»   » చిరు వచ్చేసారు: 150 సినిమాలు, 150 నిమిషాలు, 150 మంది డాన్సర్స్! (ఫోటోస్)

చిరు వచ్చేసారు: 150 సినిమాలు, 150 నిమిషాలు, 150 మంది డాన్సర్స్! (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శనివారం సాయంత్రం జరుగబోయే మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం 150 ప్రీ రిలీజ్ వేడుకలో ఓ స్పెషల్ డాన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. బహుషా ఇప్పటి వరకు ఇలాంటి ఈవెంట్ తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పుడూ జరుగలేదేమో?

మెగాస్టార్ చిరంజీవి నటించిన 150 చిత్రాలలోని పాటలతో 150 డ్యాన్సర్సు 150 నిమిషాల పాటు పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు హాయ్ లాండ్ లో ఈ వేడుక ప్రారంభం కానుంది. ఈ వేడుకకు దాదాపు లక్ష మంది అభిమానులు హాజరవుతారని అంచనా.


150 స్పెషల్ పోస్టర్

150 స్పెషల్ పోస్టర్

మెగాస్టార్ నటించిన 150 చిత్రాలలోని పాటలతో 150 డ్యాన్సర్సు 150 నిమిషాల పాటు పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. ఇందుకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ఇది.


గన్నవరం ఎయిర్ పోర్టులో

గన్నవరం ఎయిర్ పోర్టులో

కాగా చిరంజీవి శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా హాయ్ లాండ్ కు చేరుకున్నారు.


అభిమానులు

అభిమానులు

గన్నవరం ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన చిరంజీవికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆయనతో కరచాలనం చేసేందుకు అభిమానులు పోటీ పడ్డారు.


 గ్రాండ్ ఈ వెంట్

గ్రాండ్ ఈ వెంట్

ఖైదీ నెం 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ మధ్య కాలంలో ఎన్నడూ జరుగనంత గ్రాండ్ గా జరుగుతోంది. దాదాపు లక్ష మంది ఈ వేడుకకు హాజరవుతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసారు.


English summary
Megastar Chiranjeevi just landed in Vijayawada airport for KhaidiNo150 pre-release event. Check out photos.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu