»   » విశాల్ తెలుగు వాడు... వాళ్ళకి ఇక్కడేం పని :"తెలుగు హీరోయిన్" రాధిక

విశాల్ తెలుగు వాడు... వాళ్ళకి ఇక్కడేం పని :"తెలుగు హీరోయిన్" రాధిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ రజినీకాంత్ ని టార్గెట్ చేసాడు మరో తమిళ హీరో శరత్ కుమార్. రజనీకాంత్ రాజకీయ పార్టీ పెట్టాల్సిన అవసరం లేదని ఎందుకంటె తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి తమిళుఢు మాత్రమే కావాలని నేరుగా రజనీ పై విమర్శలు చేసాడు . ఒకవేళ రజనీకాంత్ రాజకీయ పార్టీ పెడితే అతడ్ని ఎదురించే మొదటి వ్యక్తి ని నేనేనని అంటున్నాడు శరత్ కుమార్.

అయితే శరత్ కుమార్ వ్యాఖ్యలు పెద్ద దుమారం చెలరేగడంతో రజనీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున శరత్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా శరత్ దిష్టి బొమ్మ లను సైతం తగులబెట్టారు . రజనీ ఫ్యాన్స్ నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావడంతో తనకు రజినీ తో ఎలాంటి విభేదాలూ లేవన్నారు. తాను చేసిన వ్యాఖ్యలను కొంద‌రు వ‌క్రీక‌రించార‌ని, అస‌లు తాను రజినీకాంత్ కు రాజకీయ పార్టీ పెట్టే అర్హత లేదని అన‌లేద‌ని వివరణ ఇచ్చారు. రజినీకాంత్ గురించి తనంతట తాను మాట్లాడలేదని స్పష్టం చేశారు. రజినీకాంత్ తనకు స్నేహితుడేన‌ని చెప్పిన‌ ఆయన.. ఒక‌వేళ ర‌జినీ పార్టీ పెడితే మాత్రం ఆయ‌న‌ను ప్రత్యర్థిగా భావిస్తానని చెప్పారు. తమిళనాడు రాష్ట్రాన్ని పాలించే వారు జన్మతః తమిళులే అవ్వాలన్నది త‌న ఉద్దేశ‌మ‌ని శరత్ కుమార్ వివరణ ఇచ్చారు.

అయితే అప్పటికీ నిరసనలు ఆగక పోవటం తో భర్తకి సపోర్ట్ గా భార్యామణి రాధిక కూడా రంగం లోకి దిగింది... వివాదాన్ని మరింత రెచ్చగొట్టేలా ఆమె వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో స్థానికేతరులే రాజ్యమేలుతున్నారని, వారిని నిలువరించాలని రాధిక సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎంజీఆర్, జయలలిత, రజనీకాంత్, వైగో, విజయ్ కాంత్ తదితరులంతా స్థానికేతరులేనని విమర్షించిన రాధిక. వీళ్లను ఆదరించాల్సిన అవసరం తమిళులకేంటని ప్రశ్నించారు.

MGR, Jaya, Rajini,Vishal are Non-Locals: Says Radhika

ఇదే మీడియా సమావేశంలో విశాల్ గురించి కూడా రాధిక ప్రస్తావించారు. విశాల్ రెడ్డి కులస్తుడని, ఆంధ్రా నుంచి వచ్చాడని చెప్పుకొస్తూ.. విశాల్ ఎవరు?, విశాల్ రెడ్డి. కార్తీ, శివరామ్ వీళ్లంతా ఎవరు? తమిళులా? వీరందరిని వెనుక నుంచి మరెవరో నడిపిస్తున్నారు.. అంటూ రాధిక వివాదస్పద రీతిలో స్పందించారు. ఆఖరికి దివంగత సీఎం జయలలితపై కూడా రాధిక విమర్శలు గుప్పించారు. జయలలిత కూడా పుట్టుకతో తమిళురాలు కాదన్నారు. కర్ణాటక నుంచి వచ్చిన రజనీకాంత్, ఇక్కడ రాజ్యమేలుతున్నారని విమర్శించారు. రజనీపై శరత్ కుమార్ వ్యాఖ్యలతో రాధిక మీడియాతో మాట్లాడుతూ ఈ వివాదస్పద కామెంట్స్ చేసింది.

నిజానికి రాధికకి తెలుగునాట మంచి ఫాలోయింగ్ ఉంది ఒకప్పుడు ఇక్కడ అగ్ర హీరోయిన్లలో ఒకరిగా చెలామణి అయింది. ఆమెను మన ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుని చూసుకున్నారు. ఆమె తీసిన సీరియళ్లను కూడా ఆదరించారు. ఇప్పటికీ ఏ రోజూ తమిళ హీరోయిన్ అని చిన్నచూపు చూడలేదు. కానీ రాధిక మాత్రం తమిళనాట ఇప్పుడు వేర్పాటు వాదంతో విషం చిమ్మే మాటలు మాట్లాడుతోంది. తమిళనాట స్థానికేతరుల ప్రాబల్యం పెరిగిపోతోందని.. వాళ్లనెందుకు మనం నెత్తిన పెట్టుకోవాలని ముఖ్యంగా తెలుగువాడైన విశాల్ ని ఇక్కడ ఉంచుకోవాల్సిన అవసరం ఏముందంటూ రాధిక అనటం దారుణం అంటూ విమర్షలు వస్తున్నాయి..

English summary
Radhika Sarathkumar created a sensation by appealing Tamilians not to encourage 'non-locals'. Stating that MGR, Jayalalithaa, Rajinikanth, Vaigo and Vijayakanth are non-locals, The Fire-brand Actress dared to say Tamilians don't have the necessity to back them
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu