ఎవరా ధైర్యం చేసేది అంటే...ఇంకెవరు పోసాని 'మెంటల్ కృష్ణ'. ఆయన తీస్తున్న పొలిటికల్ సెటైర్ కామిడీలో 'ఆనంద్' ఫేమ్ సత్యకృష్ణ హీరోయిన్ గా చేస్తోంది. సెట్లో ఆమె నటన చూసి మురిసిపోయిన దర్శక,రచయిత పోసాని ఆమె ప్రధాన పాత్రలో ఓ సినిమా తీయనున్నట్లు ప్రకటించేసాడు. ఆ సినిమా పేరు 'గవర్నమెంట్' ట. మీడియా ముందు ఈ విషయం చెప్పి ఆమెని ఆశ్చర్యపరిచాడు.అంతేగాక సినిమా నవంబర్ లో ప్రారంభిస్తానని,ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తానని హామీ కూడా ఇస్తున్నాడు. అలాగే 'మెంటల్ కృష్ణ' దాదాపు ఫినిషింగ్ స్టేజీకొచ్చిందని,త్వరలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నానని చెప్పాడు. ఇక ఈ సినిమా ప్రత్యేకత సినిమా పూర్తిగా స్టడీకామ్ తో తీయటంమేనట. ఇండియాలో ఈ తరహా చిత్ర ప్రయోగం మొదటిట. ఇక ఈ లేటెస్ట్ న్యూస్ కి,తనని హీరోయిన్ గా తీసుకున్నందకు సత్య కృష్ణ థాంక్స్ చెప్పుకుంది.అలాగే ఈ రెండు చిత్రాలను నిర్మించేది మోహన్ వడ్లపట్ల కావటం విశేషం.