»   » పాజిటివ్-నెగెటివ్ : ఖైదీ 150 లుక్ పై ప్రముఖుల కామెంట్స్

పాజిటివ్-నెగెటివ్ : ఖైదీ 150 లుక్ పై ప్రముఖుల కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

వయసు అరవై దాటినప్పటికీ యంగ్‌ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా పోస్టర్‌లను చూస్తే ఎవరైనా ఆ మాట ఒప్పుకోవాల్సిందే. ఇంతకుముందు చెప్పినట్టుగానే దీపావళి సందర్భంగా 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు.

ఆ పోస్టర్‌లో చిరంజీవిని చూస్తుంటే ఎప్పుడో 'ఇంద్ర', 'ఠాగూర్‌' సినిమాల్లోని చిరంజీవి గుర్తొస్తున్నాడు. వయసు ప్రభావం కొంచం కూడా చిరుపై పడలేదా అన్నత యంగ్ గా కనిపిస్తున్న టాలీవుడ్ లెజెండ్ హీరో లుక్ పై ఒక్కొక్కళ్ళూ ఒక్కొక్క విధంగా కామెంట్ చేస్తున్నారు. కొన్ని పాజిటివ్ గా ఉంటే మరికొన్ని మాత్రం మరీ వెటకారం గా ఉన్నాయి. ఎవరు చేస్తున్నారొ గానీ అల్లు అర్జున్ తో ఈ పోస్టర్ లో ఉన్న స్ట్ల్ ని కంపేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. బన్నీ ని చిరు అనుకరిస్తున్నాడు అంటూ చేస్తున్న ఈ కామెంట్లు మాత్రం... ఆఖరికి బన్నీ అభిమానులకు కూడా చిర్రెత్తిస్తున్నట్టున్నాయి...


అదిరిపోయే గిఫ్ట్ :

అదిరిపోయే గిఫ్ట్ :

మెగాస్టార్ చిరంజీవి దీపావళి శుభాకాంక్షలతో అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. దాదాపు 8 ఏళ్ళ తర్వాత చిరు వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తుడడంతో ఆయన సినిమాపై అభిమానులలో బోలెడన్ని ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. అయితే తమ అభిమాన హీరోను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో వివి వినాయక్ చిరుని అలానే చూపించబోతున్నట్టు తెలుస్తోంది.


బాస్ ఈజ్ బ్యాక్ అనేలా :

బాస్ ఈజ్ బ్యాక్ అనేలా :

కొన్ని రోజులుగా దీపావళి శుభాకాంక్షలతో చిరు ఫస్ట్ లుక్ విడుదలవుతుందని తెలియడంతో ఆ లుక్స్ కోసం ఫ్యాన్స్ కళ్ళల్లో కొవ్వొత్తులు వేసుకొని మరి ఎదురు చూశారు. తాజాగా ఖైదీ నెం 150 చిత్ర యూనిట్ చిరుకి సంబంధించి రెండు లుక్స్ ని విడుదల చేసింది. ఇందులో బాస్ ఈజ్ బ్యాక్ అనేలా చిరు లుక్ కనిపిస్తుండడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కేవలం పోస్టర్ లోనే చిరు లుక్ ఇంత అద్భుతంగా ఉంటే వెండి తెరపై మెగాస్టార్ చిరు ఎలా కనిపిస్తాడో అని ఫ్యాన్స్ ఊహాలోకాల్లో విహరిస్తున్నారు.


పాజిటివ్ గా స్పందించాడు:

పాజిటివ్ గా స్పందించాడు:

ఎప్పుడూ నెగెటివ్ గా కామెంట్లు చేసి ఆయా హీరోల అభిమానుల ఆగ్రహానికి గురయ్యే కాంట్రవర్శియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ఈ పోస్టర్ లో చిరు లుక్ పై పాజిటివ్ గా స్పందించాడు. 'నేను ఏడేళ్ల క్రితం చూసిన చిరంజీవి కన్నా ఈ లుక్ లో చిరు వయసు ఏడేళ్లు తక్కువగా కనిపిస్తోంది' అంటూ కామెంట్ చేశాడు వర్మ.దీనితో ఎప్పుడు చిరంజీవి పవన్ లను టార్గెట్ చేసే వర్మ చిరంజీవి ‘ఖైదీ' లుక్ పై ప్రశంసలు కురిపించడం వెనుక ఏమనా వ్యూహాలు ఉన్నాయా ? అన్న కోణంలో కామెంట్స్ పడుతున్నాయి.


తరణ్ ఆదర్శ్:

తరణ్ ఆదర్శ్:

బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ పేజ్ లో మెగా ఫస్ట్ లుక్ ను పోస్ట్ చేస్తు ప్రశంసలు కురిపించాడు. అయితే ఎందరో ప్రముఖులు చిరంజీవి ‘ఖైదీ' లుక్ పై ప్రశంసలు కురిపించినా అందరి ప్రశంసలకు భిన్నంగా బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు చిరు లుక్ పై చేసిన ప్రశంసలు అందరికీ షాక్ ఇచ్చాయి.


బర్నింగ్ స్టార్ సంపూ:

బర్నింగ్ స్టార్ సంపూ:

ఇక బర్నింగ్ స్టార్ సంపూ చిరు కి అద్బుతమైన కాంప్లి మెంట్ ఇచ్చాడు. మామూలుగానే చిరు వీరాభిమానులలో ఒకడైన సంపూర్నేష్ బాబు 'కొందరు వయసుకి తగ్గ పాత్రలు చేస్తారు. అయితే చిరంజీవి చేసే పాత్రను బట్టి వయసు డిసైడ్‌ అవుతుంది' అంటూ చిరు పోస్టర్‌ను షేర్ చేస్తూ చేసిన కామెంట్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.


సేమ్ టు సేమ్ :

సేమ్ టు సేమ్ :

ఇది ఇలా ఉండగా చిరంజీవి ‘ఖైదీ' ఫస్ట్ లుక్ ను చూసి మరికొందరు చేస్తున్న కామెంట్స్ మైండ్ ను బ్లాంక్ చేస్తున్నాయి. చిరంజీవి ఫస్ట్ లుక్ లోని డాన్సింగ్ స్టిల్ ను అల్లు అర్జున్ గత సినిమాలలోని డాన్సింగ్ పోజ్ తో కంపేర్ చేస్తూ చిరంజీవి బన్నీ పోజులను కాపీ కొడుతున్నాడేంటి అంటూ ‘సేమ్ టు సేమ్ హా హా హా' అంటూ మరికొందరు చిరంజీవి ఫస్ట్ లుక్ ను టార్గెట్ చేస్తున్నారు..


భారీ అంచనాలు:

భారీ అంచనాలు:

తమిళ్ లో ఘనవిజయం సాధించిన కత్తి సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో దాదాపు దశాబ్ద కాలం తరువాత చిరంజీవి ఫుల్ లెంగ్త్ రోల్ లో వెండితెర మీద కనిపిస్తుండటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అందుకు తగ్గట్టుగా మెగా టీం కూడా ఇంట్రస్టింగ్ పోస్టర్ లతో సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది.


దీపావ‌ళి కానుక‌గా:

దీపావ‌ళి కానుక‌గా:

యాక్ష‌న్ ప్యాక్డ్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో మెగాస్టార్ స్ట్రెయిట్‌ లుక్.. మ్యాన‌రిజ‌మ్స్‌ని ఆవిష్క‌రించే కొత్త‌ స్టిల్స్‌ చూడాల‌న్న ఆస‌క్తిని ఫ్యాన్స్‌ క‌న‌బ‌రిచారు. అందుకే ఈ దీపావ‌ళి కానుక‌గా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ల‌ను నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ లాంచ్ చేశారు. ఈ పోస్ట‌ర్ల‌లో మెగాస్టార్ లుక్ సూపర్భ్ అన్న టాక్ వ‌చ్చింది. త‌న‌దైన స్టైల్లో ష‌ర్ట్ మ‌డ‌త పెడుతూ బాస్ ఓ స్టిల్‌లో గ్యాంగ్‌లీడ‌ర్‌ని త‌ల‌పించారు. వేరొక స్టిల్‌లో త‌న‌కు మాత్ర‌మే సాధ్యం అనిపించే డ్యాన్స్ మూవ్‌మెంట్‌ని ఆవిష్క‌రించారు.


ఠాగూర్ ని మించిన విజయం :

ఠాగూర్ ని మించిన విజయం :

ఈ మూవీపై అటు అభిమానులలోనే కాక ఇండస్ట్రీలోను భారీ అంచనాలున్నాయి. ఇంక ఈ చిత్రాన్ని వివి వినాయక్ చాలా ప్రస్టేజీయస్ గా తీసుకొని తెరకెక్కిస్తుండడంతో అంచనాలు తారా స్థాయికి చేరాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఠాగూర్ చిత్రం ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో, అంతకన్నా భారీగా ఈ చిత్రం విజయబావుట ఎగురవేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.


English summary
The “Boss is back” in a ravishing avatar in the new posters of Khaidi No 150. The filmmakers have thrown some light on the silhouette first-look bringing Megastar Chiranjeevi to life for Diwali.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu