»   » 150 న్యూ పోస్టర్... చిరు ఇలా ఉంటారని ఎవరూ ఊహించి ఉండరు!

150 న్యూ పోస్టర్... చిరు ఇలా ఉంటారని ఎవరూ ఊహించి ఉండరు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి వయసు 60 దాటిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వయసులో ఆయన హీరోగా చేస్తే ఎలా ఉంటారో? డాన్సులు, ఫైట్లు గట్రా చేయలేరేమో? అనే సందేహం చాలా మందిలో ఉంది.

కానీ అందరి ఊహలను తారు మారు చేస్తూ... 150వ మూవీ 'ఖైదీ నెం 150'లో చిరంజీవి యంగ్ లుక్ తో అభిమానులను మెస్మరైజ్ చేయబోతున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఫుల్ ఎనర్జిటిక్ గా డాన్సులు, ఫైట్స్ తో ఫ్యాన్స్‌ను ఎంటర్టెన్ చేయబోతున్నారు.


మరిన్ని చూసేందుకు ఫోటోపై క్లిక్ చేయండి


Megastar Chiru's Khaidi No. 150 movie new poster

ఇప్పటికే విడుదలైన 'ఖైదీ నెం 150' పోస్టర్లలో చిరంజీవి ఎంత హాండ్సమ్ గా కనిపించారో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో కొత్త పోస్టర్ రిలీజ్ అయింది. హీరోయిన్ కాజల్ తో కలిసి మెగాస్టార్ రొమాంటిక్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు. చిరంజీవి సినిమాలో ఇంత బాగా కనిపించబోతున్నారని బహుషా ఎవరూ ఊహించి ఉండరు.


వివి వినాయక్ దర్శకత్వంలో వస్తున్న ఈచిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆడియో ఈ నెల 25న నేరుగా మార్కెట్లోకి విడుదల కానుంది. ఆడియో వేడుక లేకున్నా.... జనవరి 4న ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా నిర్వహించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 11, 2017న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
Khaidi No. 150 movie new poster released. Khaidi No. 150 is a Upcoming Telugu Movie. Directed by V. V. Vinayak. Chiranjeevi, Kajal Aggarwal in the lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu