twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bheemla Nayakపై రాజకీయం.. జీవో అందుకే లేట్.. సినిమా వాయిదా వేసుకోలేరా? ఆగలేరా..?

    |

    అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ రిలీజ్ రాజకీయ రంగు పులుముకుంది. మిగతా ఏ సినిమాలకు లేని విధంగా పవన్ సినిమా అనే సరికి రెవెన్యూ సిబ్బంది అంతా రంగంలోకి టెన్షన్ క్రియేట్ చేయడం తో ఏపీ ప్రభుత్వం తరపున సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ సినిమాను తొక్కేయడం ఏమిటి అంటూ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ప్రెస్ మీట్ లో పేర్ని నాని మాట్లాడిన వివరాల్లోకి వెళితే

    ఇబ్బంది ఏమిటి..?

    ఇబ్బంది ఏమిటి..?

    పవన్ సినిమా కోసం చంద్రబాబు లోకేష్ లు పిల్లిమొగ్గలు వేస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. సినిమాని కూడా తండ్రీ కొడుకులు రాజకీయాలకు వాడుకుంటున్నారన్న ఆయన పవన్ సినిమాని తొక్కడం ఏంటో మాకు అర్థం కావడం లేదని అన్నారు. అసలు చట్టం అమలు అవుతుంటే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏమిటి..? అని ప్రశ్నించారు. జీవో 35 పై ప్రతి సినిమాకి జాయింట్ కలెక్టర్ దగ్గరకు వెళ్ళి రేట్లు ఫిక్స్ చేసుకుని ప్రదర్శించుకోవాలని హైకోర్టు ఆదేశించిందని అన్నారు.

    లీగల్ ఒపీనియన్ కి

    లీగల్ ఒపీనియన్ కి


    నీతి వ్యాఖ్యలు చెప్పే పవన్ కి అది తెలీదా.. అలాంటి పక్రియ ఎందుకు చేసుకోలేదు? అని ప్రశ్నించారు. అసలు ఎక్కడైనా జాయింట్ కలెక్టర్ కి లెటర్ పెట్టారా..? అని ఆయన ప్రశ్నించారు.
    హైకోర్టు తీర్పు అన్నా.. ప్రభుత్వం అన్నా వీళ్ళకి లెక్క లేదని ఆయన అన్నారు. ఏపీలో టీడీపీ, బీజేపీ జనసేన పార్టీలు బ్లాక్ టికెట్స్ ని ప్రోత్సాహిస్తున్నాయని అన్నారు. ఇక కొత్త జీవో విడుదల చేయడానికి పక్రియ జరుగుతుంది.. లీగల్ ఒపీనియన్ కి వెళ్ళిందని మంత్రి అన్నారు.

    బ్లాక్ టికెట్ల పై ఆశ ఎందుకు..?

    బ్లాక్ టికెట్ల పై ఆశ ఎందుకు..?

    అన్ని సక్రమంగా జరిగి ఉంటే 24 తేదీన జీవో రావాల్సి ఉంది కానీ ఇంతలో మా మంత్రి గౌతమ్ రెడ్డి చనిపోవడంతో మేమంతా ఆవేదనలో ఉన్నామని అన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వాయిదా వేసుకున్నారు, సినిమాని ఇంకా రెండు రోజులు వాయిదా వేసుకోలేరా? జీవో వచ్చే వరకూ ఆగలేరా..? అని ప్రశ్నించారు. అంతేకాక ఏపీలో సినిమాని ఫ్రీ గా చూపిస్తాను అన్న పవన్‌కు బ్లాక్ టికెట్ల పై ఆశ ఎందుకు..? అని మంత్రి ప్రశ్నించారు.

     జూ.ఎన్టీఆర్ సినిమా పై ఎందుకు లేదు?

    జూ.ఎన్టీఆర్ సినిమా పై ఎందుకు లేదు?

    చంద్రబాబు, లోకేష్ లకు పవన్ సినిమా పై ఉన్న ప్రేమ జూ.ఎన్టీఆర్ సినిమా పై ఎందుకు లేదు? అని ప్రశ్నించిన ఆయన జూ.ఎన్టీఆర్ సినిమా చూడాలని ఉందని ఎందుకు అనలేదు..?
    మీ ఎంపీ బావమరిది మహేష్, జూ ఎన్టీఆర్ ప్రభాస్ సినిమాలు చూడండి అని ఎప్పుడైనా ట్విట్ చేసారా? అని ప్రశ్నించారు. ఇక ఇండస్ట్రీ అంటే పవన్ ఒక్కడేనా.. మిగతా సినిమాలు లేవా..? అని అన్నారు.. జనాలు పవన్ సినిమా ఒక్కటే కాదు.. బాగుంటే అందరి సినిమాలు చూస్తారని అన్నారు.

    సిగ్గుపడుతున్నాం

    సిగ్గుపడుతున్నాం


    నాగార్జున ఇద్దరు కొడుకులు తీసినసినిమాలు రిలీజ్ అయ్యాయి., ముగ్గురు కుర్రాళ్ళు కలిసి జాతి రత్నాలు చేశారు, చిరంజీవి గారి మేనల్లుడు ముఖం కూడా తెలియదు ఆయన హీరోగా వచ్చిన ఉప్పెన అవి బాగున్నాయి కనుక ప్రేక్షకులు ఆదరించారు బాగుంది కనుకే అత్తారింటికి దారేది చూశారు.. బాలేదు కనుకే అజ్ఞాతవాసి చూడలేదని ఆయన అన్నారు. సినిమాని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారన్న ఆయన ఇలాంటి రాజకీయాలను చూసి సిగ్గుపడుతున్నాం అని పేర్ని నాని పేర్కొన్నారు.


    English summary
    Minister Perni Nani clarity on bheemla nayak ticket rates issue
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X