»   » అమెరికాని ఊపేస్తున్న మెగాస్టార్ పాట..అంతా దానికోసమే, ఎలా కనెక్ట్ అయ్యిందంటే!

అమెరికాని ఊపేస్తున్న మెగాస్టార్ పాట..అంతా దానికోసమే, ఎలా కనెక్ట్ అయ్యిందంటే!

Subscribe to Filmibeat Telugu
Megastar Chiranjeevi's song Shaking USA అమెరికాని ఊపేస్తున్న మెగాస్టార్

పాటకు లయబద్దంగా డాన్స్ వేస్తూ అభిమానులని ఉర్రూతలూగించడం మెగాస్టార్ చిరంజీవికే చెల్లింది. టాలీవడ్ లో చాలా మంది డాన్సర్లు ఉన్నా చిరంజీవిలా గ్రేస్ తో డాన్స్ వేసేవారు లేరనేది అభిమానులు చెప్పే మాట. తన రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 లో కూడా చిరు డాన్సులు ఇరగదీసాడు. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా అభిమానులని ఆకట్టుకుంది. చందమామ కాజల్ అగర్వాల్ తో కలసి మెగాస్టార్ వేసిన స్టెప్పులు అభిమానుల చేత విజిల్స్ పెట్టించాయి. కాగా ప్రస్తుతం ఖైదీ నెంబర్ 150 చిత్రంలోని పాట ఒకటి అమెరికాని కుదిపేస్తోంది.

ఖైదీ నెం 150తో ఘమైన రీఎంట్రీ

ఖైదీ నెం 150తో ఘమైన రీఎంట్రీ

రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత చిరు సినిమాల్లో నటించలేదు. రాజకీయాలని కాస్త పక్కన పెట్టి చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన చిత్రం ఖైదీ నెం 150. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.

గ్యాప్ వచ్చింది కానీ

గ్యాప్ వచ్చింది కానీ

సినిమాల విషయంలో గ్యాప్ వచ్చింది కానీ తనలోని గ్రేస్ లో మార్పు రాలేదని చిరంజీవి నిరూపించారు. మెగాస్టార్ వెండితెరపై వేసే స్టెప్పులకు ఎలాంటి స్పందన ఉంటుందో ఈ చిత్రం ద్వారా మరోమారు రుజువైంది.

అదరగొట్టిన దేవిశ్రీ

అదరగొట్టిన దేవిశ్రీ

ఈ చిత్రానికి సంగీత దర్శకుడు దేవిశ్రీ అదిరిపోయే ఆల్బమ్ అందించాడు.

అమెరికాని ఊపేస్తున్న మెగాస్టార్ సాంగ్

అమెరికాని ఊపేస్తున్న మెగాస్టార్ సాంగ్


ఖైదీ చిత్రంలోని సుందరి అనే సాంగ్ ప్రస్తుతం అమెరికాని కుదిపేస్తోంది. అవును ఇది నిజం. సినిమా విడుదలైన ఏడాది గడచిన తరువాత ఆ పాట అమెరికాలో పాపులర్ కావడానికి కారణం ఉంది.

ఆ డాన్స్ గ్రూప్ వలనే

ఆ డాన్స్ గ్రూప్ వలనే

టీం శ్రాయ్ ఖన్నా అనే డాన్స్ గ్రూప్ ఇండియాలో పలు ఈవెంట్ లలో పాల్గొంది. వారి స్లో మోషన్ మరియు వేగవంతమైన స్టెప్పులతో మంచి పేరు సంపాదించారు. కాగా ఇటీవల ఈ టీం కు అమెరికాలోని షోటైం యట్ ది అపోలో అనే టివి షో నుంచి పిలుపు వచ్చింది.

మెగాస్టార్ సాంగ్ ఎంచుకున్నారు

మెగాస్టార్ సాంగ్ ఎంచుకున్నారు

ఖైదీ చిత్రంలో సూపర్ హిట్ అయిన సుందరి అనే సాంగ్ కు వారు టివి షోలో పెర్ఫామ్ చేసారు. అద్భుతమైన కొరియోగ్రఫీతో వారు యుఎస్ ఆడియన్స్ నిఆకట్టుకున్నారు. వారి స్టెప్పులు మాత్రమే కాదు సుందరి సాంగ్ ట్యూన్ కూడా వినసొంపుగా ఉండడంతో ఆ పాట ప్రస్తుతం యుఎస్ ని కుదిపేస్తోంది.

ఆ పాట కోసం యుఎస్ మొత్తం

ఆ పాట కోసం యుఎస్ మొత్తం


అమెరికా మ్యూజిక్ లవర్స్ అంతా ఇప్పుడు మెగాస్టార్ సాంగ్ కోసం ఆరా తీస్తున్నారు. ఆ పాట కోసం గూగుల్ లో సెర్చ్ మొదలు పెట్టారు. ఆ విధంగా యుఎస్ లో మెగాస్టార్ పాట మానియా మొదలైంది.

English summary
Megastar Chiranjeevi's song goes viral in US. US music lovers are crazy about that song.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu