»   » తమన్నా ఒప్పుకొంటే టాప్ హీరోలు పడ్డం ఎంతసేపు..!

తమన్నా ఒప్పుకొంటే టాప్ హీరోలు పడ్డం ఎంతసేపు..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌ లో ఈరోజున హండ్రెడ్‌ పర్సెంట్‌ క్రేజ్‌ కలిగిన హీరోయిన్లలో 'తమన్నా' ఒకరు. తమన్నా కాల్షీట్స్‌ తీసుకోగలిగితే, టాప్‌ హీరోల కాల్షీట్స్‌ సంపాదించుకోవడం చాలా సులువైపోతుందనేంతగా తమన్నా హవా నడుస్తోంది. 'హ్యాపీడేస్‌'తో క్లాస్‌ ఆడియన్స్‌ ను తన కొంగుకు కట్టేసుకున్న తమన్నా... ఆ తర్వాత 'వీడొక్కడే', 'ఆవారా' వంటి తమిళ అనువాద చిత్రాలతో మాస్‌ ఆడియన్స్‌ నూ తన సొగసుల బుట్టలో వేసేసుకుంది.

ఇక '100% లవ్‌', 'బద్రినాథ్‌', చిత్రాలలో తమన్నా అందాలు సృష్టిస్తున్న అలజడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోలతో డామినేట్‌ చేయబడే తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోల డామినేషన్‌తో పోటీ పడేంత క్రేజ్‌ సంతరించుకున్న హీరోయిన్లు తెలుగు సినిమా పుట్టిన దగ్గర్నుంచి నేటివరకూ కేవలం వేళ్ళతో లెక్కించగలిగే వాళ్ళు మాత్రమే ఉన్నారు. నేటితరం హీరోయిన్లలో ఆ ఘనతను సొంతం చేసుకున్న హీరోయిన్‌గా తమన్నాను చెప్పుకోవచ్చు. తమన్నా కోసం, తమన్నా అందాల కోసం థియేటర్ల ముందు బారులు తీరే ప్రేక్షకాభిమానులు నేడు లక్షల్లో ఉన్నారు..

ప్రస్తుతం జూ ఎన్టీఆర్ సరసన ఊసరవెల్లి, రామ్ చరణ్ తో రచ్చ చేస్తోన్నమిల్క్ బ్యూటి తమన్నా అందాలను చూడాటానిక ప్రేక్షకులు ఎప్పుడెప్పుడ మళ్లీ సినిమా విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు..

English summary
Sexy actress Tamanna is bouncing back into Tollywood with her ravishing looks and on-screen performance. Known as 'Milky Beauty' for her glowing white skin, this young girl is turning seductress day-by-day.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu