twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జై హింద్ అని సెల్యూట్ కొట్టాలనిపించింది.. వైల్డ్ డాగ్‌, నాగార్జునను ఆకాశానికెత్తేసిన చిరంజీవి

    |

    ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి నిర్మాతగా ప్రభు సల్మాన్ దర్శకత్వంలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతంగా ప్రదర్శించబడుతున్నది. ఇటీవల ఈ సినిమాను చూసిన మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేయగా అది వైరల్ అయింది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో వైల్డ్ డాగ్ సినిమా గురించి చిరంజీవి మాట్లాడుతూ...

    వైల్డ్ డాగ్ సక్సెస్ మీట్ (ఫొటోలు)

    వైల్డ్ డాగ్ మూవీ చూసిన తర్వాత

    వైల్డ్ డాగ్ మూవీ చూసిన తర్వాత

    వైల్డ్ డాగ్ సినిమా చూసిన తర్వాత నా అభిప్రాయాలను పంచుకోవాలనిపించింది. అదే విషయాన్ని వైల్డ్ డాగ్, ఆచార్య సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డితో చెప్పినప్పుడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాంతో సంతోషంగా ఈ ప్రెస్ మీట్‌కు వచ్చాను. కొన్ని మంచి విషయాలు జరుగుతున్నప్పుడు పదే వాటిని పంచుకోవడం మంచిది. వైల్డ్ డాగ్ సినిమా చూసిన తర్వాత అదే ఫీలింగ్ కలిగింది చిరంజీవి వెల్లడించారు.

    వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్: పవన్ కళ్యాణ్ నా దేవుడంటూ బండ్ల గణేష్ రచ్చ (ఫొటోలు)

    వాస్తవ సంఘటనలతో తెరకెక్కిస్తూ..

    వాస్తవ సంఘటనలతో తెరకెక్కిస్తూ..

    వాస్తవ సంఘటన ఆధారంగా వైల్డ్ డాగ్ సినిమా రూపొందిస్తున్నారనే విషయం తెలుసు. కానీ ఈ సినిమాలో కామెడీ, రొమాంటిక్ సన్నివేశాలు ఉండవనే కొంచెం ఏదో అభిప్రాయంతో ఉన్నాను. పెద్దగా క్యూరియాసిటీ కలుగలేదు. పాటలు లేకపోతే సినిమా డ్రైగా ఉంటుందనే అభిప్రాయం కలిగింది. అదే ఫీలింగ్‌తో సినిమా చూస్తే ఆద్యంతం ఉత్కంఠను కలిగించడమే కాకుండా గగుర్పాటు కలిగించింది. ఇంటర్వెల్ కూడా ఆపకుండా సినిమా చేశాను అని చిరంజీవి అన్నారు.

    ఇలాంటి సినిమా లో ప్రొఫైల్‌లోనా?

    ఇలాంటి సినిమా లో ప్రొఫైల్‌లోనా?

    వైల్డ్ డాగ్ సినిమా చూసిన తర్వాత నాగార్జునకు ఫోన్ చేసి.. ఇంత మంచి సినిమాను ఎందుకు లో ఫ్రొఫైల్‌లో పెట్టారని అడిగాను. ఒక సన్నివేశానికి మరో సన్నివేశానికి మధ్య ఉండే ఆ ఎనర్జీ సినిమాను మరో రేంజ్‌‌కు తీసుకెళ్లింది. సీట్ ఎడ్జ్‌లో కూర్చొని సినిమా చూశాను. వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది. యూరి సినిమా చూసినప్పుడు చాలా అప్రియేషన్ వచ్చింది. ఆ సినిమా చూసిన తర్వాత మనం ఎందుకు చేయడం లేదనే అభిప్రాయం కలిగింది అని చిరంజీవి పేర్కొన్నారు.

    తెలుగువాళ్లు తీసిన అత్యద్భుతమైన మూవీ

    తెలుగువాళ్లు తీసిన అత్యద్భుతమైన మూవీ

    దేశభక్తితో కూడిన వైల్డ్ డాగ్ సినిమా నాగ్ చేయడం చాలా సంతోషం కలిగింది. తెలుగు వాళ్లుగా అత్యద్భుతంగా తీసిన సినిమా వైల్డ్ డాగ్. దేశభక్తిని నాలో ప్రేరేపించేలా చేసింది. ఏదైనా నేరం చేస్తే ఏం జరుగుతుందనే దురభిప్రాయంలో ఉండే క్రిమినల్స్‌కు విజయ్ వర్మ పాత్రలో నాగార్జున చెప్పిన సమాధానంతో నేను థియేటర్లలో చప్పట్టు కొట్టాను అని చిరంజీవి తెలిపారు.

    ట్విస్టుల మీద ట్విస్టులతో..

    ట్విస్టుల మీద ట్విస్టులతో..

    నేరస్థులు ఏ దేశంలో దాచుకొన్నగానీ.. మెడపట్టుకొని తీసుకొస్తామని చెప్పే గొప్ప కథతో సినిమా రూపొందింది. ఈ సినిమాలో ఉద్వేగాన్ని కలిగించే ఎన్నో అంశాలు ఉన్నాయి. ట్విస్టుల మీద ట్విస్టులతో ఎపిసోడ్స్ రక్తి కట్టించేలా సన్నివేశాలను తెరకెక్కించారు. సినిమా ముగిసిన తర్వాత జై హింద్ అంటూ సెల్యూట్ చేయాలని అనిపించింది. ఈ సినిమాను చేసిన నాగ్‌ను చూస్తే గర్వంగా ఉంది అని చిరంజీవి పేర్కొన్నారు.

    English summary
    Tollywood's star hero Nagarjuna's latest movie Wild Dog is doing good at Box office. Critics, Common audience show good response on this movie. In this occassion, Megastar Chiranjeevi showers appreciation on Wild Dog and Nagarjuna
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X