»   » 200 కోట్లు రాబట్టడానికి సైరా టీం మెగా ప్లాన్.. అక్కడకు వెళుతున్నారు!

200 కోట్లు రాబట్టడానికి సైరా టీం మెగా ప్లాన్.. అక్కడకు వెళుతున్నారు!

Subscribe to Filmibeat Telugu
Chiranjeevi Sye Raa targets Baahubali, Dangal బాహుబలి, దంగల్ కి పోటీగా 'సైరా'

మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్ర షూటింగ్ బిజీగా జరుగుతోంది. మెగాస్టార్ 151 వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవిత గాధగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, జగపతి బాబు వంటి స్టార్స్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. అందాల తార నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. చిత్రీకరణ విషయంలో సైరా యూనిట్ భారీ ప్లానింగ్ తో ఉన్నట్లు తెలుస్తోంది. తదుపరి షెడ్యూల్ షూటింగ్ కోసం సైరా యూనిట్ మొత్తం చైనా వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజుల పాటు చైనాలో చిత్రీకరిస్తారట. సైరా సినిమా కోసం మెగా కాంపౌండ్ చేస్తున్న ఖర్చు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

మెగాస్టార్ తొలిసారి

మెగాస్టార్ తొలిసారి

ఖైదీ నెం 150 చిత్రంతో ఘనంగా రీఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. ఇకపై విభింమైన కథలని ఎంపిక చేసుకోవాలని భావించిన చిరు సైరా చిత్రాన్ని ఎంచుకున్నారు. చిరంజీవి స్వాతంత్ర సమరయోధుడుగా నటిస్తుండడం ఇదే తొలిసారి. దీనితో మొత్తం ఇండస్ట్రీలో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొని ఉంది.

రాంచరణ్ రాజీపడకుండా

రాంచరణ్ రాజీపడకుండా

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏ మాత్రం రాజీ పడకుండా భారీ స్థాయిలో సైరా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

భారీ తారాగణం

భారీ తారాగణం

సైరాకు భారీగా కాస్టింగ్ ని ఎంపిక చేసుకున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ఈ చిత్రంతో ఓ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ నటుడు విజయ్ సేతుపతి, జగపతి బాబు వంటి నటులు కూడా నటిస్తున్నారు. ఇక హీరోయిన్ గా నయనతార నటిస్తోంది.

 అంత్యంత ప్రతిష్టాత్మకంగా

అంత్యంత ప్రతిష్టాత్మకంగా

ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. స్టైలిష్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతోంది.

షూటింగ్ లో బిజీగా ఇద్దరు మెగాస్టార్స్

షూటింగ్ లో బిజీగా ఇద్దరు మెగాస్టార్స్

ప్రస్తుతం సైరా చిత్ర షూటింగ్ బిజీగా జరుగుతోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు.

త్వరలో చైనాకు

త్వరలో చైనాకు

సైరా తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ చైనాకు పయనం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. చైనాలో ఎంటర్టైన్మెంట్ టాక్సులు తక్కువగా ఉంటాయి కావున కీలక సన్నివేశాలని అక్కడ షూట్ చేయాలని భావిస్తున్నారు.

200 కోట్లు టార్గెట్

200 కోట్లు టార్గెట్

సైరా చిత్రం కనీసం 200 కోట్లు వసూళ్లు సాధించేలా చిత్ర యూనిట్ టార్గెట్ పెట్టుకునట్లు తెలుస్తోంది. కచ్చితంగా సినిమాకి పెట్టిన ప్రతి రూపాయి తిరిగి వచ్చేలా ప్రొడక్షన్ టీం బిజినెస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సైరా చిత్ర హక్కుల కోసం ఇప్పటి నుంచే భారీ డిమాండ్ నెలకొని ఉంది.

 అక్కడ కూడా రిలీజ్

అక్కడ కూడా రిలీజ్

ప్రస్తుతం చైనాలో ఇండియన్ సినిమాలు బాగానే రాణిస్తున్నాయి. బాహుబలి. దంగల్ వంటి చిత్రాలు చైనాలో విడుదలయ్యాయి. అదే తరహాలో సైరా చిత్రాన్ని కూడా చైనాలో విడుదల చేయాలని చిరంజీవి ప్లాన్ చేస్తున్నారు.

English summary
Megastar Chiranjeevi Sye Raa to release in China. Shooting will also happened ther.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu