»   » ఓహ్..! అద్బుతం కన్నా ఎక్కువలానే ఉంది., "మీర్జ్యా" కొత్త ట్రైలర్

ఓహ్..! అద్బుతం కన్నా ఎక్కువలానే ఉంది., "మీర్జ్యా" కొత్త ట్రైలర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా ఇండస్ట్రీలో వారసులు హవా బాగా పెరిగిపోయింది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలో హీరోలు తమ వారసులను హీరోలుగా చేస్తున్నారు. ఇందులో కలిసి వచ్చిన వారు ఇండస్ట్రీలో సెటిల్ కాగా కొంతమంది మాత్రం నామ మాత్రంగానే మిగిలిపోతున్నారు.. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ వారసత్వంతో ఇప్పటికే ఆయన కూతురు సోనమ్ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా అనిల్ కపూర్ కుమారుడు హర్షవర్దన్ కపూర్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. 'మీర్జ్యా' అనే సినిమా ద్వారా హీరోగా తెరంగ్రేటం చేస్తున్నాడు హర్ష వర్ధన్. పంజాబీ వీరుడు మీర్జా సాహిబన్ ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.దసరా కానుకగా అక్టోబరు 7న 'మిర్జియా' విడుదల కాబోతున్న నేపథ్యంలో కొత్తగా ఇంకో ట్రైలర్ వదిలాడు రాకేష్ మెహ్రా. ఈ విలక్షణ దర్శకుడు వెండితెరపై మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడనే అనిపిస్తోంది ఈ ట్రైలర్ చూస్తుంటే. కథలో.. పాత్రల్లో ఉన్న ఇంటెన్సిటీ ఈ ట్రైలర్లో కనిపిస్తోంది. ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి..

ఈ సినిమాకు గుల్జార్ కథను అందించారు. ఈ చిత్రంలో తెలుగులో రేయ్ చిత్రంలో నటించిన సయామీ ఖేర్ హీరోయిన్ గా నటిస్తోంది. రొమాంటిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా సినిమాలకు బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. అందుకే ఈ సినిమాకుపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో ఓంపురి, ఆర్ట్ మాలిక్, కెకె రైనా, అనుజ్ చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భాగ్ మిల్ఖా భాగ్ చిత్రానికి సంగీతం అందించిన సంగీత త్రయం శంకర్, ఎస్సాన్, లాయ్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సంవత్సరం అక్టోబర్ 7న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాకేష్ ఓం ప్రకాస్ మెహ్రా సినిమాలు విభిన్నంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో 'మీర్జ్యా' చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

పాత్రల్లో ఉన్న ఇంటెన్సిటీ ఈ ట్రైలర్లో కనిపిస్తోంది. విజువల్స్ కలర్ ఫుల్ గా అద్భుతంగా అనిపిస్తున్నాయి. హర్షవర్ధన్.. సయామీల నటన కూడా గొప్పగా ఉండేలా కనిపిస్తోంది. పాథ కాలం నాటి ఓ గాఢమైన ప్రేమకథకు రాకేష్ వెండితెర రూపం ఇచ్చినట్లున్నాడు. కొన్ని దశాబ్దాల క్రితం పంజాబ్ లో జరిగిన ఓ చారిత్రక నిజ జీవిత కథకు ముడిపెట్టి ఈ సినిమాను తీశాడట రాకేష్.

ఇదివరలో వచ్చిన సూపర్ హిట్ 'రంగ్ దె బసంతి' తరహాలోనే చరిత్రను.. వర్తమానాన్ని ముడిపెడుతూ వెరైటీ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఆ ట్రైలర్ లో ఉన్న విధంగాన్నే సినిమా ంజొత్తం లో గనక చూపించి ఉంటే మరో క్లాసిక్ లాగా నిలిచిపోయేందుకు అవకాశముందనిపిస్తోంది. ఐతే ఇలాంటి సినిమాలు డిజాస్టర్లు కూడా అయ్యే చాన్సూ ఉందని మొన్నటికి మొన్న వచ్చిన "మొహంజో దారో" నిరూపించింది కదా...

English summary
Mirzya new trailer: Harshvardhan Kapoor-Saiyami Kher starrer appears to be a love triangle with reincarnation angle
Please Wait while comments are loading...