Don't Miss!
- News
తెలంగాణా బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ ప్రసంగంపై అందరిలోనూ ఉత్కంఠ!!
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సైరా ట్రైలర్ రివ్యూ: గెట్ అవుట్.. భారతమాత గడ్డపై నుంచి చెబుతున్నా.. ఫిరంగుల్లా పేలిన డైలాగ్స్
Recommended Video
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ 'సైరా నరసింహారెడ్డి'. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 2న దసరా సందర్భంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో సైరా ఆడియో వేడుకను వాయిదా వేయడం మెగా అభిమానులను షాక్ గురి చేసింది. ఈ క్రమంలో అభిమానుల్లో ఉత్తేజాన్ని నింపడానికి కొణిదెల ప్రొడక్షన్ సైరా ట్రైలర్‌ను విడుదల చేసింది. హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్‌లో జరిగిన ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్మాత, హీరో రాంచరణ్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి హాజరయ్యారు. రాం చరణ్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన సైరా ట్రైలర్ ఎలా ఉందంటే..

తమన్నా, నయనతార టాలెంట్
సైరా ట్రైలర్‌లో ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు కేక పెట్టించేలా ఉన్నాయి. తమన్నా గ్లామర్, నయనతార ఫెర్ఫార్మెన్స్ ట్రైలర్‌లో హైలెట్‌గా నిలిచాయి. విలన్‌గా సుదీప్ హావభావాలు, విజయ్ సేతుపతి ఫెర్ఫార్మెన్స్ అదిరిపోయేలా కనిపించాయి.

సైరా కారణ జన్ముడు
నర్సింహారెడ్డి సామాన్యుడు కాదు. కారణ జన్ముడు. అతనోక యోగి. అతనోక యోధుడు. అతడిని ఎవరూ ఆపలేరు. ఈ భూమ్మీద పుట్టింది మేము.. ఈ మట్టిలో కలిసేది మేము.. మీకు ఎందుకు కట్టాలిరా శిస్తు అంటూ సైరా ట్రైలర్‌లో చిరంజీవి చెప్పిన డైలాగ్స్ ఉద్దేగానికి గురిచేసేలా ఉన్నాయి.

ఈ యుద్ధంలో నీవు గెలువాలి
స్వాత్రంత్రం కోసం తొలి యుద్దంలో ఇదే. ఈ యుద్ధంలో నీవు గెలువాలి. నీ గెలుపును కళ్లారా చూడాలని వచ్చాను. సైరా నర్సింహారెడ్డి అంటూ అమితాబ్ చెప్పిన మాటలు ఎమోషనల్‌గా ఉన్నాయి. వీరత్వానికి పేరు బడిన తమిళ భూమి నుంచి వచ్చాను. రాముడికి లక్ష్మణుడిగా మాదిరిగా తోడుంటాను అని విజయ్ సేతుపతితో చెప్పించిన మాటలు సినిమాపై అంచనాలు పెంచాయి.

సైరా మా గుండెల్లోనే
గ్రామ ప్రజలను బ్రిటీష్ పాలకులు వేధిస్తూ సైరా ఎక్కడున్నాడో చెప్పండి అంటే.. మా గుండెల్లో ఉన్నాడు అని చెప్పగానే నిర్ధాక్షిణ్యంగా కాల్చడం ప్రేక్షకుల గుండెను పిండేసింది. అలాగే స్వేచ్ఛ కోసం ప్రజలు చేస్తున్న తిరుగుబాటు. నా భరత మాత గడ్డ మీద నిలబడి హెచ్చరిస్తున్నా అంటూ చిరంజీవి సైరాగా చెప్పిన డైలాగ్స్ అభిమానుల్లోనే కాకుండా, ప్రేక్షకుల చేత కేక పెట్టించాయి.

నా దేశం వదిలిపో..
బ్రిటీష్ పాలకుల్లారా నా దేశం వదిలి వెళ్లిపో. లేదా యుద్ధమే. భారత మాతకు జై అంటూ ఉద్వేగం చెప్పిన డైలాగ్స్ సినిమా రేంజ్‌ను చెబుతున్నాయి. సైరాను ఉరి తీసే ముందు బ్రిటీష్ పాలకులు.. చివరి కోరిక ఏమైనా ఉంటే అడుగు అంటే.. గెటవుట్ ఫ్రమ్ మదర్ ల్యాండ్ అంటూ చిరంజీవి రౌద్రం ప్రదర్శించిన తీరు హై రేంజ్‌లో ఉంది.

వరల్డ్‌వైడ్‌గా రూ.190 కోట్లు
ఇక సైరా నర్సింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రి రిలీజ్ వరల్డ్ వైడ్‌గా రూ.190 కోట్లకుపైగా జరిగినట్టు తెలిసింది. ఓ తెలుగు సినిమా విషయానికి వస్తే.. ఇదే అత్యుత్తమ రికార్డ్ అని చెప్పుకొంటున్నారు.

సైరాలో నటించేది వీరే..
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరా సందర్భంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు నయనతార, జగపతి బాబు, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, తమన్నా, సుదీప్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అమిత్ త్రివేది పాటలకు సంగీతం అందించగా, జూలియస్ ప్యాకియం బ్యాగ్రౌండ్ స్కోర్ సమకూర్చారు.