»   » మిస్టర్ ఆడియో ఫంక్షన్ లైవ్: వరుణ్ తేజ్ వల్లనే నా తండ్రి ప్రాణాలతో బయటపడ్డారు.

మిస్టర్ ఆడియో ఫంక్షన్ లైవ్: వరుణ్ తేజ్ వల్లనే నా తండ్రి ప్రాణాలతో బయటపడ్డారు.

Written By:
Subscribe to Filmibeat Telugu

శ్రీనువైట్ల దర్శకత్వంలో కొణిదెల వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్. లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ కథానాయికలు. ఈ చిత్ర ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం వద్దనున్న సంధ్య కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్నది.

Mister

ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరవుతున్నారు. మిక్కి జే మేయర్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్‌ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 

మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా

మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా

ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మిక్కి జే మేయర్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్‌ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో హీరో వరుణ్ తేజ్, దర్శకుడు శ్రీనువైట్ల, రఘుబాబు, ప‌ృథ్వీ, సత్యం రాజేశ్, నాగబాబు, దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాత దిల్ రాజు పాల్గొన్నారు.

తండ్రి చావుబతుకుల్లో ఉంటే వరుణ్ తేజ్

తండ్రి చావుబతుకుల్లో ఉంటే వరుణ్ తేజ్

ఈ కార్యక్రమంలో రచయిత శ్రీధర్ సీపాన మాట్లాడుతూ.. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒకే ఒక హీరో అది మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాను బట్టలు చించుకొని సినిమా చూశాను. ఈ రోజు నా కుటుంబం సుఖంగా బతుకుతున్నదంటే కారణం శ్రీనువైట్ల అని అన్నారు. తన తండ్రి చావుబతుకుల్లో ఉంటే వరుణ్ తేజ్ తెలుసుకొని ఆర్థిక సహాయం చేసి ఆదుకొన్నారు. వరుణ్ తేజ్ వల్లనే నా తండ్రి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు అని తెలిపారు.

శ్రీనువైట్ల మాట నిలబెట్టుకొన్నారు..

శ్రీనువైట్ల మాట నిలబెట్టుకొన్నారు..

అందరికీ నమస్కారం. ప్రతీ సినిమాను వెరైటీగా చేయాలని ట్రై చేశాను. కొన్ని సినిమాలు ఆడాయి. కొన్ని ఫెయిల్ అయ్యాయి. అన్ని సందర్భాల్లో ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. అందరివాడు ఆడియో సందర్బంగా వరుణ్‌తో సినిమా చేస్తాను అని మాట ఇచ్చారు. దాని ప్రకారమే సినిమాను ఇచ్చి మాట నిలబెట్టుకొన్నారు. ముకుందకు మిక్కి మంచి ఆల్బమ్ ఇచ్చారు. ఈ సినిమాకు కూడా చక్కటి మ్యూజిక్ ఇచ్చారు. లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్ చక్కగా నటించారు. ఈ చిత్రానికి పనిచేసిన పత్రీ టెక్నిషియన్స్‌కు థ్యాంక్స్.

మిస్టర్ చిత్రం విజయవంతం కావాలని

మిస్టర్ చిత్రం విజయవంతం కావాలని

దిల్ రాజు, శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. శ్రీను వైట్ల దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తున్న మిస్టర్ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు మిక్కి జే మేయర్‌కు బెస్టాఫ్ లక్ చెప్పారు.

దర్శకుడు శ్రీనువైట్లకు

దర్శకుడు శ్రీనువైట్లకు

మిస్టర్ చిత్రానికి మ్యూజిక్ అందించే అవకాశం కల్పించిన దర్శకుడు శ్రీనువైట్లకు సంగీత దర్శకుడు మిక్కి జే మేయర్ థ్యాంక్స్ చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన చిరంజీవికి రుణపడి ఉంటాను అని మిక్కి వెల్లడించారు.

ఐ లవ్ యూ ప్రొడ్యూసర్ బుజ్జి సార్

ఐ లవ్ యూ ప్రొడ్యూసర్ బుజ్జి సార్

కుమారి 21ఎఫ్ చిత్రం తర్వాత మిస్టర్ చిత్రంలో అవకాశం రావడం సంతోషంగా ఉంది. అందుకు దర్శకుడు శ్రీను వైట్లకు థ్యాంక్స్. ఈ చిత్ర యూనిట్ చక్కగా సహకరించింది. నిర్మాతలు బుజ్జికి కృతజ్ఙతలు. ఐ లవ్ యూ ప్రొడ్యూసర్ బుజ్జి సార్ అని హెబ్బా పటేల్ అన్నారు.

వరుణ్ జెన్యూన్ యాక్టర్

వరుణ్ జెన్యూన్ యాక్టర్

మెగా ఫ్యాన్స్ కంగ్రాట్స్. చిరంజీవి పేరు గుర్తొస్తే ఖైదీ అనే పదం గుర్తుస్తుంది. 34 ఏళ్ల క్రితం ఖైదీతో సంచలనం రేపిన చిరంజీవి అందరి హృదయాల్లో జీవిత ఖైదీగా మారిపోయాడు. మాటల రచయిత గోపి మోహన్ లైన్ చెప్పినప్పడే మంచి సినిమా అవుతుందని అనుకొన్నాను. ఈ చిత్రాన్ని డెస్పరేట్‌తో చేశాను. వరుణ్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకొంటన్నాను. వరుణ్ జెన్యూన్ యాక్టర్. ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమా ఆశీర్వదించి పెద్ద హిట్ చేయాలని ప్రేక్షకులను వేడుకొంటున్నాను.

చిరంజీవి గారు మెగాస్టార్‌గా

చిరంజీవి గారు మెగాస్టార్‌గా

చిరంజీవి గారు మెగాస్టార్‌గా ఎదుగడం వెనుక ఎంతో కృషి ఉంది. ఆయన పట్టుదల, అంకుఠిత దీక్ష ఆయనను ఈ స్థాయికి చేర్చింది. ప్రతి ఒక్కరు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి అని బెనర్జీ అన్నారు.

చిరంజీవి, నాగబాబుకు ధన్యవాదాలు

చిరంజీవి, నాగబాబుకు ధన్యవాదాలు

అందరికీ నమస్కారం. ముందుగా చిరంజీవి, నాగబాబుకు ధన్యవాదాలు. 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 బ్లాక్ బస్టర్ అయినందుకు మెగాస్టార్ చిరంజీవికి కంగ్రాట్స్. వరుణ్ తేజ్ మంచి కో-స్టార్. హెబ్బా‌తో నటించడం సంతోషంగా ఉంది అని లావణ్య త్రిపాఠి అన్నారు.

టీజర్‌కు మంచి రెస్పాన్స్

టీజర్‌కు మంచి రెస్పాన్స్

వరుణ్ తేజ్ నటించిన ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్‌లో చిత్రానికి సంబంధించిన సన్నివేశాలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. ఈ చిత్రం ఏప్రిల్ 13న విడుదలకు ముస్తాబవుతున్నది.

English summary
Hero Varun Tej's Latest movie is Mister. This Movie's Audio function conduction at Hyderabad. Megastar Chiranjeevi is the chief Guest for Varun Tej movie. Director of this movie Srinu Vaitla. Music Director is Mikki J Mayor.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu