»   » మెగాస్టార్ చిరంజీవి సరసన మాజీ ప్రపంచసుందరి.. ఉయ్యాలవాడ బడ్జెట్ వింటే షాకే..

మెగాస్టార్ చిరంజీవి సరసన మాజీ ప్రపంచసుందరి.. ఉయ్యాలవాడ బడ్జెట్ వింటే షాకే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఖైదీ నంబర్ 150 చిత్రంతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ తన 151వ చిత్రంపై మళ్లీ దృష్టిపెట్టారు. ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథను తెరకెక్కించేందుకు మెగాస్టార్ సిద్ధమవుతున్నారు. ఉయ్యాలవాడ గెటప్ సంబంధించిన స్టిల్స్ కోసం త్వరలోనే ఫోటోషూట్ నిర్వహించనున్నట్టు ఇటీవల మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంలో చిరంజీవి వెల్లడించారు. ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై మెగాస్టార్ తనయుడు, హీరో రాంచరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్, విద్యాబాలన్‌ను తీసుకొనే విషయంపై చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.

సురేందర్ రెడ్డికి విందు..

సురేందర్ రెడ్డికి విందు..

ఇటీవల కొణిదెల ప్రొడక్షన్‌లో రూపొందే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నదున్న సురేందర్‌రెడ్డిని స్వాగతించి మెగాస్టార్ ఇంట్లో విందును ఏర్పాటు చేశారు నిర్మాత రాంచరణ్. కేక్ కట్ చేసి విందును జరుపుకోవడం తెలిసిందే. ఈ సినిమా కథపై ఇప్పటికే పూర్తిగా కసరత్తు చేసిన సురేందర్ రెడ్డి హీరోయిన్ల ఎంపికపై దృష్టిపెట్టినట్టు తెలుస్తున్నది.

 బాలీవుడ్ హీరోయిన్లపై కన్ను..

బాలీవుడ్ హీరోయిన్లపై కన్ను..

ఈ పిరియాడిక్ సినిమాలో ఓ అగ్రతారను నటింపజేయాలన్న ఉద్దేశంతో దర్శకుడు సురేందర్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రధానంగా బాలీవుడ్ తారలైతే బాగుంటుందనే అభిప్రాయాన్ని నిర్మాత చెర్రీ వద్ద స్పష్టం చేయగా ఆయన సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. వారిద్దరి చర్చల ఫలితంగా మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్, లేదా విలక్షణ నటి విద్యాబాలన్ పేర్లు తెరమీదకు వచ్చినట్టు తెలుస్తున్నది.

ఐశ్వర్యరాయ్, విద్యాబాలన్‌తో సంప్రదింపులు

ఐశ్వర్యరాయ్, విద్యాబాలన్‌తో సంప్రదింపులు

మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత రాంచరణ్ సూచన మేరకు ఐశ్వర్యరాయ్, విద్యాబాలన్‌తో సంప్రదింపులు జరుతున్నట్టు సమాచారం. వారిద్దరిలో ఎవరైనా ఒకర్ని ఉయ్యాలవాడలో కచ్చితంగా నటింపజేసేందుకు ప్రయత్నాలు జోరందుకున్నట్టు తెలుస్తున్నది.

 బడ్జెట్ 125 కోట్లు..

బడ్జెట్ 125 కోట్లు..

ప్రస్తుతం ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రణాళిక ప్రకారం అనుకున్నదనుకున్నట్టు జరిగితే ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా ఈ సినిమాను రూ.125 కోట్ల బడ్జెట్‌తో తీయనున్నట్టు తెలిసింది. స్వాత్రంత్య సంగ్రామంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరుడైన ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి కథను వెండితెరపై ఆవిష్కరించేందుకు ప్రయత్నం జరుగుతున్నది.

English summary
chiranjeevi' 151th movie is gearing up with fast pre production work. Director Surender Reddy wants to take Aishwarya Rai or Vidya balan beside megastar. Reports says that movie unit is under discusssion with top Bollywood stars.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu