»   » చిరంజీవి కాలికి గాయం, వివి వినాయక్ వెళ్లింది అందుకే...!

చిరంజీవి కాలికి గాయం, వివి వినాయక్ వెళ్లింది అందుకే...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవిని ఇటీవల దర్శకుడు వివి వినాయక్ కలవడంతో సరికొత్త వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. తన 150వ సినిమాకు పూరిని తప్పించి వినాయక్ తో చేయాలని చిరంజీవి ప్లాన్ చేసుకుంటున్నట్లు వార్తలు హల్ చల్ చేసాయి. అయితే వినాయక్ చిరంజీవిని కలవడం వెనక అసలు కారణం ఏమిటో బయటకు వచ్చింది.

మెగా సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి కాలికి మైనర్ ఫ్యాక్చర్ అయిందని, ఇంట్లో మెట్లపై నుండి జారి పడ్డారని సమాచారం. ఈ విషయాన్ని మెగా ఫ్యామిలీ బయటకు పొక్కనీయలేదు. అయితే చిరంజీవికి సన్నిహితంగా వినాయక్ కు ఈ విషయం తెలియడంతో వెంటనే వెళ్లి పరామర్శించినట్లు సమాచారం.

Megastar Chiranjeevi has suffered a minor leg fracture

చిరంజీవి, వినాయక్ మధ్య అసలు 150వ సినిమా ప్రస్తావనే రాలేదని ఆయనకు అత్యంత సన్నిహితులు చెప్పినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా చిరంజీవి 150వ సినిమా చేసేది పూరి జగన్నాథే అని అంటున్నారు. ఇప్పటికే పూరి ఫస్టాఫ్ స్క్రిప్టు వినిపించారని, సెకండ్ హాఫ్ స్టోరీ త్వరలో వెల్లడిస్తారని సమాచారం.

మరో వైపు చార్మి కూడా ఇటీవల ‘జ్యోతి లక్ష్మి' అభినందన సభలో ఈ విషయం మరోసారి ఖరారు చేసారు. ఈ వేడుకకు పూరి రాక పోవడంపై ఛార్మి స్పందిస్తూ.... ఆయన చిరంజీవి 150వ సినిమా విషయంలో బిజీగా ఉన్నారని, అందుకే రాలేక పోయారని స్పష్టం చేసారు.

English summary
Reports have now surfaced that Megastar has suffered a minor leg fracture after he slipped down from a low-height staircase at his home. While he is recuperating from the injury, Vinayak visited his home to wish a speedy recovery.
Please Wait while comments are loading...