twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సైలెంట్‌గా అప్లై అవుతున్న మెగాస్టార్ నిర్ణయాలు.. న్యూస్ ఛానల్స్‌కు దిమ్మతిరిగేలా!

    |

    మెగాస్టార్ చిరజీవి ఇటీవల టాలీవుడ్ ప్రముఖులందరితో సీక్రెట్ గా సమావేశం ఏర్పరచిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు, వాటి నివారణకు తీసుకోవలసి చర్యల గురించి మెగాస్టార్ స్టార్ హీరోలందరితో సమావేశమై చర్చించారు ఈ సమావేశంలో న్యూస్ ఛానల్స్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో నిర్ణయాల్ని ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. మీడియా సంచలనం శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన దారుణమైన వ్యాఖ్యల అంనతరం టాలీవుడ్ లో కదలికలు మొదలయ్యాయి. పవన్ ఫిలిం ఛాంబర్ లో హడావిడి చేసిన తరువాత చిరు సైలెంట్ గా టాలీవుడ్ ప్రముఖతో సమావేశం నిర్వహించారు. టాలీవుడ్ లో ప్రస్తుతం సైలెంట్ రివల్యూషన్ మొదలైనట్లు తెలుస్తోంది.

    Recommended Video

    Chiranjeevi Decision To Ban Media Promotions..Goes Controversial
    న్యూస్ ఛానల్స్ దిగజారే విధంగా

    న్యూస్ ఛానల్స్ దిగజారే విధంగా

    కొన్ని తెలుగు న్యూస్ ఛానల్స్ తీరు ఈ మధ్య కాలంలో విసుగు తెప్పించే విధంగా సాగింది. అనవసరమైన వ్యవహారాల్ని హైలైట్ చేస్తూ, అర్థం లేని డిబేట్లని నిర్వహిస్తూ కొన్ని మీడియా సంస్థలు నానా హంగామా చేశాయి. తన తల్లిని దూషించడంతో పవన్ కళ్యాణ్ నేరుగానే కొన్ని మీడియా సంస్థలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. టివి9, టీవీ5, ఏబీఎన్ ఛానల్స్ ని బహిష్కరించాల్సిందిగా అభిమానులకు పిలుపు ఇచ్చారు.

    టాలీవుడ్‌ని ఏకం చేసిన మెగా క్యాంప్

    టాలీవుడ్‌ని ఏకం చేసిన మెగా క్యాంప్

    శ్రీరెడ్డి, వర్మ పైకి కనిపిస్తున్న పావులు మాత్రమే అని దీనివెనుక చాలా కుట్ర దాగివుందని అల్లు అరవింద్ నేరుగా ఆరోపించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా యుద్ధం మొదలుపెడితే, అల్లు అరవింద్, నాగబాబు, మెగాస్టార్ చిరంజీవి మీడియా ఆగడాలని అరికట్టడానికి వ్యూహం రచించి టాలీవుడ్ ని ఏకం చేసారు.

    చిరంజీవి నిర్ణయాలు

    చిరంజీవి నిర్ణయాలు

    మెగాస్టార్ చిరంజీవి నిర్వహించిన సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదట సదరు మీడియా సంస్థల్ని బహిష్కరించాలని భావించినా దానికి ఆమోదం లభించలేదు. దీనితో మరో ప్రతిపాదన ఆమోదం లభించిందట. మీడియా ముఖాముఖీ ఇండస్ట్రీ వ్యవహారాల్ని పంచుకోవద్దని, సినిమాలని సొంతంగానే ప్రమోట్ చేసుకోవాలని చిరు సూచించారట.

    ఎవరు పడితే వారు

    ఎవరు పడితే వారు

    ఎవరు పడితే వారు వెళ్లి టివి ఛానల్స్ డిబేట్లలో పాల్గొనుతుండడంతో సమస్య మరింత పెద్దదిగా మారుతోంది. మా అసోసియేషన్ సభ్యులందరికి ఇటీవల లెటర్స్ పంపించారట. కేవలం కొందరిని మాత్రమే అధికారిక స్పోక్స్ పర్సన్ లని నియమిస్తామని, మిగిలిన వారెవరూ ఇండస్ట్రీకి సంబందించిన విషయాలని మీడియాతో పంచుకోకూడదని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

    టాలీవుడ్ కంట్రోలింగ్ కమిటీ

    టాలీవుడ్ కంట్రోలింగ్ కమిటీ

    అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి సూచన మేరకు కొందరు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో టాలీవుడ్ కంట్రోలింగ్ కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కమిటీలో తమ్మారెడ్డి భరద్వాజ, కొందరు దర్శకులు, నిర్మాతలని సభ్యులుగా నియమించనున్నారు.

    English summary
    Tollywood goes into silent mode. Megastar Chiranjeevi effect on News Channels
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X