమా లో రామ్ చరణ్ తేజ్ కూడా మరొక పాత్రలో కనిపించడంతో తప్పకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుంది అని చిత్ర యూనిట్ సభ్యులు అందరు కూడా ఎంతో నమ్మకంతో కనిపించారు. కానీ ఆ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది.

ఆ విధంగా వార్తలు
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో నష్టాలను కలిగించిన సినిమాలలో ఇది ఒకటిగా నిలిచింది అని చెప్పవచ్చు. అయితే ఆ సినిమా ప్లాప్ అయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి పూర్తిస్థాయిలో దర్శకుడి నిర్ణయం ప్రకారమే ఆ సినిమా చేసాము అని స్పందించినట్లుగా మీడియాలో అనేక రకాలు కథనాలు అయితే వెలువడ్డాయి. ఒక విధంగా మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ పై భారం వేసారు అని కూడా చాలామంది కామెంట్ చేశారు.

ఎంత మాత్రం కరెక్ట్ కాదు
అయితే ఆ విధానంపై మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నేను కేవలం కొరటాల శివని టార్గెట్ చేస్తూ అలా మాట్లాడలేదు ఒక విధంగా ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరి దర్శకులను పనికి విధానాన్ని ఉద్దేశిస్తూ ఆ విధంగా మాట్లాడాను. అనవసరంగా కొరటాల శివకు నాకు మధ్య విభేదాలు వచ్చాయి అని తప్పుడు వార్తలు ప్రచారం చేశారు. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు.. అని మెగాస్టార్ అన్నారు

ముందుగా ప్లాన్ చేసుకోవాలి
అంతేకాకుండా ఒక సినిమా కథకు స్క్రీన్ ప్లే మొత్తం కూడా సిద్ధమైన తర్వాతనే సెట్స్ పైకి వెళ్లి షూటింగ్ మొదలు పెట్టాలి. అంతేకాకుండా సినిమా కోసం అనుకున్న ఖర్చు కూడా ముందుగానే ప్లాన్ తో రెడీ అవ్వాలి. దానికి తగ్గట్టుగానే షూటింగ్ పనులను పూర్తి చేసుకోవాలి. కేవలం ఒక దర్శకుడు వల్లే బడ్జెట్ విషయంలో నియంత్రణ అనేది సాధ్యమవుతుంది..అని చిరంజీవి చెప్పారు.

అందుకే అలా అన్నాను
ఒక విధంగా ప్లాన్ లేకుండా ఎక్కువ గంటలు సినిమా తీసేసి మళ్లీ దాన్ని కట్ చేసి రెండున్నర గంటలు చేస్తున్నారు. ఈ పద్ధతి మార్చుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. ఇది కేవలం కొరటాల శివ ను దృష్టిలో పెట్టుకొని అనడం లేదు అని డైరెక్టర్ ను కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటాము కాబట్టి అందుకే ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది.. అని మెగాస్టార్ అన్నారు.