»   » మెగాస్టార్ చిరంజీవి గురించి సూటిగా సుత్తి లేకుండా...

మెగాస్టార్ చిరంజీవి గురించి సూటిగా సుత్తి లేకుండా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమపై ఏకచత్రాధిపత్యం కొనసాగించిన హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. నేటితో ఆయన 59 సంవత్సరాలు పూర్తి చేసుకుని 60వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. ఆగష్టు 22, 1955 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు లో కొణిదెల వెంకట్రావు,అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించాడు. చిరంజీవి వివాహం ప్రసిద్ధ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో 1980లో జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.

చెన్నై లోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తర్వాత 1978 లో పునాది రాళ్లు సినిమా చిరంజీవి నటించిన మొదటి సినిమా. కాని ప్రాణం ఖరీదు ముందుగా విడుదల అయ్యింది. మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి ముట్టిన పారితోషకం 1,116 రూపాయలు.

Megastar Chiranjeevi turns 60

'పునాదిరాళ్ళు"తో చలనచిత్ర రంగప్రవేశం చేసిన మెగాస్టార్... 'ఖైదీ"తో అందరి మనసు దోచాడు. "పసివాడి ప్రాణం"గా పిల్లల ను అలరించాడు. "స్వయంకృషి" తో 'రుద్రవీణ" కు జాతీయ అవార్డు సాధించాడు."మరణమృదంగం" తో మెగాస్టార్ అయ్యాడు. ఈ 'జగదేకవీరుడు" అతిలోకసుందరి తో రాసలీల లాడి,"గ్యాంగ్ లీడరై ' 'రౌడీఅల్లుడు" & 'ఘరానామొగుడు" గా అందరికీ 'ఆపద్భాంధవుడై"నాడు. 'ఇంద్ర"సేనుడి గా విజయఢంకా మ్రోగిస్తూ 'ఠాగూర్" గా చరిత్ర సృష్టించాడు."శంకర్ దాదా MBBS"అంటూ ఆప్యాయత పంచి 'అందరివాడు" గా నిలిచాడు ఈ 'జై చిరంజీవ.

సినిమాలోకంలోనుండి రాజ‌కీయాల్లోకి వెళ్ళి అక్కడ కూడా త‌న‌దైన పంథాలో ముందుకు ప‌య‌నిస్తూ కేంద్రమంత్రి స్థాయికి ఎదిగారు. త్వరలో ఆయన 150వ సినిమా ద్వార మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. మెగాస్టార్‌, ప‌ద్మభూష‌ణ్‌, డాక్టర్ చిరంజీవి ఇలాంటి పుట్టినరోజు కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని కోరుకోవాలని, ఇకపై ఆయన వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులకు, ప్రేక్షకులకు వినోదం పంచాలని కోరుకుంటూ...తెలుగు ఫిల్మబీట్, వన్ ఇండియా తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు.

English summary
Telugu actor-politician Chiranjeevi turns 60 today. 'Chiru', as he is affectionately called by his fans Mega star turned politician Chiranjeevi celebrates on August 22!
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu