»   » ప్రముఖులతో మోహన్ బాబు పుట్టిన రోజు వేడుకలు(ఫోటోలు)

ప్రముఖులతో మోహన్ బాబు పుట్టిన రోజు వేడుకలు(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

తిరుపతి : పద్మశ్రీ డాక్టర్‌ మోహన్‌బాబుకు జన్మదిన వేడుకలను తిరుపతిలోని తన శ్రీ విద్యా నికేతనలో జరుపుకున్నారు. ఆయన పుట్టిన రోజుని పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచ అభిమానులు వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో మోహన్ బాబు కుటుంబ సభ్యులుతో పాటు ఆయన శ్రేయాభిలాషులు,దాసరి,రాఘవేంద్రరావు,రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకులు పాలుపంచుకున్నారు.

తిరుపతి సమీపంలోని రంగంపేట శ్రీవిద్యానికేతన్‌కు బుధవారం రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు. గజమాలతో మోహన్‌బాబును సత్కరించారు. అంతకుముందు మోహన్‌బాబు అభిమానుల మధ్య కేక్‌ కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు.

మోహన్ బాబు... మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు రావడం, వారి మధ్య నా జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తాను ప్రధాన కథానాయకుడిగా నటించిన 'రౌడీ' చిత్రం ఈ నెలాఖరులో విడుదల కానుందని, అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా చిత్ర నిర్మాణం జరిగిందని వెల్లడించారు.

కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి తమ అభిమాన హీరో ఆదర్శనీయులని, నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో గడపాలని కలియుగ వేంకటేశ్వరుడు, షిరిడి సాయినాధ్‌ను వేడుకుంటున్నట్లు మంచు విష్ణు, మనోజ్‌ యువసేన రాష్ట్ర అధ్యక్షులు సునీల్‌ చక్రవర్తి ఆకాంక్షించారు. కార్యక్రమంలో అభిమానుల సంఘం నాయకులు కుమార్‌, ప్రమోద్‌, బాల, ప్రదీప్‌, గోపి, హేమంత్‌, ప్రవీణ్‌, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

పుట్టిన రోజు ఫోటోలుతో స్లైడ్ షో...

జననం

జననం

మోహన్ బాబు చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం మోదుగులపాళెం లో 19 మార్చి 1952న జన్మించాడు. ఆయన జన్మనామం మంచు భక్తవత్సలం నాయుడు. ఆయనకు ముగ్గురు తమ్ముళ్లు - రంగనాధ్ చౌదరీ, రామచంద్ర చౌదరీ మరియు క్రిష్ణ, ఒక సోదరి విజయ ఉన్నారు.

విద్యాభ్యాసం..ఉద్యోగం

విద్యాభ్యాసం..ఉద్యోగం

ఈయన విద్యాభ్యాసం ఏర్పేడు, మరియు తిరుపతిలో జరిగింది. ఈయన చెన్నై లో భౌతిక శాస్త్రంలో డిగ్రీని పూర్తి చేశాడు. సినీరంగంలో ప్రవేశించడానికి ముందు కొంతకాలం వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.

అసెస్టెంట్ గా ..

అసెస్టెంట్ గా ..

మోహన్ బాబు 1970ల ప్రారంభంలో అర్థ దశాబ్దంపాటు దర్శకత్వ విభాగంలో కూడా పనిచేశారు. స్వర్గం నరకం చలన చిత్రంతో తెలుగు తెరకు పరిచమయ్యాడు.

పేరు మార్చుకుని..

పేరు మార్చుకుని..

సినీరంగ ప్రవేశంతో మోహన్ బాబుగా మార్చుకున్నాడు. దర్శకరత్న డాక్టర్‌ దాసరి నారాయణ రావు శిష్యుడిగా గుర్తింపు పొందారు. దాసరి దర్శకత్వంలో వచ్చిన స్వర్గం నరకం సినిమాలో మోహన్‌ బాబుకు ప్రధాన పాత్రలో నటించే అవకాశం లభించింది.

నిర్మాతగా...

నిర్మాతగా...

నటుడుగా ఆయన అనేక హిట్‌ చిత్రాల్లో నటించి సినిమా నిర్మాతగా కూడా మారారు. లక్ష్మీ ప్రసన్న బ్యానర్ పై అనేక హిట్ చిత్రాలు నిర్మించారు..నిర్మిస్తూ ఉన్నారు.

కొనసాగుతూ..

కొనసాగుతూ..

విలన్‌గా, క్యారెక్టర్‌ నటుడిగా, హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆయన కళాప్రతిభకు పద్మ శ్రీ పురస్కారం లభించింది. తాజాగా ఆయన నటించిన రౌడీ చిత్రం సైతం రిలీజ్ అవుతోంది.

అధ్యక్షుడిగా...

అధ్యక్షుడిగా...

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పని చేశారు. తెలుగు సినిమా రంగంలో ఇప్పటికీ క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. రంగంపేట లో శ్రీ విద్యానికేతన్‌ విద్యాసంస్థలు స్థాపించారు.

మొత్తం..

మొత్తం..

మోహన్ బాబు 510 చలన చిత్రాల్లో నటించారు, వీటిలో 216 చలన చిత్రాల్లో ప్రధాన పాత్రలో నటించారు. ఆయన చిత్రాల్లో పెదరాయుడు వంటి కొన్ని చిత్రాలు సత్యం మరియు న్యాయం కోసం అన్నింటినీ త్యజించాలని సందేశాత్మక చిత్రాలు ఉన్నాయి. ఒకానొక సమయంలో, అతను నటించిన లేదా నిర్మించిన చిత్రాలను తెలుగు ఛానెళ్లల్లో ఏదో ఒకదానిలో దాదాపు ప్రతిరోజు ప్రసారం అవుతుంటాయి.

విలన్ గానూ..

విలన్ గానూ..

నటుడిగా ఆయన విలన్ పాత్రలను పోషించి ఎలా మెప్పించాడో హీరోగా కూడా అలా మెప్పించాడు. విలనిజంలో కామెడీ జోడించన పాత్రలకు ఆయన జీవం పోషాడు. ఆయన విలన్ పాత్ర ల నుండి హీరో పాత్రలకు పరిమితమయ్యారు. అయితే విలన్ గా ఆయన స్థానాన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ బర్తీ చేయలేక పోయారు అనడంలో అతిశయోక్తి లేదు.

రాజ్య సభ సబ్యుడుగా...

రాజ్య సభ సబ్యుడుగా...

రాజకీయాల్లో ప్రవేశించి రాజ్యసభ సభ్యుడిగా ఒక పర్యాయం పదవిని అలంకరించారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

కుమారుడుతో కలిసి...

కుమారుడుతో కలిసి...

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన రౌడీ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమాలో తన పెద్ద కుమారుడు మంచు విష్ణుతో కలిసి నటించాడు. ఏప్రియల్ 4 న చిత్రం విడుదల కానుంది.

English summary
King Mohan Babu who is currently busy with his upcoming film ‘Rowdy’, is celebrated his 62nd birthday at Sri Vidyanikethan, Tirupati.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu