Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అశ్వథ్థామ వివాదం.. అసలు విషయాలు బయటపెట్టిన మోహ్రీన్.. వైరల్ పోస్ట్
అశ్వథ్థామ ప్రమోషన్స్‌లో మెహరీన్ పాల్గొనలేకపోవడం, నాగశౌర్య తండ్రి శంకర్ ప్రసాద్‌కు ఆమెకు వాగ్వాదం జరిగిందని, హోటల్ బిల్లులు కట్టనని బెదిరించాడని ఇలా ఏవేవో వార్తలు వైరల్ కాసాగాయి. చెప్పా పెట్టకుండా మెహరీన్ హోటల్ నుంచి వెళ్లిపోయిందని, ఆ బిల్లులన్నీ నిర్మాతే కట్టాడని వార్తలు వచ్చాయి. ఇలా తనపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. అసలు విషయాలన్నీ బయటపెట్టింది. ఆ విశేషాలేంటో ఓసారి చూద్దాం.

అవి చాలా బాధపెట్టాయి..
‘అశ్వథ్థామ ప్రమోషన్స్‌లో భాగంగా నా హోటల్ బిల్లులు వారే కట్టారని, ఈ మధ్య వచ్చిన వార్తలు నన్ను చాలా బాధించాయి. ఈ వివాదంలో నా వరకు నేను మౌనంగా ఉన్నా.. కానీ నాకు చెడ్డ పేరు వస్తోందని.. నా సైడ్ నుంచి జరిగిన విషయాలను చెబుతున్నాను.

ఎంతమంచివాడవురా తరువాత..
సంక్రాంతి సినిమా (ఎంతమంచివాడవురా) ప్రమోషన్స్ పూర్తయ్యాక నేను మా ఇంటికి వెళ్లాను. మళ్లీ అశ్వథ్థామ ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకు హైద్రాబాద్ వచ్చాను. అయితే మా తాతకు హార్ట్ ఎటాక్ రావడం, స్టంట్స్ వేశారు. ఈ విషయాన్ని నేను కొన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పాను.
|
అన్నింట్లో పాల్గొన్నాను..
అశ్వథ్థామకు సంబంధించిన అన్ని ప్రమోషన్స్‌లో పాల్గొన్నాను.. ఆపై మరో ఇంటర్వ్యూకు వచ్చేందుకు నాకు సమయం లేదు. అప్పటికే నాకు స్కిన్ ఎలర్జీ వచ్చి.. మొహం అంతా పగిలిపోయింది. ఇదే విషయాన్ని నిర్మాతలకు చెప్పాను.. డాక్టర్ రాసిన మందుల చీటీ, నాకు వచ్చిన ఎలర్జీ ఫోటోలు పంపాను.


అయినా సరే వినలేదు..
అలా జరగడంతో నేను ఆ ఇంటర్వ్యూను మిస్ అయ్యాను. దీంతో నిర్మాతలు చిరాకు పడ్డారు. నా హోటల్ బిల్స్, నా వ్యక్తిగత సిబ్బంది సాలరీని ఇవ్వలేదు. నా మేనేజర్ వాళ్లను అడిగినా కూడా ఇవ్వలేదు. నా ఖాతాల్లోంచి అవన్నీ కట్టమని చెప్పాన'ని అంటూ తనపై వచ్చిన వార్తలకు చాలా బాధపడ్డానని తెగ ఫీలైపోయింది.