For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రభాస్ 'మిర్చి' ఆడియో రిలీజ్ (ఫోటోలతో)

  By Srikanya
  |

  హైదరాబాద్ : ప్రభాస్‌ హీరోగా యు.వి.ప్రొడక్షన్స్‌ సంస్థ 'మిర్చి' టైటిల్ తో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంతో రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వి.వంశీకృష్ణ, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మాతలు. ఈ చిత్రం ఆడియోను సిని ప్రముఖల సమక్షంలో నిర్మాతలు విడుదల చేసారు. అభిమానుల నుంచి వీటికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం రెండు పాటలు, మూడు ఫైట్లు మినహా చిత్రీకరణ పూర్తయింది.

  రెబల్‌స్టార్ కృష్ణంరాజుకి దేవిశ్రీప్రసాద్ డాన్స్ స్టెప్పులు నేర్పించారు. దాదాపు 200 చిత్రాల్లో నటించిన రెబల్‌స్టార్ ఓ విద్యార్థిలా ఆ స్టెప్పులు నేర్చుకుని, డాన్స్ చేయడం విశేషం. రెబల్‌స్టార్ చేసిన ఆ డాన్స్ చూసి, యంగ్ రెబల్‌స్టార్ మురిసిపోవడం ఓ హైలైట్. ఇక, అభిమానుల సంగతి చెప్పక్కర్లేదు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ సందడికి వేదికగా నిలిచింది 'మిర్చి' చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం. కృష్ణంరాజు మాత్రమే కాదు.. రాజమౌళి, 'దిల్' రాజు కూడా ఈ వేదికపై డాన్స్ చేయడం విశేషం. వీరితో పాటు చిత్రనాయకా నాయికలు ప్రభాస్, అనుష్క కూడా హుషారుగా కాలు కదిపారు.

  దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. తొలి సీడీని కృష్ణంరాజు ఆవిష్కరించారు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి అందుకొన్నారు. కృష్ణంరాజు, ఆయన సతీమణి శ్యామలాదేవి ట్రైలర్‌ని ఆవిష్కరించారు.

  రాజమౌళి మాట్లాడుతూ ''ఎవరినైనా ప్రభాస్‌ డార్లింగ్‌ అనే పిలుస్తాడు. ఆ పిలుపు మనస్ఫూర్తిగా ఉంటుంది. 'మిర్చి' పాటలు బాగున్నాయి. ఈ వేడుక చూస్తుంటే సగం భీమవరం తరలి వచ్చినట్టు ఉంది''అన్నారు.

  వినాయక్‌ ప్రసంగిస్తూ ''మంచి మనిషి ప్రభాస్‌. స్నేహానికి విలువ ఇస్తాడు. స్నేహితుల కోసమే ఈ సినిమా చేశాడు. మిర్చి కంటే కారంగా ఉండే సినిమా. కొరటాల శివ కథ బాగా చెబుతాడు. 'బిల్లా'లో ప్రభాస్‌, అనుష్కల జంట చూడముచ్చటగా కుదిరింది. ఈ సినిమా అంతకు రెట్టింపు వినోదాన్ని పంచాలి'' అన్నారు.

  ''అభిమానుల ప్రేమే మాలో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ వేడుక చూస్తుంటే సంక్రాంతి పండుగ ముందే వచ్చేసినట్టుంది. గుంటూరు మిరపకాయ్‌లాంటి సినిమా ఇది. చాలా వైవిధ్యంగా ఉంటుంది. పాటలు బాగున్నాయి'' అని కృష్ణంరాజు చెప్పారు.

  ప్రభాస్‌ మాట్లాడుతూ ''టీజర్‌ అభిమానులకు తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమా నిర్మాతలు నాకు మంచి స్నేహితులు. వాళ్ల కోసం ఈ సినిమా చేశా. శివ సంభాషణల రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకొన్నాడు. అతను పని చేసిన సినిమాలు మంచి విజయం సాధించాయి. ఈ సినిమాతో దర్శకుడిగానూ నిరూపించుకొంటాడు''అన్నారు.

  దేవిశ్రీ మాట్లాడుతూ ''ప్రభాస్‌తో నా నాలుగో సినిమా. పాటలు అందరికీ నచ్చుతాయి'' అన్నారు.

  ‘‘ప్రభాస్‌తో నాకిది రెండో సినిమా. తనతో సినిమా చేస్తుంటే సొంత మనిషితో చేస్తున్నట్లుగా ఉంటుంది'' అని అనుష్క చెప్పారు.

  ఈ చిత్రం ఆడియో వేడుకలో ఎం.శ్యాంప్రసాద్‌రెడ్డి, వీవీ వినాయక్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.

  మిర్చి సినిమా ఆడియో విడుదల వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. వేడుకకు పాస్‌లు జారీ చేసిన సంఖ్యకు మించి ప్రభాస్‌ అభిమానులు చేరుకున్నారు. అప్పటికే ఆడియో విడుదల ప్రాంగణం వేలాది మంది అభిమానులతో కిక్కిరిసింది. లోపల ఖాళీ లేదంటూ పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో అభిమానులు వాగ్వాదానికి దిగారు. కొందరు రాళ్లు రువ్వడంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు వెంబడించడంతో ఆందోళనకు దిగిన వారంతా చెల్లాచెదురుగా పారిపోయారు.

  ఈ ఆడియో ఫంక్షన్ అభిమానుల సమక్షంలో చాలా ఘనంగా జరిగింది. ఒకటి రెండు సంఘటనలు అపశృతి ధ్వనించినా అన్ని వర్గాల నుంచి విశేష స్పందన కనిపించింది. ప్రభాస్‌, రాజమౌళి, అనుష్కలతో దేవిశ్రీవేదికపై స్టెప్పులు వేయించారు. దిల్‌ రాజు, కృష్ణంరాజులు కూడా పాదం కలిపి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, రామజోగయ్య శాస్త్రి, సుప్రీత్‌, శిరీష్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు. ఆ ఫోటోలు మీ కోసం...9

  English summary
  The audio launch ceremony was held Saturday, Jan 05 at Nanak ramaguda in Hyderabad. Krishnam Raju, Dil Raju and others were also present .
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X