»   » నా కులం నాకు గొప్పే... పోసాని సంచలన స్పీచ్, మోహన్ బాబు ప్రశంస!

నా కులం నాకు గొప్పే... పోసాని సంచలన స్పీచ్, మోహన్ బాబు ప్రశంస!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నటుడు మోహన్ బాబు పుట్టినరోజు వేడుకకు హాజరైన తెలుగు నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఈ సందర్బంగా ఆసక్తికర స్పీచ్ ఇచ్చారు. ఈ ప్రసంగంలో మోహన్ బాబుపై పొగడ్తలు గుప్పించిన పోసాని... అనంతరం సమాజంలో కులం కుళ్లు, రాజకీయాల్లో కులం, మతం ప్రభావం గురించి మాట్లాడారు.

మోహన్ బాబు గారు అందరూ మాట్లాడాక నాకు మైకు ఇచ్చారు. నేను మాట్లాడటానికి ఏమీ మిగల్లేదు. మంచు మనోజ్ వచ్చి అంత ఆవేశంగా మాట్లాడగానే ఉన్న నాలో ఉన్న కాస్త ఆవేశం కూడా పోయింది. ఆ లెవల్లో ఎమోషనల్ గా మనోజ్ మాట్లాడాడు. మోహన్ బాబు గారు... మనోజ్ ను మీరు చేస్తే ఈ రాష్ట్రానికి ముఖ్య మంత్రిని చేయండి.. లేదా పెద్ద మావోయిస్టును చేయండి. అప్పుడే మంచు మనోజ్ కోరికలు, ఆశలు, ఆశయాలు అన్ని నెరవేరుతాయి.... అంటూ పోసాని వ్యాఖ్యానించారు.

నథింగ్ బట్ ఎవరెస్ట్

నథింగ్ బట్ ఎవరెస్ట్

భారత దేశం స్వతంత్రం గుర్తొస్తే మహాత్మా గాంధీ గుర్తొస్తాడు. ప్రపంచం మానవత్వం గురించి మాట్లాడితే మధర్ థెరిస్సా గుర్తొస్తుంది. భారత దేశంలో ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే మోహన్ బాబు గారు గుర్తొస్తారు. మోహన్ బాబు గారు యూ ఆర్ స్వీటెస్ట్, యూ ఆర్ హాటెస్ట్. యూ ఆర్ హానెస్ట్, యూ ఆర్ లేటెస్ట్ నథింగ్ బట్ ఎవరెస్ట్... అంటూ తనదైన రీతిలో పొగడ్తలు గుప్పించారు పోసాని.

మోహన్ బాబులో జంతులక్షణాల్లేవు

మోహన్ బాబులో జంతులక్షణాల్లేవు

మోహన్ బాబు గారి గురించి చాలా మంది పొగిడారు. నేను మోహన్ బాబు గారి గురించి పొగడటానికి ఏమీ లేదు. ఎందుకంటే మోహన్ బాబు గారిలో ఎలాంటి ఎక్స్‌ట్రార్డినరీ క్వాలిటీస్ లేవు. మోహన్ బాబు గారు మామూలు మనిషి, ఆయనలో వందకు వంద శాతం మనిషి లక్షణాలే ఉన్నాయి. జంతు లక్షణాలు అస్సల్లేవు అంటూ పోసాని వ్యాఖ్యానించారు.

మనిషికి, జంతువుకి అదే తేడా

మనిషికి, జంతువుకి అదే తేడా

మనిషి లక్షణాలంటే... నవ్వొచ్చింది పెద్దగా నవ్వుతారు మోహన్ బాబుగారు, కోపం వచ్చిందంటే పెద్దగా కోప్పడతారు. కన్నీళ్లు వచ్చాయంటే పెద్దగా దు:ఖిస్తారు. ఆవేశం వస్తే పెద్దగా ఆవేశ పడతారు. ప్రేమ వచ్చిదంటే భారత దేశం అంత ప్రేమ చూపిస్తారు. కొంత మందికి నవ్వు వస్తుంది కానీ నవ్వరు. మోహన్ బాబుగారు ఏమనుకున్నారో వోల్ హార్టెడ్ గా చేస్తారు. కొంత మంది విషయంలో వీడు నక్క లాంటోడుని, పిల్లిలాంటోడని, పాములాంటోడని, సింహం లాంటోడి, పులి లాంటోడని పోలుస్తుంటారు. మనుషుల్లో జంతువుల లక్షణాలు చాలా ఎక్కువైపోయినాయి. అలాంటి జంతువు లక్షణాలు ఒక్క శాతం కూడా లేని వ్యక్తి మోహన్ బాబు. అందుకే మోహన్ బాబు సాధారణమైన మామూలు మనిషి లక్షణాలున్న మనిషి అని నేను చెబుతున్నాను... అంటూ పోసాని పొగడ్తలు గుప్పించారు.

నాది కమ్మ కులం

నాది కమ్మ కులం

నిజాయితీగా చెబుతున్నా నేను కమ్మ. నా కులం నాకు గొప్పది. మీ మతం మీకు గొప్పది. నా మతం నాకు గొప్పది. సొసైటీ ఎలా అయిపోయిందంటే... కుక్క మరో కుక్కను దగ్గరకు రానిస్తుంది, గొర్రె మరో గొర్రెను దగ్గరకు రాణిస్తుంది. బర్రె మరో బర్రెను దగ్గరకు రాణిస్తుంది. కానీ మనిషి ఇంకో మనిషిని దగ్గరకు రానివ్వట్లేదు. వీడు మా కాస్టోడు, వీడు మా మతం వాడు, వీడు హిందూ, వీడు ముస్లిం, వీడు మా క్రిస్టియన్ అని సొసైటీని ముక్కలు ముక్కలుగా చేసి పంచుకుంటుంటే పక్క మనిషి మన దగ్గరకు ఎలా వస్తాడు. వాడి దగ్గరికి మనం ఎలా వెళతాం... అంటూ పోసాని తనదైన రీతిలో కుల పక్షపాతంపై కామెంట్స్ సందించారు.

ఓటు విషయంలో కులం వద్దు

ఓటు విషయంలో కులం వద్దు

ప్రేమించండి మీ కులాన్ని, మీ మతాన్ని, మీ దేశాన్ని, మీ అమ్మని, నాన్నను... వంద శాతం ప్రేమించండి పక్కవాడు బాధ పడకుండా. మీరు రేపు సొసైటీలోకి వస్తున్నారు. రేపు మీరు ప్రజాస్వామ్యంలోకి అడుగు పెట్టాక ఓటు వేసే రెస్పాన్సిబిలిటీ వస్తుంది. విడిగా మీకు కులం పిచ్చి, అభిమానం ఉండొచ్చు. ఓటు వేసే విషయంలో మాత్రం కులాన్ని పక్కన పెట్టండి. మతాన్ని పక్కన పెట్టండి... అంటూ పోసాని మోహన్ బాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న శ్రీవిద్యానికేతన్ విద్యార్థులకు సూచించారు.

హాట్సాఫ్ అన్న మోహన్ బాబు

హాట్సాఫ్ అన్న మోహన్ బాబు

పోసాని కులం, ఓటు గురించి అలా మాట్లాడుతుంటే... మధ్యలో కల్పించుకుని మైక్ అందుకున్న మోహన్ బాబు హాట్సాఫ్ తమ్మూడు అంటూ పోసానిని ఎంకరేజ్ చేసారు.

ఒక ఎదవ ఎమ్మెల్యే అయితే సొసైటీ మొత్తం నాశనం

ఒక ఎదవ ఎమ్మెల్యే అయితే సొసైటీ మొత్తం నాశనం

నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసా, ఇవన్నీ అనుభవించా. చిరంజీవి గారు నాకు టిక్కెట్టు ఇచ్చారు. నా వద్ద ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. నేను ఎన్నికల సమయంలో డబ్బు పంచలేదు, మద్యం పంచలేదు. నా కారులో పెట్రోలు నేనే పోయించుకున్నాను. నా వెంట తిరిగిన కార్యకర్తలకు అన్నం మాత్రమే పెట్టాను. మొత్తం 7 లక్షలు ఖర్చు పెట్టాను. నాకు పోటీగా చేసిన వారిలో ఒకడు 13 కోట్లు, ఒకడు 11 కోట్లు పెట్టాడు. 13 కోట్లు పెట్టిన వాడు గెలిచాడు. డబ్బు తీసుకుని, కులం చూసి ఓటు వేయడం ద్వారా ప్రశ్నించే హక్కును మనం కోల్పోతాం. ఒక ఎదవ ఎమ్మెల్యే అయితే సొసైటీ మొత్తం నాశనం అవుతుంది... అంటూ పోసాని వ్యాఖ్యానించారు.

English summary
Producer turned writer turned actor Posani Krishna Murali has given Sensational Speech in Mohan Babu Birthday Celebrations.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu