ప్రాణాలకు తెగించిన హీరో.. అద్భుతంగా యాక్షన్ సీన్లు.. నరాలు చిట్లిపోయే విధంగా (ఫొటోలు)

హాలీవుడ్ నటుడు టామ్ క్రూయిజ్ నటిస్తున్న తాజా చిత్రం ప్రాణాలను సైతం పక్కన పెట్టి టామ్ క్రూయిజ్ చేసిన సాహసోపేతమైన ఫైట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టామ్ క్రూయిజ్ చేసిన అద్భుతమైన విన్యాసాలు మీ కోసం

By Rajababu

హాలీవుడ్ నటుడు టామ్ క్రూయిజ్ నటిస్తున్న తాజా చిత్రం మిషన్ ఇంపాజిబుల్ ఫాలౌట్. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ప్రాణాలను సైతం పక్కన పెట్టి టామ్ క్రూయిజ్ చేసిన సాహసోపేతమైన ఫైట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టామ్ క్రూయిజ్ చేసిన అద్భుతమైన విన్యాసాలు మీ కోసం..

ఇన్స్‌టాగ్రామ్‌లోకి టామ్ క్రూయిజ్

ఇన్స్‌టాగ్రామ్‌లోకి టామ్ క్రూయిజ్

ఇన్స్‌టాగ్రామ్‌లోకి టామ్ క్రూయిజ్
ఎన్నో హాలీవుడ్ చిత్రాలతో ప్రేక్షకులను రంజింప చేసిన టామ్ క్రూయిజ్ తాజాగా సోషల్ మీడియా వెబ్‌సైట్ ఇన్స్‌టాగ్రామ్‌లోకి ప్రవేశించాడు. ఈ వెబ్‌సైట్లో తొలిసారి మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లో ఆరో సినిమా ఫాల్ అవుట్ ఫస్ట్‌లుక్‌ను, టైటిల్ కార్డును షేర్ చేశారు.

ఫాల్ అవుట్ క్లాప్‌బోర్డు

ఫాల్ అవుట్ క్లాప్‌బోర్డు

ఫాల్ అవుట్ సినిమాకు సంబంధించిన క్లాప్‌బోర్డును తొలి ఫోటోగా టామ్ క్రూయిజ్ షేర్ చేశాడు. నా తదుపరి సినిమా మిషన్ ఇంపాజిబుల్: ఫాల్ అవుట్ అని పేరుపెట్టాం. దానికి గెట్ రెడీ అనే క్యాప్షన్‌ను ఖరారు చేశాం అని టామ్ తెలిపారు.

టామ్ హెలికాప్టర్‌ను పట్టుకొని

టామ్ హెలికాప్టర్‌ను పట్టుకొని

ఫాల్ అవుట్ సినిమా షూటింగ్‌లో భాగంగా హెలికాప్టర్‌ను పట్టుకొని వేలాడుతున్న తన ఫొటోను టామ్ రెండో ఫొటోగా షేర్ చేశాడు. 55 ఏళ్ల వయసులో ప్రాణాలను పణంగా పెట్టి చేసిన స్టంట్లు అందర్ని షాక్ గురి చేస్తున్నాయి.

ఆరో సిరీస్‌ కూడా అద్భుతంగా

ఆరో సిరీస్‌ కూడా అద్భుతంగా

ఫాల్ అవుట్ దర్శకుడు క్రిస్టఫర్ మ్యాక్వెరీ మాట్లాడుతూ.. టామ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ ఐదు సిరీస్‌లను చూశాను. ఆరో సిరీస్‌ కూడా అద్భుతంగా ఉంటుంది అని పేర్కొన్నారు.

మరోసారి రెబాకా ఫర్గూసన్

మరోసారి రెబాకా ఫర్గూసన్

మిషన్ ఇంపాజిబుల్ ఆరో సిరీస్‌లో టామ్ క్రూయిజ్‌తో మరోసారి రెబాకా ఫర్గూసన్ జతకట్టింది. ఇంకా ఈ చిత్రంలో వింగ్ రామెస్, సైమన్ పెగ్, అలెక్ బల్డ్‌విన్, మైఖేల్ మొనాగన్ తదితరులు నటించారు.

జూలై 27న రిలీజ్‌

జూలై 27న రిలీజ్‌

హెన్నీ కావిల్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రం జూలై 27న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఇప్పటికే ఈ చిత్రంపై హాలీవుడ్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X