»   » "నోరు అదుపులో పెట్టుకోండి".... నాని నే టార్గెట్ గా "డెక్కన్ క్రానికల్" కథనం

"నోరు అదుపులో పెట్టుకోండి".... నాని నే టార్గెట్ గా "డెక్కన్ క్రానికల్" కథనం

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ నటులకూ హీరోలకూ ఆదవాళ్లంటే చిన్న చూపు. ఎందుకో గానీ ఈమధ్య ఇదే ఉద్దెశ్యం పెరిగిపోతోంది. నటీమణుల మీదా, యాంకర్ల మీదా వెకిలి మాతలు తరచుగా సినిమాల్లోనే కాకుండా లైవ్ గా కూడా వినిపిస్తూ ఉండటం తో. ఇప్పుడు ఇదే అపప్రద స్థిర పడిపోతిఓంది. మొన్నటికి మొన్న హాట్ హీరోయిన్ రాధికా ఆప్టే దఖిణాదిలో హీరోల డామినేషన్ ఎక్కూ అనీ, ఒక తెలుగు హీరో తనని బెడ్రూం కి పిలిచాడు అనీ సంచలన నిజాలు బయట పెట్టటం తో పాటు, ఈ మధ్య కొన్ని ఆడియో ఫంక్షన్లలోనూ ఈ తరహా వ్యాఖ్యలు ఎక్కువగానే వినిపించాయి.

ఈ నేపథ్యం లోనే ఈరోజు డెక్కన్ క్రానికల్ ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే ఇక్కడ షాకింగ్ సంగతేమితంటే ఆ కథనం లో ముందు టార్గెట్ ఎవరో కాదు. భలే భలే మగాడు నాని. అవు నానినే ఎప్పుడూ అసలు ఇలంటి వివాదాల జోలికి పోకుండా జాగ్రత్తగా మాట్లాడే నాని కూడా కొన్ని అసభ్య కర వ్యాఖ్యలు చేసాడంటూ కాస్త ఘాటుగానే "మైండ్ యువర్ లాంగ్వ్వేజ్" అంటూ ఏకి పడేసారు.

అయితే ఆ పత్రిక కావాలని చేసిందేమీ కాదు అలా కామెంట్ చేయడానికి వెనుక ఒక కారణం ఉంది. ఈమధ్య జరిగిన 'హైపర్' ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ లో నాని ఆరోజు ఆ ఫంక్షన్ కు అతిగా గ్లామర్ ఎక్స్ పోజ్ చేస్తూ వచ్చిన హీరోయిన్ రాశిఖన్నా పై కొన్ని వింత కామెంట్స్ చేసాడు... మామూలుగా అయితే కాస్త వల్గర్ అనే చెప్పాలి.

"Mind your language" article on Hero Nani


'రాశి చాలా అందంగా ఉన్నవ్ అయితే ఇంతకు మించి పదాలు నీగురించి చెప్పాలి అని అనిపిస్తున్నా అవి నీట్ గా ఉండవు కాబట్టి ఇక్కడ చెప్పలేక పోతున్నా అంటూ ఆమె శరీరం పైనా,ఈ ఫంక్షన్ కు వచ్చిన వారు అంతా నీ అందానికి నిన్నే చూసేస్తున్నారు అంటూ ఆమె ఆరోజు ధరించిన బట్టల మీదా' జోక్ చేసాడు నాని. ఈ కామెంట్స్ కు ఆ ఫంక్షన్ కు వచ్చినవాళ్లలో కొందరు నవ్వుకున్నా ఇంకొందరికి మాత్రం ఇంత చక్కగా ఉండే నాని కూడా ఇలా మాట్లాడటం ఏమితీ అనుకున్నారట. చాటుగా కాదు అందరికీ విమ్నిపించే లాగానే.

సరిగ్గా ఈ పాయింట్ నే ధారంగా తీసుకుని టాలీవుడ్ సెలెబ్రెటీలు ద్వందార్ధాలతో బహిరంగంగా మాట్లాడుతున్న మాటలు ఎక్కువైపోయాయి అంటూ నాని కామెంట్స్ ను టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేసింది. అంతేకాదు గతంలో బాలకృష్ణ - ఆలీ - రాజ్ తరుణ్ లాంటి సెలెబ్రెటీలు వివిధ ఫంక్షన్లలో చేసిన ఇలాంటి ద్వందార్ధాల కామెంట్స్ వల్ల మహిళలకు ఎంత అసౌకర్యంగా మారుతోందో వివరిస్తూ కొంత మంది మహిళల అభిప్రాయాలను కూడ ఈ కథనానికి జత చేసి ప్రచురించింది.

ఎప్పుడూ వివాదాల జోలికి పోని నాని సరదాగా అయినా తోటి మహిళా యాక్తర్ల పట్ల ఇలాంటి మాటలనటం అథనికి లేడీస్ లో ఉండే ఇమేజ్ ని దెబ్బ తీసే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని గ్రహించుకోమని ఈ కథనం నాని ని ఎలర్ట్ చేసినట్టే అనుకోవాలి. సమాజం లో నలుగురిని ప్రభావితం చేయగలిగే సెలెబ్రెటీలు బహిరంగ సమావేశాలలో మాట్లాడుతున్నప్పుడు తమ నోటిని అదుపులో ఉంచుకాకపోతే ఇలాంటి కష్టాలే వస్తాయి.

English summary
News daily deccan chronicle publishd an article about "Instances of Tollywood celebrities making sexist statements in public set a wrong example"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu