twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండియాలో ఇదే ఫస్ట్, రజనీకే సాధ్యం:‘కబాలి’ మైండ్ బ్లోయింగ్ రికార్డ్స్...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందంటేనే క్రేజ్ ఏ రేంజిలో ఉంటుందో అందరికీ తెలుసు. సౌత్ లో ఇంత క్రేజ్ ఉన్న సినిమా హీరో రజనీ తప్ప మరొకరు లేరంటే అతిశయోక్తి కాదేమో. 'కబాలి' సినిమా విషయంలో ఈ మ్యాడ్‌నెస్ మరింత రెట్టింపు అయింది. దీంతో కబాలి విడుదల ముందే పలు రికార్డులను క్రియేట్ చేసింది.

    కబాలి రికార్డుల్లో కొన్ని అసలు ఎవరూ ఇప్పటి వరకు ఊహించి కూడా ఉండరు. ఇలా కూడా జరుగుతుందా? అని అభిమానులను ప్రశ్నిస్తే...రజనీ సినిమా కాబట్టి ఏమైనా జరుగుతుంది అంటూ గర్వంగా సమాధానం ఇస్తున్నారు.

    విదేశాల్లో ఉంటున్న కొందరు రజనీ అభిమానులు కేవలం కబాలి సినిమా చూసేందుకే దుబాయ్, జపాన్, మలేషియా, లండన్ తదితర ప్రాంతాల నుండి చెన్నై చేరుకుంటున్నారు. సొంత దేశంలో సొంత రాష్ట్రంలో తమ అభిమాన హీరో సినిమా చూడాలనే ఆత్రుతే ఇందుకు కారణం. వీరంతా చెన్నైలో ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు భారీగా ఖర్చు చేసి టిక్కెట్లు కొనుగోలు చేయడం గమనార్హం.

    కొన్ని ఫైవ్ స్టార్ హోటల్స్‌లో 'కబాలి' స్పెషల్ షోలు సైతం వేస్తున్నారు..... సూపర్ స్టార్ సినిమాను... సూపర్ లగ్జరీగా చూడాలనుకునే వారికోసం భారీ ఖర్చుతో కూడిన ప్యాకేజీలతో ఈ షోలు ఏర్పాటు చేసారు. ఇండియాలో ఒక సినిమా ఫైవ్ స్టార్ హోటల్స్‌లో ప్రత్యేక స్క్రీన్లలో రిలీజ్ చేయడం ఇదే తొలిసారి. బెంగుళూరు సిటీలో టాప్ ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఈ షోలు వేస్తున్నారు.

    'కబాలి సినిమా జెడబ్ల్యు మారియట్(విట్టల్ మాల్యా రోడ్), లలిత్ అశోక్, రాయల్ ఆర్చిడ్(యెలహంక) మరియు క్రౌన్ ప్లాజా(ఎలక్ట్రానిక్ సిటీ) తదితర స్టార్ హోటల్స్ లో సౌండ్ ఎఫెక్ట్స్, కేనన్ స్క్రీన్లు ఏర్పాటు చేసి శుక్రవారం నుండి మూడు రోజుల పాటు ఈ షోలు ప్రదర్శిస్తారు. ఒక్కో హోటల్ లో రోజూ 300 మంది చూసేలా సీటింగ్ కెపాసిటీ ఉంది' అని లహరి మ్యూజిక్ సంస్థ ప్రతినిధి జి.ఆనంద్ తెలిపారు.

    రజనీ అభిమానుల డిమాండును అనుసరించి లలిత్ అశోక్ లాంటి హోటల్స్ సీటింగ్ కెపాసిటీ 300 నుండి 500లకు పెంచేలా ప్లాన్ చేస్తున్నారు. 'శుక్రవారం, శనివారం 300 సీటింగ్ కెపాసిటీతో 1 స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నాం. ఆదివారం రోజు సినిమాచూసే వారి సంఖ్య పెరుగుతుంది. అందుకే ఆ రోజు 500 సీట్ల వరకు పెంచేందుకు ప్లాన్ చేస్తున్నాం' అని లలిత్ అశోక్ హోటల్ ప్రతినిధి మంజునాథ్ కొత్వాల్ తెలిపారు.

    ఫైవ్ స్టార్ హోటల్ లో షో కాబట్టి టికెట్ రేటు రూ. 1300 నుండి రూ. 1400 మధ్య ఉంది. ఈ టికెట్ కొన్న వారికి కూల్ డ్రింక్, ఫుడ్ కూపన్లు కూడా అందజేయనున్నారు.

    స్లైడ్ షోలో మరిన్ని వివరాలు..

    తొలి మూవీ

    తొలి మూవీ

    మలేషియాలో రజనీకాంత్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో ఈ సినిమాను మలయ్ భాషలో కూడా రిలీజ్ చేస్తున్నారు. మలయ్ బాషలో రిలీజ్ అవుతున్న తొలి ఇండియన్ మూవీ ఇదే.

    హవాయ్

    హవాయ్

    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని హవాయ్ ప్రాంతంలో రిలీజ్ అవుతున్న తొలి సౌత్ ఇండియన్ మూవీ కబాలి మాత్రమే.

    ఫ్లైయింగ్ లైక్ ఎ బాస్

    ఫ్లైయింగ్ లైక్ ఎ బాస్

    ఎయిర్ లైన్స్ కంపెనీతో కలిసి ప్రమోషన్లు నిర్వహించిన తొలి ఇండియన్ సినిమా కబాలి.

    టీజర్ రికార్డ్

    టీజర్ రికార్డ్

    కబాలి టీజర్ కు 26 మిలియన్ల హిట్స్ వచ్చాయి. ఇండియాలో అత్యధిక మంది చూసిన టీజర్ ఇదే.

    సరికొత్త ట్రెండ్స్

    సరికొత్త ట్రెండ్స్

    పెద్ద పెద్ద హీరోలు నటించే చాలా సినిమాలు హాలిడే, పండగ రోజుల్లో విడుదలవుతాయి. కానీ సాధారణ రోజులను సైతం తన సినిమాతో హాలిడేగా మార్చిన ఘనత కేవలం రజనీకాంత్ కబాలి సినిమాకే దక్కింది. పలు సాఫ్ట్ వేర్ సంస్థలు కబాలి రిలీజ్ సందర్భంగా ఉద్యోలులకు సెలవు ప్రకటించడం దేశంలో ఇదే తొలిసారి.

    స్టేడ్ హాలిడే

    స్టేడ్ హాలిడే

    కబాలి రిలీజ్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని కొందరు ముఖ్యమంత్రికి వినతులు సైతం పంపారట.

    English summary
    Rajinikanth is back and yet again he brings with him, a whole new level of madness. The 'Kabali craze', as the phenomenon is being referred to, has loomed large over the country, breaking and creating many records in the process.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X