»   » హంగామా ఫొటోలు : 'డైనమైట్‌' ప్రీమియర్ షో వద్ద మోహన్ బాబు, అలి

హంగామా ఫొటోలు : 'డైనమైట్‌' ప్రీమియర్ షో వద్ద మోహన్ బాబు, అలి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మంచు విష్ణు హీరో గా నటించిన చిత్రం 'డైనమైట్‌'. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి దేవా కట్టా దర్శకుడు. ప్రణీత హీరోయిన్. అచ్చు సంగీతం అందించిన ఈ చిత్రం ఈ రోజున ట్రైలర్ విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్రం ప్రీమియర్ షోని నిన్న రాత్రి అంటే గురువారం రాత్రి మోహన్ బాబు తిరుపతిలో అభిమానులతో కలిసి వీక్షించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


తిరుపతిలోని కృష్ణ తేజ థియోటర్ వద్ద మోహన్ బాబు, అలి రావటంతో ఉత్సవ వాతావరణం ఏర్పడింది. అభిమానులను విష్ చేస్తూ మోహన్ బాబు థియోటర్ లోకి వెళ్లి వారితో కలిసి సినిమా చూసారు.


తమ అభిమాన నటుడు మోహన్ బాబు తో కలిసి సినిమా చూడటం చాలా ఆనందంగా ఉందని చాలా మంది ప్రేక్షకులు మీడియాకు తెలియచేసారు. అలాగే సినిమా కూడా చాలా బాగుందని పెద్ద హిట్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేసారు.


థియోటర్ వద్ద ఫొటోలు స్లైడ్ షోలో


సమర్పణ

సమర్పణ

మోహన్‌బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ పతాకంపై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.తమిళ రీమేక్

తమిళ రీమేక్

ప్రణీత కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు తమిళ చిత్రం అరిమనంబి ఆధారం.మంచు విష్ణు మాట్లాడుతూ...

మంచు విష్ణు మాట్లాడుతూ...

డైనమేట్ లాంటి ఓ యువకుడి కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. కథకు తగ్గ టైటిల్ కుదిరింది. కథ డిమాండ్ మేరకు కొత్త లుక్ కోసం పాత్ర పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది.


యాక్షన్ సీన్స్ హైలెట్

యాక్షన్ సీన్స్ హైలెట్

ఇందులో నా పై చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు కొత్తగా వుంటాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను ఈ రోజు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాంఅన్నారు.


స్పెషల్ ట్రైనింగ్

స్పెషల్ ట్రైనింగ్

ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం మంచు విష్ణు స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు.స్పెషల్ ఎట్రాక్షన్స్

స్పెషల్ ఎట్రాక్షన్స్

మంచు విష్ణు న‌ట‌న‌, లుక్‌, ఫైట్ మాస్టర్ విజ‌య్ అందించిన యాక్షన్ సీక్వెన్స్‌, దేవాక‌ట్టా టేకింగ్, ప్రొడ‌క్షన్ వాల్యూస్ హైలైట్ గా ఉంటాయని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.


దర్శకుడు మాట్లాడుతూ...

దర్శకుడు మాట్లాడుతూ...

''యాక్షన్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. విష్ణు నటన, ఆయన లుక్‌ ఆకట్టుకొంటాయి. చెవిపోగు, టట్టూతో విష్ణు కొత్తగా కనిపిస్తారిందులో. విజయ్‌ నేతృత్వంలో తెరకెక్కించిన యాక్షన్‌ సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణ'' అన్నారు.


ఆడియో హిట్

ఆడియో హిట్

యువ సంగీత దర్శకుడు అచ్చు సంగీతం అందిచిన పాటలు ఇప్పటికి అందరికి నచ్చాయిడైలాగ్స్

డైలాగ్స్

ఎప్పటిలాగే దేవకట్టా తన మార్కు డైలాగ్స్ ని సినిమాలో చూపారులుక్ సూపర్బ్

లుక్ సూపర్బ్

సినిమాలో చెవికి పోగులు, గడ్డంతో డిఫెరెంట్ లుక్ తో ఉన్నారు.చేతి పొడవునా

చేతి పొడవునా

ఈ సినిమాలో మంచు విష్ణుకు చేతి పొడువునా టట్టూ ఉంటుందిటైటిల్ కు తగ్గట్లే

టైటిల్ కు తగ్గట్లే

సినిమా టైటిల్ తగ్గట్లే డైనమిక్ గా ఉంటుందని అంటున్నారుఅవసరం

అవసరం

ఇప్పుడు దర్శకుడు దేవకట్టాకు, హీరో మంచు విష్ణుకు ఇద్దరికీ హిట్ అవసరం


మెప్పు పొందాడు

మెప్పు పొందాడు

‘వెన్నెల', ‘ప్రస్థానం', ‘ఆటోనగర్ సూర్య' సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మరియు విమర్శకుల మెప్పు పొందిన డైరెక్టర్ దేవకట్ట .ధ్రిల్లర్

ధ్రిల్లర్

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా విక్రమ్ ప్రభు హీరోగా, ప్రియ ఆనంద్ హీరోయిన్ గా తమిళంలో ఘన విజయం సాధించిన ‘అరిమ నంబి'కి రీమేక్.


English summary
Dr. M. Mohan Babu at Krishna Teja Theater, Tirupati at Manchu Vishnu's 'Dynamite'‬ premier show . It’s the remake of Tamil hit “Arima Nambi” and has Deva Katta directed it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu