twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొన్ని చేయలేక పోయాం, మా అసమర్ధతే: దాసరి ఆస్తుల పంపకంపై మోహన్ బాబు

    |

    'దాసరి టాలెంట్ అకాడమీ' 2019 సంవత్సరానికి గాను షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌లో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానోత్సవం హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు, జయసుధ, తమ్మారెడ్డి భరద్వాజ, ఆర్.నారాయణమూర్తి, సి.కళ్యాణ్ తదితరులు హాజరయ్యారు.

    ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ... గురువుగారు బ్రతికుండగానే ఆయన గురించి ఎన్నో విషయాలు చెప్పాను. ఇపుడు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. నా వంతుగా నేను ఆయనకు చేయాల్సింది చేశాను. దాసరి పేరుతో 500 మంది విద్యార్థులు కూర్చుని చదువుకునే వీలుగా తిరుపతిలో ఆసియాలోనే ది బెస్ట్ ఆడిటోరియం కట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మోహన్ బాబు... దాసరి ఆస్తుల పంపకం ప్రస్తాన తీసుకొచ్చారు.

    అన్ని బాధ్యతలు నన్నే చూసుకోమన్నారు

    అన్ని బాధ్యతలు నన్నే చూసుకోమన్నారు

    ‘‘నేను ఎప్పుడూ మా గురువుగారితో... మీ షాడోలో మేము బ్రతకాలండీ, మీ కంటే ముందు మేము పోవాలని చెప్పేవాడిని'' అని మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. ‘నేను వెళితే అన్నీ చూసుకోవాల్సిన బాధ్యతలు మోహన్ బాబుదే' అని గురువుగారు నా 40వ సంవత్సరం వేడుక జరుగుతున్నపుడు చెప్పినట్లు వెల్లడించారు.

    ఆస్తుల పంపకం విషయంలో మా ప్రమేయం ఉండాలనే

    ఆస్తుల పంపకం విషయంలో మా ప్రమేయం ఉండాలనే

    ‘‘దాసరిగారు తన వీలునామాలో కూడా మోహన్ బాబు, మురళీ మోహన్ అని పేర్లు వేయించారు. ఆస్తుల పంపకాల విషయంలో ఏ బిడ్డకూ అన్యాయం జరుగకుండా చూడాలనే ఉద్దేశ్యంతో మా పేర్లు అందులో రాయించారు. కొన్ని చేశాం. కొన్ని చేయలేక పోయాం. కారణాలు అనేకం. జయసుధకు తెలుసు, ఆ కుటుంబానికి తెలుసు. చేయలేక పోవడానికి కారణం మా అసమర్దతే.'' అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

    సూచించిన వ్యక్తికి ఉచితంగా విద్య

    సూచించిన వ్యక్తికి ఉచితంగా విద్య


    ‘‘నేను కూడా భోజనానికి ఇబ్బంది పడ్డాను, కారు షెడ్డులో ఉన్నాను. డబ్బు విలువ తెలుసు. దాసరి టాలెంట్ అకాడమీ వారు సూచించిన ఒక స్టూడెంట్‌కి మా విద్యా సంస్థలో ఎల్.కె.జీ నుంచి ప్లస్‌టు వరకు ఉచిత విద్య అందిస్తాను.'' అని మోహన్ బాబు ప్రకటించారు.

    షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ప్రతి ఏడాది కొనసాగిస్తాం

    షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ప్రతి ఏడాది కొనసాగిస్తాం


    దాసరికి నివాళిగా తలపెట్టిన షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ప్రతి ఏడాది కొనసాగిస్తామని దాసరి టాలెంట్ అకాడమీ అధినేత బి.ఎస్.ఎన్.సూర్యనారాయణ అన్నారు. ప్రధమ బహుమతిగా 'పసుపు-కుంకుమ'కు లక్ష రూపాయలు, రెండో బహుమతి 'మాతృదేవోభవ'కి 50 వేలు, మూడవ బహుమతి 'తాతా మనవడు'కి 25 వేలుతో పాటు.. మొదటి జ్యూరీ అవార్డు 25 వేలు, రెండవ జ్యూరీ 15.000/-, ఉత్తమ దర్శకుడు 20.000/-, ఉత్తమ కథా రచయిత 10.000/-, ఉత్తమ నటుడు 10,000/-, ఉత్తమ నటి 10.000/- చొప్పున నగదు బహుమతులు అందజేశారు.

    English summary
    Mohan Babu Emotional Speech At Dasari Talent Academy Short Film Contest 2019. Dasari Talent Academy Short Film Contest press meet held at Prasadlabs Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X