twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓ వైపు పవన్ కళ్యాణ్ హీట్.... మరో వైపు మోహన్ బాబు సంచలనం

    By Bojja Kumar
    |

    తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రముఖ నటుడు మోహన్ బాబు సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఆయన గత కొన్ని రోజులుగా మోహన్ బాబు డైలాగ్స్ పేరుతో తరచూ పోస్టులు చేస్తున్నారు. మరి తాజాగా చేసిన పోస్ట్ కావాలని ప్రస్తుత పరిణామాలను టార్గెట్ చేస్తూ చేసిందా? లేక కాకతాళీయంగా ఆయన చేసిన పోస్టు.... ప్రస్తుత పరిణామాలకు లింక్ అయిందా? అనే చర్చ సాగుతోంది.

    Recommended Video

    Pawan Kalyan Starts Tweets War On Telugu News Channels On Sri Reddy Issue

    ఈ దేశంలో ఎక్కడున్నాడు మంచి పొలిటీషియన్

    "మహాత్మా.. నువ్వు స్వాతంత్య్రం తెచ్చిన ఈ దేశంలో ఎక్కడున్నాడు మంచి పొలిటీషియన్.. ఎక్కడ చూసినా అంతా పొల్యూషన్.. దీనికుంది ఒకే ఒక సొల్యూషన్.. అదే.. అదే.. పీపుల్ రెవల్యూషన్.." అంటూ మోహన్ బాబు వ్యాఖ్యానించారు. ఇది ఆయన నటించిన అడవిలో అన్న సినిమాలోని డైలాగ్. అయితే ఈ సందర్భంగా ఆయన ఈ పోస్టు చేయడం చర్చనీయాంశం అయింది.

    పవన్ కళ్యాణ్ హీట్ నేపథ్యంలో

    ఓ వైపు పవన్ కళ్యాణ్ హీట్ నేపథ్యంలో మోహన్ బాబు ఈ కామెంట్స్ చేయడం గమనార్హం. తన తల్లిని నడిరోడ్డు మీద అసభ్యంగా తిట్టించి అత్యంత దారుణంగా వ్యవహరించారంటూ పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీపై కూడా ఆయన మండిపడ్డారు. ఈ కుట్ర వెనక ఈ ముగ్గురే కారణమంటూ ఆయన మరో ట్వీట్ చేశారు. టీవీ9 రవిప్రకాశ్, శ్రీని రాజు, రామ్ గోపాల్ వర్మల ఫొటోలను ట్విట్టర్లో ఆయన పోస్టు చేశారు.

    పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు

    తన తల్లిని దూషించడంతో పవన్ కళ్యాణ్ ఇష్యూను చాలా తీవ్రంగా తీసుకున్నారు. వరుస ట్వీట్లతో తన ఆందోళనను తీవ్రం చేస్తున్నారు.

    ఏబీఎన్ రాధాకృష్ణ ఫోటోతో ట్వీట్

    ఏబీఎన్ అధినేత రాధాకృష్ణ ఫోటోతో కూడా పవన్ కళ్యాణ్ ఓ ట్వీట్ చేశారు.

    మీడియా తీరుపై తీవ్రంగా

    ఒకప్పుడు దొరలు అంటే భూస్వాములు కానీ ఇప్పుడు దొరలంటే ఈ మీడియా ఆసాములు ..వారు చెప్పిందే వేదం ,వారి పాడిందే నాదం... అంటూ పవన్ కళ్యాణ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

    English summary
    Tollywood star Mohan Babu hot comments on Telugu states political scenario.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X