For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Golden Globe ఎన్టీఆర్, చరణ్‌కు కీరవాణి షాక్.. బిగ్ బాస్ విన్నర్‌పైనా.. ఆమెకు స్పెషల్ థ్యాంక్స్ అంటూ!

  |

  తెలుగు సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకుడు రాజమౌళి రూపకల్పనలో వచ్చిన భారీ మల్టీస్టారర్ మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). టాలీవుడ్‌లోనే రూపొందిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ హవాను చూపించి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే, ఎన్నో రికార్డులను సైతం క్రియేట్ చేసి సత్తా చాటుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ చిత్రానికి గానూ ఎంతో ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. ఇది అందుకున్న సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే...

  క్రేజీ కాంబోలో భారీగా RRR

  క్రేజీ కాంబోలో భారీగా RRR

  టాలీవుడ్ స్టార్లు ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో రాజమౌళి తెరకెక్కించిన మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. పిరియాడిక్ జోనర్‌లో వచ్చిన దీనిలో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రల్లో సందడి చేసేశారు.

  బట్టలు విప్పేసి షాకిచ్చిన హీరోయిన్: హాట్ షోలో ఎవరూ చేయని విధంగా!

  గోల్డెన్ గ్లోబ్‌ లిస్టులో మూవీ

  గోల్డెన్ గ్లోబ్‌ లిస్టులో మూవీ

  సినీ రంగానికి సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకమైనవిగా చెప్పుకునే గోల్డెన్ గ్లోబ్ 80వ అవార్డుల కార్యక్రమం కాలిఫోర్నియాలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో RRR (రౌద్రం రణం రుధిరం) బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ నాన్ ఇంగ్లీష్ మూవీ విభాగాల్లో నామినేట్ అయింది. ఈ వేడుక కోసం రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి తమ ఫ్యామిలీలతో అక్కడకు చేరుకున్నారు.

  RRRలోని పాటకు అవార్డు

  RRRలోని పాటకు అవార్డు

  అంగరంగ వైభవంగా 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో RRR (రౌద్రం రణం రుధిరం) మూవీలో ఎమ్ఎమ్ కీరవాణి కంపోజ్ చేసిన నాటు నాటు సాంగ్‌ బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా ఎంపికైంది. ఈ విషయాన్ని ప్రకటించగానే ఆ సభా ప్రాగణమంతా చప్పట్లతో మారుమ్రోగింది. ఇక, ఏషియా ఖండం నుంచి ఈ విభాగంలో అవార్డు అందుకున్న తొలి చిత్రంగా RRR రికార్డును సాధించింది.

  Varisu Twitter Review: విజయ్ మూవీకి షాకింగ్ టాక్.. అసలైందే మిస్ చేసి.. తమిళంలోనే ఇలా ఉంటే!

  కీరవాణి చేతిలో అవార్డు

  కీరవాణి చేతిలో అవార్డు

  ఎంతో గ్రాండ్‌గా జరిగిన 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా RRR (రౌద్రం రణం రుధిరం) మూవీలోని నాటు నాటు సాంగ్‌ ఎంపిక అవగానే రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి తమ ఆనందాన్ని పంచుకుంటూ కేకలు వేశారు. ఎంతో మంది అతిరథమహారథుల మధ్య ఈ అవార్డును మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ ఎమ్ కీరవాణి అందుకుని ఎమోషనల్ అయ్యారు.

  కీరవాణి స్పీచ్.. భార్యకు

  కీరవాణి స్పీచ్.. భార్యకు

  80వ గోల్డెన్ గ్లోబ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ విభాగంలో అవార్డును అందుకున్న తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత 'ఈ అవార్డు నాకు అందించిన HFPAకి (హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్) ధన్యవాదాలు. నా భార్య ముందు ఈ అవార్డును అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా తనకు థ్యాంక్స్' అని చెప్పుకొచ్చారు.

  బ్రాలో టెంపరేచర్ పెంచేసిన దివి: అందాల ఆరబోతకు హద్దే లేదుగా!

  వాళ్లకు ప్రియారిటీ ఇచ్చి

  అనంతరం కీరవాణి కంటిన్యూ చేస్తూ.. 'ప్రాధాన్యతా క్రమం ఆధారంగా ఈ సినిమా డైరెక్టర్, నా బ్రదర్ రాజమౌళికి థ్యాంక్స్. ఈ పాటను డిజైన్ చేసిన ప్రేమ్ రక్షిత్, అతడికి అన్ని రకాలుగా సహకరించిన కాల భైరవకు థ్యాంక్స్. వాళ్ల తర్వాత సాహిత్యం అందించిన చంద్రబోస్ గారికి, ఈ పాట పడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు' అని తెలిపారు.

  ఎన్టీఆర్, తారక్‌కు షాక్

  ఎన్టీఆర్, తారక్‌కు షాక్

  తర్వాత కీరవాణి 'ఇక, ఈ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసిన ఎన్టీ రామారావు, రామ్ చరణ్‌కు కూడా థ్యాంక్స్. అలాగే ఈ సాంగ్‌కు ప్రోగ్రామింగ్ చేసిన సాలు సిద్దార్థ్, జీవన్ బాబుకు కూడా ధన్యవాదాలు. ఇక, చివర్లో నా భార్య శ్రీవల్లికి థ్యాంక్యూ' అని చెప్పుకొచ్చారు. ఈ ప్రియారిటీ ఆర్డర్‌లో ఎన్టీఆర్, చరణ్ పేర్లను నాలుగో స్థానంలో పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.

  English summary
  Jr NTR and Ram Charan Starrer RRR Movie Naatu Naatu Songs Wons Golden Globe Awards 2023. Then M. M. Keeravani Special Thanks To RRR Team.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X