twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒక్కో పాస్‌ రూ.లక్ష: స్టార్స్ చెప్పిన డిటేల్స్ (ఫొటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్: అక్టోబర్‌లో వచ్చిన ‘హుద్‌ హుద్‌ తుఫాను' ఉత్తరాంధ్రని కకావికలం చేసింది. విశాఖపట్నం కళావిహీనంగా మారిపోయింది. ముందస్తుగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా 64 మంది ప్రాణాలను కోల్పోయారు. రూ.70 వేల కోట్ల ఆస్తి నష్టం జరిగిందని అంచనా.

    ఈ తుఫాను కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు సినీ పరిశ్రమ అంతా కలిసి ఈ నెల 30న మారథాన్‌లాంటి ‘టెలిథాన్‌'ను నిర్వహించనుంది. ఈ కార్యక్రమం ఇంతకు మునుపు ఎవరూ కనీవినీ ఎరుగని రీతిలో సాగుతుంది. కార్యక్రమంలో భాగంగా క్రికెట్‌, స్కిట్‌లు, కబడ్డీ, చిట్‌చాట్‌, అంత్యాక్షరిలాంటివి ఉంటాయి.

    ‘‘ప్రకృతి వైపరీత్యాలు వాటిల్లిన ప్రతిసారీ ఆపన్నులను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. ఈసారి హుద్‌హుద్‌ తుఫాను బాధితుల కోసం సినీ కళాకారులు పలువురు తమ వంతు సాయం చేశారు. తమిళ హీరోలు చేసిన సాయం కూడా ఎన్నదగినది. ఇప్పుడు పరిశ్రమ మొత్తం ఒకే తాటిపై నిలిచి ‘మేముసైతం' కార్యక్రమాన్ని నిర్వహించి బాధితులను ఆదుకోనుంది'' అని ప్రముఖ సినీ నటుడు, ఎంపీ చిరంజీవి తెలిపారు.

    తెలుగు సినీ పరిశ్రమ ఈ నెల 30న హైదరాబాద్‌లో ‘మేము సైతం' అనే కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను బుధవారం రాత్రి సినీ ప్రముఖులు మీడియా సమావేశంలో వివరించారు.

    చిరంజీవి మాట్లాడుతూ...

    చిరంజీవి మాట్లాడుతూ...

    ''ఎక్కడ ఎలాంటి విపత్తులు చోటు చేసుకొన్నా ఆదుకోవడంలో చిత్ర పరిశ్రమ ముందుంటుంది. హుద్‌ హుద్‌ రూపంలో ఈసారి భారీ విపత్తు జరిగింది. చిత్ర పరిశ్రమ కేవలం విరాళాలతోనే సరిపెట్టకుండా... 'మేము సైతం' మీతో ఉన్నామంటూ భరోసా ఇచ్చేందుకు నడుం బిగించింది. 12 గంటలపాటు జరిగే వినోద కార్యక్రమాల్లో ప్రేక్షకుల్నీ భాగస్వాముల్ని చేసే ప్రయత్నం చేస్తున్నాం'' అన్నారు ప్రముఖ నటుడు, ఎంపీ చిరంజీవి.

    చిరంజీవి కంటిన్యూ చేస్తూ...

    చిరంజీవి కంటిన్యూ చేస్తూ...

    ''అందమైన పచ్చటి విశాఖ కళావిహీనంగా తయారైంది. ఎంత ముందు జాగ్రత్తలు తీసుకొన్నా 64 మంది చనిపోయారు. రూ.70 వేల కోట్లు నష్టం జరిగింది. ఉత్తరాంధ్రని అనుకొనేందుకు ఈ నెల 30న ఉదయం 10గంటల నుంచి రాత్రి 10 వరకు వినోద కార్యక్రమాల్ని నిర్వహించబోతున్నాం. తద్వారా వచ్చే నిధుల్ని బాధితుల సహాయార్థ ప్రకటిస్తాం. గతంలో ఎప్పుడూ చేయని కార్యక్రమం ఇది. '' అన్నారు.

    చిరంజీవి చెప్తూ...

    చిరంజీవి చెప్తూ...

    ఎవ్వరూ 500కి తక్కువ కాకుండా విరాళాలు ఇవ్వండి. ప్రతీ పైసా మంచి కార్యక్రమం కోసం వినియోగిస్తాం. కార్యక్రమంలో రకరకాల ఆటలు ఉంటాయి. మెగా డ్రా ద్వారా 104 మందిని ఎంపిక చేస్తాం. వారికి రూ.50 లక్షల విలువైన బహుమానాలు ఇస్తాం అని చెప్పుకొచ్చారు.

    నాగార్జున మాట్లాడుతూ....

    నాగార్జున మాట్లాడుతూ....

    ''డైన్‌ విత్‌ స్టార్స్‌ అనే కార్యక్రమం ఉంది. లక్ష రూపాయలు విరాళం ఇచ్చినవారికి ఒక కూపన్‌ ఇస్తారు. ఒక కూపన్‌కి ఇద్దరు ప్రవేశించొచ్చు. 29న రాత్రి 7:30 నుంచి 10:30 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. అందులో స్టార్స్‌తో మాట్లాడొచ్చు. వినోద కార్యక్రమాల్ని ఆస్వాదించొచ్చు. ఈ కార్యక్రమంలో 250మందికి అవకాశం ఉంటుంది'' అన్నారు.

    ఏ ఇద్దరు కలిసి వచ్చినా...

    ఏ ఇద్దరు కలిసి వచ్చినా...

    ‘‘ఈ కార్యక్రమానికి కాంప్లిమెంటరీ పాస్‌లు ఉండవు. రూ.లక్ష రూపాయలు విలువ చేసే ఈ పాస్‌లను 250 మంది జంటలకు మాత్రమే అందిస్తాం. జంట అంటే. ఏ ఇద్దరు కలిసొచ్చినా అనుమతిస్తాం'' అని హీరో అక్కినేని నాగార్జున చెప్పారు.

    వెంకటేష్‌ మాట్లాడుతూ....

    వెంకటేష్‌ మాట్లాడుతూ....

    ''క్రికెట్‌ విత్‌ స్టార్స్‌ నిర్వహించబోతున్నాం. నేను, నాగార్జున, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అనుష్క, ఛార్మి, అఖిల్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ మేమంతా కలిసి క్రికెట్‌ ఆడుతున్నాం. ఇందులో మొత్తం ఆరు జట్లుంటాయి. ఒక్కో జట్టులో ఎనిమిదేసి మంది ఉంటారు. అందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. రూ.3 వేలకు డోనార్‌ పాస్‌లను తీసుకోవచ్చు'' అని హీరో వెంకటేష్‌ తెలిపారు.''అన్నారు.

    మురళీమోహన్‌ మాట్లాడుతూ....

    మురళీమోహన్‌ మాట్లాడుతూ....

    ''ఎవరి ఇంట్లో వాళ్లు కూర్చుని 12 గంటలపాటు వినోదాన్ని ఆస్వాదించేలా కార్యక్రమాల్ని డిజైన్‌ చేశాము''అన్నారు.

    నిర్మాత డి.సురేష్‌బాబు మాట్లాడుతూ...

    నిర్మాత డి.సురేష్‌బాబు మాట్లాడుతూ...

    ‘‘రూ.500 డొనేషన్‌ ఇచ్చినవారు లక్కీ డిప్‌ మెగా డ్రాలో పాల్గొనవచ్చు. ఎంపికైన 104 మందికి బహుమతులు ఉంటాయి. ‘మేముసైతం డాట్‌ కామ్‌' వెబ్‌సైట్‌ ద్వారా రూ.500కి తగ్గకుండా కూడా విరాళాలు చెల్లించవచ్చు. ‘తంబోలా విత్‌ స్టార్స్‌' ప్రోగ్రామ్‌కి పాస్‌లు అందిస్తాం. అన్ని థియేటర్లలోనూ, ఫిలిం చాంబర్‌, ఎఫ్‌ఎన్‌సీసీలోనూ ఈ పాస్‌లు లభ్యమవుతాయి'' అని ఆయన వివరించారు.

    టిక్కెట్లు కొన్నారు...

    టిక్కెట్లు కొన్నారు...

    వేడుకలో అల్లు అరవింద్‌, నాగప్రసాద్‌, అశోక్‌కుమార్‌, శ్రీనివాసరాజు తదితరులు లక్ష రూపాయల టిక్కెట్లు కొన్నారు.

    ఎవరెవరు...

    ఎవరెవరు...


    ఈ సమావేశంలో సినీ ప్రముఖులు అల్లు అరవింద్‌, కె.రాఘవేంద్రరావు, పరుచూరి బ్రదర్స్‌, శ్రీకాంత్‌, కె.ఎల్‌.నారాయణ, ఎం.ఎల్‌.కుమార్‌చౌదరి, దామోదరప్రసాద్‌, కొడాలి వెంకటేశ్వరరావు, శ్రీనివాస్‌, శివాజీరాజా, నందినిరెడ్డి, జీవిత తదితరులు పాల్గొన్నారు.

     శెలవు..నో షూటింగ్స్ ..

    శెలవు..నో షూటింగ్స్ ..

    30వ తేదీన పరిశ్రమకు సెలవు. ఆరోజు షూటింగులు ఉండవు. తెలుగు చలన చిత్రసీమ మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది.

    తమిళం నుంచీ..

    తమిళం నుంచీ..

    రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, సూర్య, కార్తి, విజయ్‌, విక్రమ్‌ వీళ్లందరినీ ఆహ్వానించాం. అంత్యాక్షరి, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ''అన్నారు.

    బెంజ్ కారు గిఫ్ట్

    బెంజ్ కారు గిఫ్ట్

    మేముసైతం నిర్వహిస్తున్న టెలీథాన్ ప్రోగ్రాంలో లైవ్ తంబోలా ప్రోగ్రాంని నిర్వహించనున్నారు. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చెయ్యడానికి ముందుగా మీరు 15,000 రూపాయలు పెట్టి తంబోలా టికెట్ ని కొనుక్కోవాలి. అలా కొనుక్కొని ఈ తంబోలా గేమ్ లో పార్టిసిపేట్ చేసి గెలుపొందిన వారికి బెంజ్ కార్ ని బహుమతిగా ఇవ్వనున్నారు.

    English summary
    ‘Memu Saitham’: All the Stars from the Tollywood Fraternity were going to participate in different programmes in Memu Saitam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X